ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -161
62—సాంప్రదాయ ఆధునికత్వాల వారధి ప్రఖ్యాత జర్మన్ మార్మిక కవి –రైనెర్ మేరియా రిల్కే
జర్మనీ మహా కవులు గోదే ,హీన్ లతర్వాత అంతటి ప్రసిద్ధి పొందిన కవి రైనెర్ మేరియా రిల్కే .ఆస్ట్రియా కు చెందినవాడైనా జర్మనీలోనే ఉన్నాడు ఆభాషలోనే రచనా వ్యాసంగం చేశాడు .4-12-1875న ప్రేగ్ లో పాత బోహీమియన్ వంశం లో జన్మించాడు .చిన్ననాటే గొప్పవాడని పించాడు .ఒక కూతురు పసిపిల్లగా ఉన్నప్పుడే చనిపోతే తల్లి ఇతనిని అతిగారాబంగా ఆడపిల్లలాగా పెంచి ముద్దూ మురిపం చూపింది .చర్చిలో పేరు రెనీ .ఆరేళ్ళదాకా ఆడ పిల్ల వేషం లోనే పెరిగాడు .ఆడుకోటానికి బొమ్మలు ,టాయ్ కిచెన్ వంటివి ఇచ్చేది తల్లి .తల్లికి సాయం చేస్తూ వస్తువుల దుమ్ము దులిపెవాడు .ధరించిన పెద్ద గౌను ,చిన్న చామాయిస్ గ్లోవ్స్ లను చూసుకొని గర్వ పడేవాడు .
తనకు యే రకమైన పునాది లేదన్నాడు .రహస్యంగా ఉండటం అలవాటైంది .ఈ ఆడ వేషాలకు చెల్లు చీటీ ఇస్తూ తండ్రి మిలిటరీ స్కూల్ లో చేర్చాడు .పదేళ్ళ వయసులో నిత్య జీవితం లోని ఒత్తిడి తట్టుకుంటూ ,ఒంటరిజీవితానికి అలవాటు పడి ,చివరికి ఒక అంకుల్ రక్షణలో ఊపిరి పీల్చుకొన్నాడు .ఈ అంకుల్ గారి చిత్రాన్ని గీసి ఆయన్ను ఒక చక్ర వర్తి గా ఆరాధించాడు .క్రమంగా ఈ ఆరాధన భగవంతుని వైపు మరల్చాడు .మిలిటరీ స్కూల్ లో ఇబ్బంది పడ్డాడు .అయిదేళ్ళు మిలిటరీ స్కూల్ చదువు .నీళ్ళలో చాలా సేపు ఇతన్ని నిలబెట్టేవారు .పనికి మాలినవారితో జమ చేసి తిప్పలు పెట్టేవారని చెప్పుకొన్నాడు .ఈ బాధలు భరించ లేక అర్ధ రాత్రులలో మంచం మీద లేచి నిలబడి తనకు చావు ప్రసాదించమని దేవుడిని వేడుకొనేవాడు .మొరేవియాలోని సెయింట్ పోల్టన్ అనే మొదటి స్కూలు లో అనుభవించిన దారుణాలు మానసిక గాయమై జీవితాంతం వేధిస్తూనే ఉన్నాయని చెప్పుకొన్నాడు రిల్కే .
గోరు చుట్టూ మీద రోకలి పోటులాగా రిల్కే బాధలు తల్లీ తండ్రీ విడి పోవటం తో మరీ పెరిగాయి .పెదనాన్న జరోస్లోవ్ రిల్కే బాధ్యత తీసుకొని ప్రైవేట్ ట్యూటర్ లను పెట్టి చదివించాడు ఈ అంకుల్ అకస్మాత్తుగా మరణించగా ఏడేళ్ళ రిల్కీ తట్టు కోలేక ఆత్మహత్యా ప్రయత్నం చేసుకొన్నాడు .బిజినెస్ స్కూల్ లో ఒక ఏడాది లాగినా ఉపయోగ పడలేదు .ప్రేగ్ యూనివర్సిటి పరీక్ష ఇరవై వ ఏట పాసయ్యాడు .సాహిత్యం మెటాఫిజిక్స్ ,తత్వ శాస్త్ర చరిత్ర ,చదివాడు న్యాయ శాస్త్రం పై ద్రుష్టి పడింది..ఒక సెమిస్టర్ అవగానే ఆర్ట్ చదవటానికి మ్యూనిచ్ పారిపోయాడు .తర్వాత స్కూల్ చదువుకు సున్నా చుట్టి వారసత్వ ఆస్తిపై వచ్చిన కొద్దిపాటి డబ్బుతో యాత్రా సందర్శనం తో కొత్తకొత్త స్నేహితులతో ,కొద్దికాలపు అసంతృప్తి ప్రేమ వ్యవహారాలతో కాలక్షేపం చేశాడు .
1897లో వేలరీ డేవిడ్ రోన్ఫీల్డ్ అనే అమ్మాయితో ఎంగేజ్ మెంట్ ఆగి పోయాక మొదటిపుస్తకం ముద్రణకు డబ్బు ఇచ్చి ,నీట్జే ని కలవరపరచిన లూ సలోమీ35ఏళ్ళ ఆవిడతో 23వ ఏట ప్రేమలో పడ్డాడు .ఆమె ఇతనిని హృదయానికి హత్తుకోగానే అతని గుండె కుదుపులకు లోనైంది .ఇద్దరూ ప్రేమికుల అవతారం ఎత్తారు .కాని కొద్దికాలానికే విడిపోయారు .మళ్ళీ కొన్నేళ్ళ తర్వాత పెళ్లి చేసుకొన్నారు .సలోమీ రిల్కీ కి సర్వస్వం అయి ఎంతో సహకరింఛి ఆదర్శ గృహిణి అనిపించింది .నిత్య బోరు జీవితాన్నుంచి దూరం కావటానికిఒంటరి తనానికి ప్రయత్నించేవాడు .మొదటిపుస్తకం ‘’లైఫ్ అండ్ లిరిక్స్ ‘’ను 19 ఏట ముద్రించాడు .తర్వాత మూడేళ్ళకు ‘’dream crowned ‘’విడుదల చేశాడు .సోరీస్ అబౌట్ గాడ్ ,ది బుక్ ఆఫ్ పిక్చర్స్ విడుదల చేశాడు .నమ్మశక్యం కాని ఈ ప్రపంచం దాని వాస్తవికత అతన్ని కుదిపేశాయి .
22-25ఏళ్ళ మధ్య లో మ్యూనిచ్ బెర్లిన్ ,ఇటలీ ,రష్యాలు తిరిగి ప్రముఖ రష్యా రచయిత టాల్ స్టాయ్ణి కలుసుకొన్నాడు .రష్యన్ భాష నేర్చాడు .రెండో సారి రష్యా వెళ్లి వార్ప్స్ వీద్ అనే ఊళ్ళో ఉన్న ఆర్ట్ కాలనీ లో సారా వెస్ట్ హాప్స్ అనే రోడిన్ శిష్యురాలైన శిల్పిని ని చూశాడు.మరుసటి ఏడాది ఆమెను పెళ్లి చేసుకొని ఒక కూతురును కన్నాడు .పారిస్ వెళ్లి రోడిన్ నుకలిసి ,రోమ్ లో ఒక నెలగడిపి ,ఇటాలియన్ రేవేరాలోని వయా రేగియో లో కొంతకాలం ఉండి,మళ్ళీ రోమ్ వచ్చి 10నెలలు గడిపి ,స్వీడెన్ డెన్మార్క్ లలో తిరిగి ,తిరిగి పారిస్ చేరాడు .30వ ఏట రోడిన్ కు సెక్రెటరి అయ్యాడు .అననుకూలమైన రోడిన్ తోఇబ్బంది పడ్డా అతని శిల్పకళ రిల్కేను ప్రభావితం చేసింది .Rilke envisioned a poetry ,which would not be about ‘’things ‘’,but would be them a poetry which would make his objects standby themselves ,filling space with their solidity ‘’ఇదే ‘’పోయెమ్స్ ఆఫ్ థింగ్స్ ‘’.ఇందులో మానవుల లక్షణాలు ,విశ్వ లక్షణాలు ఉంటాయి దీనిపై హాన్స్ ఈగన్ హాల్తూసేన్ ‘’ under the emblem of humanity ,of selfless devotion to ‘’die Dinge ‘’the world is conquered by the all in one of feeling .అని విశ్లేషించాడు .మాయాజాలమే అయినా అర్ధమయ్యే భావన కార్యం అదే సమయం లో కర్త్రుత్వకతను వదిలి విషయ పరంగా ను మొత్తం విశ్వం లోని వస్తుపరంగానూ వ్యక్తమౌతుంది .వస్తు శక్తిని ఆడెన్ కవి అంచనా వేస్తూ ఒంటరితనం నుండి రిల్కే తన ప్రపంచాన్ని మన ముందుంచాడు అంటాడు –Rilke whom ‘’die dinge ‘’bless –the Santa Claus of loneliness ‘’.

