వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -26
మల్లినాధుని అలంకార శాస్త్ర పాండిత్య గరిమ-5 (చివరిభాగం )
‘’తదుక్తం’’ అని మల్లినాధుడు చెప్పిన అలంకార సూత్రాలను డా.పి .ప్రభునాద ద్వివేది తన పి హెచ్ డి ధీసిస్ లో కాళిదాస కావ్యాలపై మాత్రమె ఉటంకించిన విషయాలను ఈ విధంగా వివరించాడు .
అలంకారం పేరు ప్రతాపరుద్రీయం లోని కొటేషన్లు కావ్యం పేరు
1-తుల్య యోగిత ప్రస్తుతానాం తదాన్వేషా కేవలం తుల్య ధర్మతః కుమార సంభవం -1-2
ఔపోస్యాం గమ్యతే యత్ర సమతా తుల్య యోగితా
2-పరిణామ అరస్యోమాణ రేప్య విషయాత్మనా స్థితం ప్రక్రుతత్యేష యోగిత్వే ‘కుమార -1-10-
పరిణామ ఉదాహృతః
మల్లినాధుడు ఇందులోని ముఖ్యమైన మాటలే చెప్పాడు
ఆరోప్యామాణస్య ప్రకృతోపయోగిత్వే పరిణామ రతి
3-నిదర్శన అసభ్యా వద్ధర్మ యోగ దుపమానోపమేయ మెయయోః కుమార -1-3-
స్యా నిదర్శనా
4-వ్యతిరేక భేద ప్రాదాన్యే నోపమాన దుపమేయ స్తాదికయే విపర్యయే వా వ్యతిరేకః కుమార -1-43
5-కావ్య లింగ హోతార్వాక్య య పదార్ధత్వే కావ్య లింగ ముదాహృతం కుమార -1-48
6-స్వభావోక్తి స్వభావోక్తిరసౌ చారు యధావద్వస్తు వర్ణనాం కుమార-1- 56
7-ప్రతి వస్తూ పమ యాత్ర సామాన్య నిర్దేశః ప్రుధవ్యాక్య ద్వయే యది – కుమార -3 -21
చాసౌ విశామలంగమ్యోపమ్యాశ్రితే సా స్యాత్
ప్రతి వస్తూపమా మతా
8-విషమ విరుద్దే కార్యస్యో త్పతిర్య న్ననార్యస్య వా భవేత్ –విరూపఘటనాచాసౌ మేఘ -1-5
విశామాలంకే కృతి స్విదా
9-అర్దా౦తరన్యాస కార్యకారణ సామాన్య విశేషణా౦ పరస్పరం –సమర్ధనం మేఘ -1-8
యత్ర సోర్దాన్తర న్యాస ఉదాహృతః
10-స్మరణ సద్రుశాను భావవా దన్యస్మ్రుతిఃస్మరణాభ్యుచతే మేఘ -11-14
ధ్వని పైమల్లినాధుని భావన
రసానికి ,అలంకారానికి దగ్గర సంబంధమున్న అనేక అలంకారాలను ఉదహరించవచ్చు .సంస్కృత అలంకార శాస్త్రం లో మరొక ముఖ్య విషయం అయిన ధ్వని లేక వ్యంజనం ఉంది .ధ్వని క్షేత్ర సూచన అభిదా అనే సూటి విషయానికి,లక్షణ అనే రెండవ అర్ధానికి భేదం ఉంది .ఏ సాహిత్య విషయమైనా అది ఇచ్చే సూటి అయిన అర్ధానికి ,లేక ఉపార్ధాన్ని బట్టి మెచ్చుకో బడటం లేదు .సాహిత్య సౌందర్యం స్త్రీ అందాన్ని చెప్పలేక పోయినా అనుభవించ గలిగినట్లు (ప్రతీయమాన౦ ) గా ఉంటుంది .ఈ విధంగా వ్యక్తం చేయగలిగిన సూచననే ధ్వని అంటారు .ధ్వని భావన1-వస్తు ధ్వని-అంటే సత్య లక్ష్యం 2-అలంకార ధ్వని-అంటే ఏదో దానితోతులనాత్మక పోలిక , 3-రసధ్వని-అంటే ఏదో భావ లేకఅవ్యక్తానుభూతి అని మూడు రకాలుగా ఉంటుందని చెప్ప వచ్చు ..
సాధారణం గా అలంకారం లో ప్రాధమిక భావన మరియు సూచ్యార్ధం ఉండ వచ్చు .కానిఇందులో ప్రాధమిక భావన ఆది పత్యం వహిస్తుంది .అలాకాకుండా సూచ్యార్ధ లేక ఉద్దేషిత భావం ఆధిపత్యం వహిస్తే పైన చెప్పిన 3 రకాలలో ఏదో ఒక ధ్వని ‘’ధ్వని ‘’ఉందన్నమాట .కవిత్వం లో ధ్వని అతిముఖ్యమైన కీలక సూత్రం .సుచేతన (కాన్షస్)ఉన్న వ్యాఖ్యాత ,సౌందర్య భావనలన్నీ తెలిసిన మల్లినాధుడు .ధ్వనిని చాలా విస్తరించే ఎక్కడ అవకాశం వస్తే అక్కడ బాహాటంగా బహుళంగా తెలియ జేశాడు అన్నాడు లాల్యే పండితుడు .
శిశుపాల వధ కావ్యం లో ఎవరు నల్లని లేక చెడు మనసుతో ఉంటారో వారు శిశుపాలుని అనుసరిస్తారు ,ఎవరు చీకటి లేక చెడు మనసు లేకుండా శుద్ధ మనస్కత తో ఉంటారో వారు కోమల కాంతిని అనుసరిస్తారు –‘’యత్ర ధ్వాంతం రజనీముఖ మనుయాతితహిదితి ,తద్విదితి వస్తునా అలంకార ధ్వని అని మల్లిననాధుడు వ్యాఖ్యానించాడు .ఇక్కడ తమస్ –స్వభావ –ప్రదోష మాటలు ద్వంద్వార్ధ౦ కలవే కాక ,పోలిక ను సూచించేవి .ఇక్కడ ఉన్నది ఉపమాలంకారం ధ్వని ఆధారం గా ఉన్నది .ఒక్కో సారి మల్లినాధుడు శ్లోకం లోని అలంకార సూచనలను పక్కన పెట్టేసి ,అక్కడ ఉన్న ధ్వనిని వెలుగులోకి తెచ్చాడు శిశుపాల వధ 4-19 శ్లోకం లో రైవత పర్వత వర్ణన ఉంది .దాన్ని కవి మాఘుడు శివునితో పోల్చాడు .అది ఆకాశాన్ని కప్పేసి అంతరిక్షానికి ముసుగు గా మారింది .భూమికి చాలా ఎత్తుగా ఉండటం ,దాని శిఖరాలు అత్యున్నతాలుగా ఉండటం వాటిపై చంద్ర కాంతి ప్రసరించి శోభిస్తోంది .-‘’ఆచ్చాదితాయత దిగంబర ముచ్చ కైర్గామ క్రమ్య సంస్తతముదగ్ర విశాల శృంగం –మూర్ధ్ని స్పురత్తుహిన దీధితి కోటమేన ముద్రీక్ష్య కొ భువి న విస్మయతే నగేంద్రం ‘’.
శిశుపాల వధ లోనే మరో శ్లోకం లో పదాలు ఒక స్పష్టమైన అర్ధానికే పరిమితమై ఉంటాయి .కాని మనకు వేరే అర్ధాలు కూడా ఉన్నాయేమో ననే సందేహం కలుగుతుంది .అక్కడ శ్లేష ఉండదు .ఉదాహరణకు ‘’నగేంద్ర ‘’అనే ముఖ్య ‘పదానికి రెండు అర్ధాలు లేవు . విశేషణం ఒకే సందర్భానికి మాత్రమే చెందింది కాకపోవటం వలన అది సమాసోక్తి అలంకారం కాదు .అది తుల్య యోగిత కాదు కారణం రెండూ ప్రక్రుతంకావు (రైవతం)అప్రక్రుతమైన శివుని ఉద్దేశించినవి .సూటి అర్ధాలు వేరే భావన అంటే శివుడు అనే కలిగిస్తాయి .కనుక ఇక్కడ ధ్వని ఉందని కనుక ఈ శ్లోకం లో ఏ విధమైన అలంకారం లేదని మల్లినాధుడు వివరించాడు –‘’తస్మాత్ ప్రకణికార్య మాన పర్యసితాభి ధన్య పరే ణాపి శబ్దేన అర్దాన్తరీకృద్ధ్వని రిత్యాహుః ‘’అని ధ్వనినే ఇక్కడ మల్లినాధుడు ప్రతిస్టించాడు అని లాల్యే పండితుడు తెలియ జేశాడు .
తరువాత విద్యాధరుని ‘’ఏకావలి ‘’లో రస, అలంకార విశేషాలను మల్లినాధుడు రాసిన తరల వ్యాఖ్యానం లో ఎలా వివరించాడో తెలుసుకొందాం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-12-16 –ఉయ్యూరు

