ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -218 81-ప్రపంచ ప్రసిద్ధ నవ్వుల రేడు –చార్లీ చాప్లిన్ –2

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -218

81-ప్రపంచ ప్రసిద్ధ నవ్వుల రేడు –చార్లీ చాప్లిన్ –2

ఎస్సానే లో ఉన్న ఏడాదే చాప్లిన్ ‘’the immortal and world famous –character of the tramp –the tragic ,comic vagabond so perfectly symbolizing the universal underdog –came into being –possibly the most significant artistic arch type of this century ‘’అనిపించాడు మ్యూచువల్ ఫిలిమ్స్ లో ఈ పాత్రను 12 సినిమాలలో పోషించి చిరంజీవి ని చేశాడు .కధను బట్టి తన పాత్రకు వివిధ కొణాలో న్యాయం చేసి మూకాభినయం తో అమరునిగా ఆ పాత్రను నిలిపాడు .1916 -17 యుద్ధం లో గాయపడ్డ లక్షలాది ప్రపంచ జనాలకు  ఈ పాత్ర ద్వారా ఆనందాన్ని పంచి తానూ విపరీతంగా అభిమానం పొందాడు .’ఫ్లోర్ వాకర్  ‘’,ది కౌంట్ ‘’,’’ది ఇమ్మిగ్రంట్ ‘’,ఈజీ స్ట్రీట్ ‘’సినిమాలు క్లాసిక్స్ ..ప్రింట్ లు బాగా లేక పోయినా ఇప్పటికీ చాప్లిన్ ఫెస్టివల్స్ లో ప్రదర్శిస్తూ నే ఉన్నారు .ఆయనంటే పడనీ వాళ్ళు మాత్రం ఆయన అమెరికాలో బాగా డబ్బు దండు కొన్నప్పటికీ ,అక్కడ పౌరుడుగా నమోదుకాలేదని  కనీసం పేరు రాయించుకొనే ప్రయత్నమూ చేయలేదని అంటారు .పని తప్పించుకొనే స్లాకర్ అని ఇంగ్లాండ్ వాళ్ళు అంటారు. ఆయన .ఇంకా బ్రిటిష్ పౌరసత్వాన్ని ఉంచుకొన్నాడు .అసలు విషయం ఆయన ఆర్మీ ఫిజికల్ రిక్వైర్ మెంట్ ను పాస్ కాలేక పోయాడు రెండు నెలల బాండ్ సెల్లింగ్ వినోదం ఆయన విమర్శకులను శాంత పరచ లేక పోయింది

   ఇదే సమయం లో ఫస్ట్ నేషనల్ తో మిలియన్ డాలర్లు  పది హేను వేల డాలర్ల బోనస్  కాంట్రాక్ట్ పై సంతకం  చేశాడు  చాప్లిన్  ఇప్పుడే తానే నిర్మాత ,తనదే స్వంత స్టూడియో లాభాలలో వాటా కూడా ..ఈ కాలం లో ‘’షోల్డర్ ఆర్మ్స్ ‘’ది కిడ్ ‘’వంటి అత్యంత ప్రముఖు సినిమాలతో సేలిబ్రేటి అయ్యాడు . ది కిడ్ లో’’ జాకీ కూగాన్’’ అనే కుర్రనటుడిని పరిచయం చేసి అతనితో అద్భుత నటన రాబట్టాడు .౩౦వ ఏడు వచ్చేదాకా చాప్లిన్ జీవితం ప్రశాంతంగా ,కుంభ కోణాలు లేనివాడుగా గడిచి పోయింది .దేనిపైనా సీరియస్ గా జోక్యం లేనివాడుగానే ఉన్నాడు .ఎడ్నాపర్వియన్స్ ను దేశస్థాయిలో నటిగా గుర్తింపు తెప్పించాడు .ఆమెను వివాహం చేసుకొంటాడని అందరూ అనుకొన్నారు .కాని మనవాడు  అందం ,డబ్బు ,కీర్తి  ఉన్నా బ్రహ్మ చారిగానే ఉండి పోయాడు .కానిపదహారేళ్ళ పడుచు ,నాటక సినీ నటి మిల్డ్రెడ్ హారిస్ పొగడ్తలకు ఆకర్షణకు లొంగిపోయాడు .అకస్మాత్తుగా 23-10-1918న ఇద్దరూ పెళ్లి చేసుకొన్నారు .పిల్లపుట్టాక మూడు రోజులే కాపురం చేశారు .పడుచు పెళ్ళాంనుంచి దూరమై ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యా రోపణలతో ,డబ్బు వ్యవహారం లో పట్టుదలలు పోయి చివరికి విడాకులు పొందారు  .క్రమంగా ఎమోషనల్ గా అస్థిర చిత్తం తో ఉంటున్నాడు .అహంకారం పెరిగింది .తాను  సాధించిన దానికి ప్రత్యేక విలువలు కావాలని కోరుకోనేవాడు .ఆయన ప్రేక్షకులు ఎప్పుడూ ఆయన్ను నిరాశ పరచ లేదు .19 21 లో  పేపర్ వాళ్ళ ఊహాగానాలకుదూరంగానూ  తగ్గిన తన సృజనకు పదును పెట్టుకోవటానికి  యూరప్ వెళ్ళాడు .అక్కడ ఆయనకు ‘’తిరిగొచ్చిన హీరో ‘’గా అపూర్వ స్వాగతం పలికారు .

   చాప్లిన్ వింత స్వభావం చెదురుమదురు బాధ్యతా రాహిత్య పరంపరలు అన్నీ కలిసి ఆయన స్వీయ జీవితాన్ని కష్టాల పాలు చేశాయి . .యాభై లలో ఆయన శృంగారం వివాహ జీవితం అడ్డూ ఆపూ లేకుండా గడిచింది .1924 లో తరచుగా లీటా గ్రే అనే లోలితా మెక్ ముర్రే తో కనిపించేవాడు .ఈమెకూడా పాత పడుచు పెళ్ళాం లాగా 16 ఏళ్ళ కన్నె పిల్లే  .మళ్ళీ అకస్మాత్తు పెళ్లి 1924 లో ,అయి పొసగని సంసారమై చార్లెస్ స్పెన్సర్ జూనియర్ కు తండ్రి అయి మరుసటి ఏడాది రెండోకొడుకు సిడ్నీ ఎర్లె పుట్టాక పేపర్లు మళ్ళీ వీల్లిద్దరిమధ్య గొడవలున్నాయని గాసిప్పులు ప్రచారం చేశాయి .ఇదంతా అబద్ధం అని బుకాయించారు ఇద్దరూ .తర్వాత లీటాతనను భర్త లైంగికంగా వేధిస్తున్నాడని బజారున పడితే చాప్లిన్ అసలామె కుటుంబమే మంచిదికాదని తనను అమాయకంగా ముగ్గులో దింపారని తన నుంచి భారీగా డబ్బు రాబట్టుకోవ టానికి చేసిన కుట్రా ,ద్రోహమని  ఆరోపణ చేశాడు .42 పేజీల ఆరోపణ పత్రాన్ని ఆమె విడుదల చేస్తే వేలాది మంది డబ్బులిచ్చి కొనుక్కున్నారు .ఆర్టిస్ట్ ప్రైవేట్ జీవితాన్ని వీధిలోకి లాగ కూడదని ,దాన్ని నటన తో చ ముడి పెట్ట రాదనీ ఆక్రోశించాడు .ఆడవాళ్ళ క్లబ్బులు అన్నీ చాప్లిన్ కు వ్యతిరేకంగా మొహరించాయి .చివరికి అతని సినిమాలను కొన్నిటిని బాన్ చేశారు .ఈ ఒత్తిడిని చాప్లిన్ తట్టు కోలేక పోయాడు .భంగ పడిన చాప్లిన్ ఆమెతో ఆరు లక్షల డాలర్లకు ,ఇద్దరు పిల్లలపోషణకు  ట్రస్ట్ పేరిట రెండు లక్షల డాలర్లకు రాజీ కుదుర్చుకొన్నాడు .అటార్నీ ఫీజు కూడా కలుపుకొంటే ‘’ఈసున్నం’’  మొత్తం ఒక మిలియన్ డాలర్లకు దేకింది  …లీటాకు  మాంచి జాక్ పాట్ పాక్ట్ కుదిరి చాప్లిన్ జేబు కు పెద్ద బొక్క పడింది .ఈ పెళ్లి పెటాకులైన లీటా ఆ తర్వాత మరో రెండు పెళ్ళిళ్ళు చేసుకొణి లాభ పడింది . .

ప్రపంచం తీరును ఇప్పుడిప్పుడే గమనిస్తున్నాడు చాప్లిన్ .బంగారు బాతు గా ఆయన్ను భావించి ఎవరో ఒక అమ్మాయితో సంబంధం ఉందని పుకారు పుట్టించటం ఆ రొంపి లోంచి బయట పడటానికి డబ్బుతో  పరిష్కరించు కోవటం పరి పాటై పోయి౦ది పాపం .పోలిష్ నటి పోలా నేగ్రి ,కలైర్ విండ్సర్ లతో జతకట్టాడని ఆరోపణ .క్లేర్ షెరిడాన్ అనే శిల్పిణి తో కలాపం సాగిస్తున్నాడనీ చాటింపు .పాలెట్టి గొడ్దార్డ్ తో అనుబంధం తో ఆయన కు ఊరట కలిగింది .ఎనిమిదేళ్ళు దీన్ని రహస్యంగా ఉంచాడు .ఇద్దరూ ఎప్పుడు ఎక్కడ పెళ్లి చేసుకొన్నారో అంతు చిక్కలేదు .తర్వాత ఇద్దరూ బహిరంగం గానే ఉన్నారు .1942 లో ఇద్దరూ విడిపోయాక ,విడాకులు పొందాక మాత్రమే వాళ్ళిద్దరి పెళ్లి  చైనాలోని కాంటన్ లో 1936 లో జరిగిందని వెల్లడించాడు .

Inline image 1Inline image 2Inline image 3

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-7-16- ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.