వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -24
మల్లినాధుని అలంకార శాస్త్ర పాండిత్య గరిమ-3
పంచ మహాకావ్యాలలో ‘’ప్రతి వస్తూపమాలంకారం ‘’ఎక్కువగా వాడ బడింది .మల్లినాధుడు ఈ అల౦ కారం కని పించిన చోటల్లా విజ్రుమ్భించి చాలా విస్తృతంగా రాశాడు .అందులో ఒకటి చూద్దాం .శిశుపాల వధ 11-22-‘’ఉపప్లుతం పాతుమదో మదోద్ధతేశ్వమేవ విశ్వంభరం –విశ్వమీశిషె-క్రుతేర్వేః క్షాలాయితుం క్షమతే కః క్షపాతమస్ఖండ మలీమాసం నభాః’’అనే శ్లోకం లో రెండు వాక్యాలు ఉన్నాయి .అందులో ఒకదాని పై అలంకార ప్రశ్న ఏర్పడింది .’’ఆకాశాన్ని రాత్రి కటిక చీకటిగా మారిస్తే ,దాన్ని పూర్తిగా కడిగేసే సామర్ధ్యం సూర్యునికి తప్ప మరెవరికి ఉంది ?.తరువాత వాక్యం లో ‘’ఓ విశ్వ పాలకా !తీవ్ర మోహా వేశం లో ఉన్న జనాలను నువ్వు తప్ప రక్షించేవారెవరు ?ఈ రెండు వాక్యాలలో సాధారణ విషయం సమర్ధత .ఇది ‘’ఈషిసే ‘’,’’క్షమేత’’అనే రెండుపదాల చేత ప్రతికూల పద్ధతిలో చెప్పబడింది .కనుక ఇక్కడ అలంకారం ‘’ప్రతి వస్తూపమ’’అంటే విలక్షణ పోలికతో సూచించబడింది .కృష్ణుడికి ,సూర్యుడికి మధ్య సంబంధం సాంకేతికంగా ‘’వస్తు ప్రతి వస్తూభావ ‘’ఎలాగంటే రెండిటిలోనూ ఒకే రకమైన గుణ౦ రెండువిభిన్న వాక్యాలలో రెండు సార్లు ఆపాది౦పబడింది కనుక .అంటూ వివరణ ఇచ్చాడు సూరి మహాశయుడు .
మరో ఉదాహరణ –కిరాతార్జునీయం 2-8 శ్లోకం’’ విషమేపి విగాహయతే నయః కృత తీర్ధః ప్రయసాభి వాశయః
సతు తత్ర విశేష దుర్లభః సదుపన్యాస్యాతికృత్య వర్తమా యః ‘’లో యుద్ధ తంత్రాన్ని సరస్సు తో పోల్చాడు భారవికవి .కనుక అందులో పదాల అర్ధాలు అనుమానాస్పదం గా ఉంటాయి .అవి రెండిటికీ వర్తిస్తాయి .కవి హృదయాన్ని విప్పి చెప్పటానికి శ్లోక౦ లోని భావాన్ని మల్లినాధుడు చాలా చక్కగా విశదీకరింఛి తన వ్యాఖ్యాన నైపుణ్యానికి అద్దంపట్టాడు .వాటి అర్ధాలను ఇలా తెలియ జేశాడు-‘’విషమేపి’’ పదం –యుద్ధ తంత్ర విషయం లో ‘’దుర్బోదోపి ‘’అంటే తెలుసుకోలేనంత అని, సరస్సువిషయం లో దుష్ప్రవేశేపి –అంటే చేరలేని ,లేక దుర్గమమైన అనే అర్ధాలు చెప్పాడు . ‘’కృత తీర్ధః ‘’పదానికి క్రుతాభ్యా సాదు పాయః ‘’అంటే-ఎంతో ప్రయత్నం చేస్తే కాని అని యుద్ధ విషయం లోను ,క్రుతజలావతారః అని అంటే దిగటానికి మెట్లు అని సరస్సు విషయం లోను ,’’కృత్యవర్త్మ’’శబ్దానికి –సంధి విగ్రహాది కార్యం అని యుద్ధ పరంగా ,స్నానాదికం అని సరస్సు పరంగా అర్ధాలు చెప్పాడు .అలాగే’’ సత్సాదు ‘’కు ‘’దేశ కాలాది విరుద్ధం ‘’అని అంటే కాలమాన పరిస్తితులను బట్టి అని రణ తంత్ర పరంగా ,’’గర్త గ్రహ పాషాణాది’’అని అంటే గోతులు ,మొసళ్ళు ,రాళ్ళు అని సరస్సు పరంగా అద్భుతంగా అర్ధాలు చెప్పి కవి హృదయాన్ని గొప్పగా ఆవిష్కరించాడు .ఈ శ్లోకం లో ఉపమా అర్ధాంతర న్యాస అలంకారాలు జోడింప బడ్డాయి అని తెలియ జేశాడు .మొత్తం మీద ఇందులోని చర్చాసార పిండితార్ధాన్ని –‘’యదా కేనాచిత్ కృత తీర్దే వయసి గంభీరేపి ప్రవేస్టారః సంతి తీర్ధ కరస్తు విరలః –తద్వార్నీతావాపి గూఢ మపి తత్త్వం వ తరి బోద్దారః సంతి .-వక్తా తు న సులభః –అతః ఇయం పఠితామపి సాదు వక్తీతి యుజ్యతే విస్మయ ఇత్యర్ధః ‘’అని ముగించాడు .’’రూడ్ బెర్జెన్ ‘’దీనిపై వ్యాఖ్యానిస్తూ సరస్సులోని లోతైన నీటిలోకి ప్రవేశించాలంటే మెట్లనిర్మాణం అవసరం .మెట్లు కట్టేవాడు అరుదుగా ఉంటారు .యుద్ధ తంత్రం లో జనం చాలామంది దాని సారాంశం గ్రహించేవాళ్ళు ఉన్నా కొందరే దాన్ని వివరించగలిగే వాళ్ళు ఉంటారు .కనుక ఇక్కడ ద్రౌపది యుద్ధ విషయం లో యేమాత్రపు శిక్షణ పొందకున్నా యుద్ధ తంత్రాన్ని గూర్చి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుంది ‘’అని రూడ్ బెర్జేర్ రాసినట్లు లాల్యే పండితుడు పేర్కొన్నాడు
‘’శిశు ‘’లోనే మరొక శ్లోకం లోఅనేక అలంకారాలను కవి గుది గుచ్చాడు .ఖండిత నాయిక ప్రేమికుడిని ఇబ్బంది పెట్టె సన్నివేశం లో ‘’తుమ్మెద సమూహాలు లతలను పరిత్యజించి పుష్పాలను కోసిన స్త్రీలపై పడ్డాయి .అవి ఆ లలితా కోమల పుష్పాలతో మాలలు అల్లే ఆ స్త్రీల చుట్టూ మూగి రొద చేస్తూ తిరుగుతున్నాయి ఇక్కడ పౌరధర్మఅవగాహన అంత ప్రాముఖ్యం పొందలేదు ‘’-ఆశ్లోకం –‘’అవిచిత కుసుమా విహాయ వల్లీర్యువతిషు కోమలమాత్మమాలినీషు –పదముపదదిరే కులాన్యాలీనాం న పరిచాయో మలినాత్మానాం ప్రధానం ‘’ఇక్కడ మలినాత్మనాం దుర్మార్గుడు తనలోని నల్లదనాన్ని కరగిచుకొని అతిక్రమించటం .కనుక ఇక్కడ’’అతిశయోక్తి ‘’ఉన్నది .తేనెటీగల సహజ స్వభావం ఇక్కడ చెప్పబడింది .మలినాత్మ పదానికి నలుపు అని కౌటిల్యం లేక దుష్టత్వం అనే రెండు అర్ధాలు ఉండటం వలన అతిశయోక్తి ఉన్నందున రెండు అలంకారాలు ప్రత్యేకంగా ముఖ్యమైనది ,దానిపై ఆధార పడిందీ ఉండటం వలన ‘’సంకర అలంకారం ‘’అయిందని –‘’అత్ర మలినాత్మనా మితి కృష్ణాంగారస్య దుస్ట చిత్తత్వేన సహభేదాధ్యాసా యేనార్ధాంతర న్యాసస్తాపనం శ్లేష ప్రతి బౌద్ధాపి తాతిశయోక్తానుప్రాణితోయామితి ‘’సంకరః ‘’అని తేల్చాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-2-12-16 –ఉయ్యూరు

