ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -154
59-అత్యంత వివాదాస్పద బ్రిటిష్ ప్రధాని –సర్ విన్ స్టన్ చర్చిల్ -7(చివరి భాగం )
79వ చర్చిల్ పుట్టిన రోజును ప్రపంచ వ్యాప్తంగా ధూమ్ ధాం గా నిర్వహించారు .ఈ సందర్భంగా ‘’చర్చిల్ బై హిస్ కాంటే౦ప రరీస్ ‘’అనే పుస్తకాన్ని విడుదల చేశారు .అందులో ఎందరో ప్రసిద్ధులు చర్చిల్ యుద్ధ విలేకరిగా ,నవలా రచయితగా ,కళాకారునిగా ,హాస్య రచయితగా ,,వక్తగా ,సైనికుడిగా ,పార్ల మెంటేరియన్ గా ,రాజకీయ ప్రతిపక్ష నాయకుడిగా ,నిర్వహించి ప్రదర్శించిన బహు ముఖ ప్రజ్ఞా విశేషాలను నిండు మనసుతో రాశారు .అన్నిటికన్నా ప్రముఖ రచయిత జార్జ్ బెర్నార్డ్ షా ‘’ప్రతిభగల వ్యక్తి చర్చిల్ ‘’అని రాసి ఆయనకు రెండు టికెట్లు పంపుతూ తన నాటకాన్ని ఆవిష్కరించమని కోరుతూ ‘’మీరు మొదటి ఆటకే రండి .మీకు స్నేహితుడనే వాడెవరైనా ఉంటె వెంట తీసుకొని రండి ‘’అని ‘’ఎటకారం గా ‘’రాసి ఆహ్వానించాడు .ఘటికుడు చర్చిల్ తక్కువ వాడా ! వెంటనే జవాబు రాస్తూ ‘’ప్రారంభ రాత్రి ఆటకు రాలేనంత పని ఒత్తిడిలో ఉన్నాను .కాని రెండో ఆటకు రాగలను –ఒక వేళ రెండో ఆట ఉంటె ‘’అని ఝలక్ ఇచ్చాడు .
చర్చిల్ మాటలు తూటాల్లాగా పేల్తాయి .వాటిలో హాస్స్యం చమత్కారం వ్యంగ్య వైభవం మినుకు మినుకుమనే తెలివి తేటలు కలిసే ఉంటాయి .వీటినన్నిటినీ కలిపి ‘’ఎ చర్చిల్ రీడర్ ‘’గా లోకం లో నిలిచి పోయాయి .అందులో కొన్ని .1-మొండి వాడు అంటే తన మనసును ఎప్పుడూ మార్చుకోని వాడూ ,తానూ మాట్లాడే విషయాన్ని మార్చని వాడు .2-వ్యక్తిగతంగా నేను నేర్చుకోవటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను నాకు ఎవరిదగ్గరా నేర్చుకోవాలని లేకపోయినా .3-తెలివిగాలవాడేవడైనా యుద్ధం లో జయించటానికి ప్రణాలికలు తయారు చేస్తాడు ,వాటి అమలు కోసం బాధ్యత తీసుకో కుండా .4-ప్రపంచం కలిసి ఉంటె విడిపోయి ఉన్నదానికంటే గొప్ప .కాని ప్రపంచం ధ్వంసం కాకుండా విడి పోయి ఉండటం మేలు .
79వ సంవత్సరం మధ్యలో ఈ బహు రంగుల బహు భంగుల,వివాదాస్పద మేధావిని ‘’నైట్ ఆఫ్ ది మోస్ట్ నోబుల్ ఆర్డర్ ఆఫ్ ది కార్టర్ బై ఎలిజబెత్ ది సెకండ్ ‘’చేసి గౌరవించారు .కొన్ని నెలల తర్వాత విన్ స్టన్ చర్చిల్ కు ప్రపంచ ప్రసిద్ధ నోబెల్ సాహిత్య బహుమతిని అందజేసి గౌరవాన్ని రెట్టింపు చేశారు .అయన రచనలకు మాత్రమే ఇచ్చిన బహుమతి కాదు ,ఆయన చేసిన యుద్ధ ఉపన్యాసాలకు కూడా చెందుతుంది .నోబెల్ అవార్డ్ నిస్తూ ‘’for his wartime speeches against a ‘’monstrous tyranny never surpassed in the dark ,lamentable catalog of human crimes ‘’అని అభి వర్ణించింది ఆ సంస్థ .స్వీడిష్ అకాడెమి చర్చిల్ ను ఆహ్వానించి సత్కరించి పురస్కార ప్రదానం చేస్తూ ‘’for his mastery of historical and biographical description ,as well as the brilliant art of oration with which he has defended human values ‘’అని ప్రశంసించింది మానవీయ విలువల పరి రక్షణకు చర్చిల్ చేసిన సేవకు ఇది ఘనమైన కితాబు బహుమతి ,ఆ ‘’పాదరస బహు-మతి ‘’చర్చిల్ కు .
ఆయన మహా వక్త్రుత్వానికి , చరిత్రకు అందుకొన్న గొప్ప అవార్డ్ అది .ఆయన రచనలో ఉన్న నిబద్ధతకు ,ఆయనే చెప్పిన ‘’పనిలో నైతికత ‘’(మొరల్ ఆఫ్ ది వర్క్)కు అది నిదర్శనం .చర్చిల్ మాటలు మంత్రాలు లాపనిచేశాయి .వాటి ప్రభావం అనిర్వచనీయం .కొన్ని చర్చిల్ మాటల మంత్రాలు –‘’In war ,Resolution .In Defeat ,Defiance .In victory ,Magnanimity .In peace ,Good will .ఈ విషయం లో రచయిత లూయీ అంటర్ మేయర్ అన్నమాటలు ‘’It was a motto worthy of being borne on the proudest shield and the loftiest banner ‘’ఆ యుద్ధ వీరునికి కీర్తి పతాకలు .ఇంతటి కీర్తి ఘనుడు చర్చిల్ 24-1-1965న 91ఏళ్ళు జీవించి కీర్తి కాయాన్ని వదిలేసి అమరుడైనాడు .ఆయన అంత్య క్రియలకు చైనా తప్ప అన్ని దేశాల ప్రతి నిధులు హాజరైనారు .350 మిలియన్ ల ప్రజలు టెలివిజన్ లో వీక్షించారు .సైనిక లాంచనాలతో 19గన్ సాల్యూట్ తో మహా గౌరవ ప్రదంగా ప్రభుత్వం నిర్వహించింది .డల్లాస్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో చర్చిల్ పెయింటింగ్ లను చూడవచ్చు .
ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ ,బి బి సి నిర్వహించిన 2002. ప్రపంచ ప్రసిద్ధ వందమంది నాయకులలో చర్చిల్ సర్వ ప్రధముడుగా ఎన్నికైనాడు .’’ఆనరరి సిటిజెన్ ఆఫ్ అమెరికా ‘’గా ఆ ప్రభుత్వం గౌరవించింది .రోచెస్టర్, మియామి మొదలైన ఎన్నో యూని వర్సిటీలు గౌరవ డాక్త రేట్ ప్రదానం చేశాయి .వివాదాస్పద ప్రధాని అయినా చారిత్రిక పురుషుడు ,మన కృష్ణ దేవరాయలులాగా ‘’సాహితీసమరాంగణ బ్రిటిష్ సార్వ భౌమ ప్రధాని చర్చిల్’’ .మహా రాజకీయ దురంధరుడు .చరిత్రను ఒక మలుపు తిప్పిన లెజెండ్ చర్చిల్
.
.
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-5-16-ఉయ్యూరు

