ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -155
60-జర్మన్ సంగీత స్రష్ట ,ఆర్గాన్ నిర్మాత ,వేదాంతి –ఆల్బర్ట్ స్క్వీజర్(Albert Schweitzer)
‘’రోతను పుట్టించే ఆలోచన లతో పూర్తిగా నిండి ఉన్న యుగ వైఖరికి రోసి ఉన్నాను .ఆలోచన తనను తానుచక్కబరచుకోకుండా ఇప్పటి వరకు తన లక్ష్యాన్ని సాధించలేదు .ఈ విపత్కర కల్లోలాన్నుంచి బయట పడాలంటే వాస్తవ నాగరకత ఆదర్శాల సంరక్షణ కింద ఉండాల్సిందే ‘’అని,అన్నది పరిపక్వత లేని ఫిలాసఫర్ కాదు . ,తన పరిధిని నైరూప్య సరిహద్దులో ఉన్ననిరంతర కార్య కర్త అయిన ఒక ప్రీచర్ ,సంగీత సృజన శీలి ,సంగీత వాద్య నిర్మాత , ,నాగరికతను బహిష్కరించి ,హాయిగా సాగే వృత్తికి తిలోదకాలిచ్చి ,తన జీవిత కాలమంతా సభ్యతా సంస్కారం లేదని మనం అనుకొంటున్నఆటవిక జాతులతో అరణ్యాలలో కలిసి జీవించిన ఆల్బర్ట్ స్క్వీట్జేర్ .ఇప్పటికే ఆయన అంటే ఏమిటో అర్ధమై పోయి ఉంటుంది .
యోగ పురుషులలో ఒకరుగా గుర్తి౦పబడి న ఆల్బర్ట్ స్క్వీజర్ 14-1-1875న జర్మన్ ఆల్సేస్ లోని కేసర్స్ బెర్గ్ లో జన్మించాడు .తలి దండ్రుల వైపుకు చెందినవార౦దరూ మినిస్టర్ లు ,సంగీత కారులే .తాత ఆల్సేషియన్ ఆర్గ నిస్ట్ ,స్కూల్ మాస్టారు .ఆయన సోదరులూ ఇంతే .మాతామహుడు ఒక పాస్టర్,.తండ్రి ఇవాంజెలికల్ కాంగ్రి గేషన్ నాయకుడు .తండ్రి అయిదుగురు సంతానం లో ఆల్బర్ట్ రెండవ వాడు .ఇతనికి ముగ్గురు సోదరిలు ,ఒక తమ్ముడు ఉన్నారు .అయిదవ ఏటనే పియానో తో కమ్మని స్వరాలు ఒకే వేలితో పలికించిన బాల మేధావి .ఏడవ ఏటనే ‘’పార్లోరోర్గాన్ ‘’పై స్వంత ఏకస్వరాలను (హార్మనీస్ )వాయించిన దిట్ట .9వ ఏట గ్రూయిన్స్ బాక్ చర్చి లో ప్రార్ధనలో ఆర్గనిస్ట్ రాకపోతే తానే వాయించి అబ్బుర పరచాడు .చదువు ఆల్సేషియన్ స్కూల్స్ లో సాగింది .నేచురల్ సైన్స్ పై అభిమానం ఎక్కువ .చార్లెస్ మేరీ విండర్ అనే ప్రఖ్యాత ఫ్రెంచ్ ఆర్గనిస్ట్ వద్ద వీలున్నప్పుడల్లా పాఠాలు నేర్చాడు .18వ ఏట స్త్రాస్ బర్గ్ యూని వర్సిటి లో చేరాడు .ఇక్కడే టెక్నాలజీ ని సంగీతాన్ని అభ్యసించాడు .యవ్వనం నుంచే ప్రముఖ సంగీతకారులు బాష్ అన్నా ,జీసస్ అన్నా ఆరాధనా భావం ఉండేది .22ఏళ్ళ వయసులో ఫిలాసఫీ చదవటానికి పారిస్ లోని సాన్ బారన్ వెళ్ళాడు .వెండర్ దగ్గర ఆర్గాన్ నేర్చి బాగా అభి వృద్ధి చెందాడు .జర్మనీలో అంతకు ముందు ఎవరూ నేర్వని’’ ప్లాస్టిక్ స్టైల్’’ ను అలవరచుకొన్నాడు.
ఇరవై నాలుగవ ఏట ఫిలాసఫీలో డిగ్రీ పొంది ,స్త్రాస్ బర్గ్ లోని సెయింట్ నికొలాస్ చర్చ్ లో ప్రీచర్ అయ్యాడు .యూని వర్సిటీలో మత వేదాంత శాస్త్ర లెక్చరర్ గా ఎంపికయ్యాడు .లాస్ట్ సప్పర్ లోని పూర్వ క్రైస్తవమరియు బాప్టిజం అభి వృద్ధి పై ఆల్బర్ట్ కున్న అభినివేశాన్ని గమనించి ఈపదవి నిచ్చారు 1906లో ‘’ది క్వెస్ట్ ఆఫ్ దిహిస్టారికల్ జీసస్ ‘’పుస్తకం రాసి ప్రచురించాడు .అదేసమయం లో సంగీతకర్త బాష్ పై స్క్వీజర్ రాసిన ఉద్గ్రంధమూ వెలువడింది .18వ శతాబ్దికి సంగీత గ్రాండ్ మాస్టర్ బాష్ ను పూర్వ పరి శోధకులకంటే భిన్నంగాపోలీ ఫోనీ లో ఆయన మాస్టర్ అని ,క్లాసిసిస్ట్ అని ,మహాకవి అని ప్రముఖ చిత్రకారుడని ఆల్బర్ట్ సశాస్త్రీయంగా రుజువు చేశాడు .బాష్ ను గురించి రాస్తూ ‘’ఆయన సంగీతం కవితాత్మకమే కాక ,చిత్రాత్మకం కూడా .కారణం అందులోని విషయాలు కవిత్వం చిత్ర లేఖనం నుండి పురుడు పోసుకోన్నాయి .గోదిక్ ఆర్కి టేక్చర్ ను శబ్దం గా రూపాంతరం చెందించిన ఘనత బాష్ ది ‘’అని విశ్లే షించాడు .దీనికి అనుబంధంగా బాష్ వి తనవి ప్రదర్శనలను చేర్చి ‘’ది ఆర్ట్ ఆఫ్ ఆర్గాన్ బిల్డింగ్ అండ్ ఆర్గాన్ ప్లేయింగ్ ఇన్ జర్మని అండ్ ఫ్రాన్స్ ‘’ను ప్రచురించి బాష్ పై తిరుగు లేని అధారిటీ అని నిరూపించాడు .పాతవాటిని మార్చి కొత్తవి కనిపెట్టటం లో సాదికారత సాధించాడు .నమూనాలను ఆయన అంగీకారం కోసం మార్పుల కోసం పంపేవారు .అనేక సార్లు ఆయా ప్రాంతాలకు వెళ్లి పురాతన వాద్యాలను పరి రక్షించే ప్రయత్నాలు చేశాడు. మాంచి ప్రాముఖ్యాన్ని పొంది 29వ ఏట భవిష్యత్ జీవితం పై భరోసా పొందాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-6-16-ఉయ్యూరు