ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -178
68-పెనిసిలిన్ ప్రదాత –అలేక్సాండర్ ఫ్లెమింగ్ -2(చివరి భాగం )
మోల్డ్ నుంచి పెనిసిలిన్ తయారవటం ఫ్లెమింగ్ మర్యాదగా చెప్పినట్లు యాదృచ్చికం కాదు .అనేక పరిశోధనల ,పరిశీలనల ,అనుకూల పరిస్థితుల వలననే జరిగింది .దీనికి నోబెల్ బహుమానం అందుకొన్న రోజు ఫ్లెమింగ్ ‘’ అదృష్టవశాత్తు జరిగిన సంఘటనలో పెనిసిలిన్ ఏర్పడింది .అప్పుడు నేను మామూలుగా బాక్టీరియాలజీ సమస్యలపై పరిశోదిస్తున్నానే కాని బాక్టీరియా సంహారకాలపై కాని మోల్డ్ లపైకాని యాంటి సెప్టిక్క్స్,యాంటి బయోటిక్స్లపై నా ద్రుష్టి యే మాత్రం లేదు .నా మొదటి పరిశోధనా పత్రం లో మోల్డ్స్ ద్వారా యాంటి బాక్టీరియల్ పదార్ధం తయారు చేయవచ్చు అని మాత్రమె చెప్పాను .అందుకనే ఆసమస్యపై పరిశోదిస్తున్నాను .అది సత్యంకాక పోవచ్చని ,సత్యాన్ని చెప్పాలని మాత్రమె నా తపన .అప్పుడే పెనిసిలిన్ అకస్మాత్తుగా ఒక చాన్స్ గా నాకు అబ్సర్వేషన్ లో కనిపించింది .నా గొప్పతనం ఏమిటి అంటే నా శోధనను అలక్ష్యం చేయక పోవటమే .అందుకే నిరంతర శోధన చేయటం తో నన్ను బాక్టీరియాలజిస్ట్అన్నారు ‘’అని చెప్పాడు .
చాలా పరిశోధనలు లాగానే పెనిసిలిన్ చాలా కాలం ఉపేక్షకు గురైంది .’’ది సైన్స్ బుక్ ఆఫ్ వండర్ డ్రగ్స్ ‘’పుస్తకం లో డోనాల్డ్ జి.కూలే ‘making herbs extracts and so on was scarcely respectable in leading scientific circles .it was all a bit too with witch –doctorish ,savoring of superstition and folklore ,like the belief of some ignorant people that a poultice of molded bread made a wound heal more cleanly .The nature of pharmaceutical research was overwhelmingly along lines of laboratory synthesis of organic molecules and the impact of sulfas gave tremendous impettusto such directions .’’అని పూర్వ గాదాలహరి వివరించాడు .నిరంతర౦గా మోల్డ్ లను పెంచుతూ ఉన్నాడే కాని దానిపై ఏమీ చేయలేదు .పెనిసిలిన్ శక్తి తెలుసుకోవటానికి పదేళ్ళు పట్టింది .
ఫ్లెమింగ్ పబ్లిష్ చేసిన పత్రం ఇద్దరు ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి స్పెషలిస్ట్ లు డాక్టర్ హోవార్డ్ ,ఫ్లోరీ లను ఆకర్షించింది .అతని జర్మన్ సహాయకుడు ఎర్నెస్ట్ బోరిస్ చిన్ నెలల తరబడి ఫ్లెమింగ్ మోల్డ్ నుంచి ఏదైనా పదార్ధాన్ని పొందచ్చునేమో నని ప్రయత్నించాడు .చివరికి చిక్కని గరిటెడు ఎల్లో బ్రౌన్ పౌడర్ ను పొందగలిగాడు .ఇదే పెన్సిలిన్ నుంచి పొందిన మొదటి లవణం ,దాన్ని అనేక తరహా బాక్టీరియా మైస్ లపై ప్రయోగించాడు .12-2-1941న వేరు చేసిన పెనిసిలిన్ ను మొదటి సారిగా లండన్ లో స్టాఫిలో కొకి బాక్టీరియాతో బాగా ఇన్ఫెక్ట్ అయిన 105డిగ్రీల జ్వరం తో బాగా జబ్బు పడ్డ ఒక పోలీస్ కు ఇంజెక్షన్ గా ఇచ్చాడు .అంతకు ముందు అతనికి చాలా పెద్ద డోసులో సల్ఫానిలమైడ్ఇచ్చారు కాని గుణం కనిపించలేదు .కాని ఇప్పుడు ఈ పెనిసిలిన్ తో క్రమంగా జ్వరం తగ్గి౦ది కాని అప్పటికే చాలా ప్రమాదం అంచున ఉండటం వలన చనిపోయాడు .అతనిమూత్రం నుండి కొద్దిమోతాదు లో పదార్ధాన్ని సేకరించి రెండు నెలలు సాంద్రత పరచి ,స్ట్రె ప్టో కాకి బాక్టీరియా తో చావు బతుకులమధ్య ఉన్న 15 ఏళ్ళ కుర్రాడికి దాన్ని ఇంజెక్షన్ గా ఇస్తే వాడు కోలుకొని బతికి బట్టకట్టాడు .కొన్ని నెలల తర్వాత ఫ్లెమింగ్ తన మిత్రుడు ప్రాణాపాయం లో ఉంటె వెన్నెముక ద్వారా మందు ఎక్కించి ప్రాణాలు కాపాడాడు .
ఈ విధంగా పెనిసిలిన్ ప్రపంచ వ్యాప్త ప్రాణ సంజీవనిగా పేరు పొందింది .రెండవ ప్రపంచ యుద్ధ కాలం లో యుద్ధం లో ఇరుక్కుని ,ప్రతి ప్రయోగ శాల ఆయుధాల కోసమే పని చేయటం తో తగినంత పెనిసిలిన్ ను తయారు చేయ లేక పోయింది .డాక్టర్ ఫ్లోరె అమెరికా వెళ్లి అక్కడ విస్తృత స్థాయిలో పెనిసిలిన్ తయారు చేసే ఏర్పాటు చేశాడు .1942నాటికి ఒక 100మందికి మాత్రమె సరి పడ పెనిసిలిన్ మందు ఉంది .మరు సటి ఏడాదికి లెక్క లేనంత మందికి ఆ మందు ఇచ్చి ప్రాణాలు కాపాడే స్థితికి వచ్చారు .1943లో ఫ్లెమింగ్ ను ఫెలో ఆఫ్ ది రాయల్ సోసైటీ ని చేశారు.తరువాత నైట్ హుడ్ ఇచ్చి గౌరవించారు .1945లో ఫ్లోరీ,చైన్లతో కలిపి ఫ్లెమింగ్ కు నోబెల్ పురస్కారం ప్రదానం చేశారు .
అనేక మట్టి నమూనాలనుంచి మోల్డ్ లను వృద్ధి చెందించారు .రాట్జేర్స్ యూని వర్సిటి కి చెందినవాక్స్ మన్ న్యు జెర్సీ మట్టి నుండి ‘’స్ట్రెప్టోమైసిన్ ‘’కనిపెట్టాడు .ఎల్ యూని వర్సిటికి చెందిన పాల్ బార్క్ హోల్డర్ వెనిజుల దుమ్ము నుంచి’’ క్లోరోమైసిటిన్’’ మందు తయారు చేశాడు .అది దక్షిణ అమెరికా లో టైఫస్ బాక్టీరియాను నివారించి టైఫాయిడ్ నుంచి విముక్తి కలిగించింది . 75ఏళ్ళ బెంజమిన్ ద్రగ్గర్ అనే రిటైర్డ్ బాటనీ ప్రొఫెసర్ పుట్టగొడుగులపై తీవ్ర పరిశోధన చేసి మిస్సోరి బురద నుంచి బంగారపు పసుపురంగు మోల్డ్ పెంచి దాని నుంచి వచ్చిన మందుకు’’ ఆరో మైసిన్ ‘’అని పేరు పెట్టాడు .బ్రూక్లిన్ లోని ఒక సంస్థ ఇండియానా లో కుళ్ళిన సాయిల్ నుంచి’’ టేర్రామైసిన్’’ తయారు చేసింది .దీనితో వైద్య రంగం లో నూతన అధ్యాయం ఆరంభమైంది .దీనినే ‘’కేమో దెరపీ శకం ‘’అన్నారు .ఈ మందులన్నీ భూమి లోని మట్టి సారం నుంచి తీసినవే .
ఎక్కువ డోస్ లో యాంటి బయాటిక్స్ వాడితే పేషెంట్ లకు ఎలర్జీ లు వచ్చి ఇబ్బంది పడతారు .ఫ్లెమింగ్ చలవ వలన వైద్య ప్రపంచం గణనీయమైన అభి వృద్ధి సాధించి జన జీవితం లో వసంతోదయాన్ని తెచ్చింది .చెవి ఎముక (మాస్టాయిడ్)ఆపరేషన్లు ఒకప్పుడు అతి ప్రమాదకరం .ఇప్పుడు ‘’వీజీ ‘’అయింది .పిల్లల చెవి బాధలుతగ్గాయి .మధ్య చెవిలో వచ్చే భయంకర ఇన్ఫెక్షన్ ఇప్పుడు యాంటి బయాటిక్స్ తో ఉష మాయం అవుతోంది .బోస్టన్ లోని పిల్లల ఆసుపత్రిలో మాస్టా యిడ్ఆపరేషన్లు మూడు వందలనుంచి ఒక దశాబ్దకాలం లో అయిదుకు తగ్గి గొప్ప మార్పు తెచ్చింది .ఎపెండి సైటిస్, మేనేంజేటిస్ (మజ్జా రోగం )టులారెమియా (ప్లేగు వంటి వ్యాధి )ప్యూర్ పెరల్ ఫీవర్ (ప్రసూతి జ్వరం )ఇప్పుడు భయంకరమైనవి కానేకాదు .పూర్తిగా నివారింప దగినవే .ప్రపంచం ఫ్లెమింగ్ కు ఎంతో రుణ పడి ఉంది .యువకులు ఉత్సాహంగా పని చేస్తూ 65ఏళ్ళకు హాయిగా రిటైరై ధోకా లేకుండా జీవిస్తున్నారు .అంటే లైఫ్ స్పాన్ పెరిగింది అన్నమాటం .
బాక్టీరియాలజీ లోనే కాక పెయింటంగ్ లోనూ సిద్ధ హస్తుడైన ఫ్లెమింగ్ తన ఇంటి గోడలపై జేర్మ్ కల్చర్ ను చిత్రించాడు .70వ పుట్టిన రోజురిటైర్మెంట్ పొందినా మైక్రో బయాలజీ పై ఇంకా పరిశ్రమ చేయాలని నిర్ణయించాడు .అతని మాటల్లోనే ‘’I have still got a few useful years before me ,.The happy man keeps on working ‘’అన్నాడు .74వ ఏట ఫ్లెమింగ్ కు హార్ట్ ఎటాక్ వచ్చింది .11-3-1955న కోట్లాది ప్రాణులకు పెనిసిలిన్ ద్వారా ప్రాణ దానం చేసిన ప్రాణదాత అలేక్సాందర్ ఫ్లెమింగ్ అమరుడయ్యాడు .ఆయన లండన్ ఇంటికి దగ్గరలో ఉన్న లాబరేటరి లో ఆయన వృద్ధి చెందించిన అసలు మోల్డ్ (ఏన్సేస్టర్ )గాజు మూసలో ఇంకా భద్రంగా ఉన్నది .దీనినుంచే ప్రపంచానికి అవసరమైన పెనిసిలిన్ ఆవిర్భ వించింది’
2000సంవత్సరం లోప్రవేశించే ముందు స్వీడన్ కు చెందినా మూడు పెద్ద మేగజైన్ లు ఆ శతాబ్దపు గొప్ప పరిశోధన ఏదని అభిప్రాయ సేకరణ చేస్తే పెనిసిలిన్ అనే అందరూ చెప్పారు .2002లో బి బి సి వందమంది ప్రసిద్ధ బ్రిటన్ల జాబితాలో ఫ్లెమింగ్ ను చేర్చింది .ఆయన కాంశ్య విగ్రహాన్ని మాడ్రిడ్ లో ఏర్పాటు చేశారు .ఆయన పేరుతొ బాంక్ నోట్లు ముద్రించారు .ఆస్టెరాయిడ్ బెల్ట్ లో ఒక దానికి ఫ్లెమింగ్ పేరు పెట్టారు .ఆయన లెక్కలేనన్ని అవార్డులు రివార్డ్ లు పొందాడు .1999లో టైం మేగజైన్ ఆయన పై ప్రత్యెక సంచిక తెచ్చింది .ధన్యజీవి ఫ్లెమింగ్ .
- In 1999,Time magazine named Fleming one of the 100 Most Important People of the 20th century, stating:
It was a discovery that would change the course of history. The active ingredient in that mould, which Fleming named penicillin, turned out to be an infection-fighting agent of enormous potency. When it was finally recognized for what it was, the most efficacious life-saving drug in the world, penicillin would alter forever the treatment of bacterial infections. By the middle of the century, Fleming’s discovery had spawned a huge pharmaceutical industry, churning out synthetic penicillins that would conquer some of mankind’s most ancient scourges, including syphilis, gangrene and tuberculosis.[32
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-6-16-ఉయ్యూరు

