వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -22
మల్లినాధుని అలంకార శాస్త్ర పాండిత్య గరిమ
అలంకార శాస్త్రం లో మహా పాండిత్య గరిమ ఉన్న మల్లినాధుడు ,తాను వ్యాఖ్యానించిన పంచ మహాకావ్యాలలోని ప్రతి శ్లోకం లో ఉన్న అలంకార వైభవాన్ని వివరించాడు .తాను చెప్పిన అలంకారాన్ని సమర్ధించే అలంకార శాస్త్ర సూత్రాలను చెప్పి ,ప్రత్యామ్నాయాలను కాదనటానికి స్పష్టమైన కారణాలు తెలియ జేశాడు .దీనికి చాలా ఉదాహరణలు ఇవ్వ వచ్చు .అందులో మహా కావ్యాలలోని కొన్నిటిని మాత్రమే తెలుసుకొందాం శిశుపాల వధ 2-42 శ్లోకం –‘’విధాయ వరం సమర్షె నరోరై చ ఉదాసతే –ప్రక్షిప్యోదర్చిషం కక్షే రోరతేతేభి మారుతం ‘’పై చేసిన వ్యాఖ్యలో ‘’ఆగ్రహించిన శత్రువు తో శత్రుత్వం ప్రాముఖ్యం లేక మార్పు లేని విధంగా ఎదురుగాలిలో నిలవటంలా ఉంటుంది’’ .అన్నాడు శిశుపాల వధ లోనే మరో శ్లోకం లో నిదర్శన అలంకారం ఉందని ,మొదటి వాక్యం లో చెప్పబడిన మనుషులు ,రెండవ వాక్యం లోనూ ఉన్నారని –‘’విశిస్టో దాసీ న్యశయ నయోచాక్యర్ధ యోర్నిర్దిస్టే కత్వా సంభవాత్ –సాదృశ్య లక్షణా యమ సంభ ద్రర్తుసంబందో వాక్యార్ధనివ్రుత్తిరితి నిదర్శనా చేద్’’అని వ్యాఖ్యానించాడు .కనుక ఇక్కడ అలంకారం దృష్టాంతాలంకారం కాదని ,అది రెండువిభిన్న వాక్యాలున్నప్పుడే ,వస్తు ప్రతిబింబం రెండు వస్తువుల మధ్య ఉంటేనే అవుతుందని ,కాని ప్రస్తుత విషయం లో ఇక్కడ ఒకే ఒక వాక్యం మాత్రమె ఉందని కనుక దృష్టాంతం కాదని స్పష్టం చేసి దానికి బలంగా అలంకార సూత్రాన్ని తెలియ జేశాడు.
శిశుపాల వధ 2-109 శ్లోక వ్యాఖ్యలో దీపకాలంకారం అందులో ఉందని ,దానికి కారణం బుద్ధి ,కర్మ ,మానస లలో సమాన లక్షణాలున్నాయని ,కాని ఇవి అసంబద్ధంగా ఉన్నాయని సూచించాడు .ఈ సమాన లక్షణం రెండిటిమధ్య పోలికను ఉపమేయ ,ఉపమానాలుగా సూచిస్తుందని అన్నాడు –‘’వాక్య భేదేన ప్రతిబింబ కారణాక్షేపే తస్యో త్ధా నాత్ –అత్ర తు వాక్యార్దేవాక్యార్ధ సమారోపాద్ వాక్య యేవాక్యతయాం తద్భావ ఇత్యలంకార సర్వస్వకారాః’’అని చెప్పాడు అలంకారాలలో ఉన్న రకాలను గురించి చెప్పటం లోమల్లినాధుడు మహా దిట్ట అన్నాడు లాల్యే .శిశుపాల వధలో అర్దా౦తరన్యాస అలంకారాన్ని గుర్తించి ,కారణం వలన ఫలితం రూఢి అయిందని అన్నాడు ఇందులోకారణం కొందరికి స్వీయ గౌరవమే సంపద అని భావిస్తారు .అందులోనే మరో శ్లోకం లో అర్దా౦త రన్యాసం’’సతీవ యోసిత్ ‘’అనే ఉపమానం పై ఆధారపడి౦దని –‘’మారని ప్రవ్రుత్తి వ్యక్తిని అతనిభార్య లాగా ఇతరలోకాలలో కూడా అనుసరించే ఉంటుంది ‘’అని చెప్పాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-12-16- ఉయ్యూరు
