సాహితీ బంధువులకు నమస్కారం -ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి శతకం రాయిస్తున్నామని పూర్వం తెలియ జేసిన సంగతి గుర్తుండే ఉంటుంది .అనివార్య కారణాలవలన ఆ శతకాన్ని డా తూములూరు శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి గారు రాయటం లేదు దాన్ని ప్రముఖకవి విమర్శకులు విశ్లేషకులు 30ఏళ్లుగా నాకు పరిచయం ఉన్న సాహితీ మూర్తి శ్రీ తుమ్మొజు రామలక్ష్మణాచార్యులు గారు రాస్తున్నారు .ముందు చెప్పినట్లు ఈ నెల 12 వతేది శ్రీ హనుమద్ వ్రతము రోజున ఆవిష్కరణ జరగటం లేదు కవి మారారుకానుక కొంత సమయం పడుతుంది బహుశా జనవరి లో ఆవిష్కరణ జరుగవచ్చు .ఈ శతకానికి చాలా ఉత్సాహం గా ముందుకొచ్చి విరాళాలు పంపిన వారందరికీ కృతజ్ఞతలు .ఇంకా ఆసక్తి ఉన్నవారు పంపటానికి అవకాశం ఉంది ఈ శతకం లో దాతల గోత్రనామాలు ప్రచురిస్తామని ముందే తెలియ జేశాను .
గీర్వాణం -2 ఆవిష్కరణ రోజున స్వామి వార్లపై రెండవ శతకాన్ని కూడా రచింప జేస్తున్నట్లు తెలియజేయటం దానిని మధురకవి బహుగ్రంథకర్త ,శ్రీమతి ముదిగొండ సీతారావమ్మ గారు రచించటానికి అంగీకరించి రచన చేస్తున్నారని తెలియ జేస్తున్నాము .ఈ శతకాన్ని సరసభారతి శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం మాత్రమే ఖర్చు భరించి ముద్రిస్తున్నాము దీనికై ఎవరూ విరాళాలు పంపనక్కరలేదు . ఈ శతకాన్ని ఫిబ్రవరి చివరలో లేక మార్చి మొదటి వారం లో ఆవిష్కరింప జేస్తాము రెండు శతకాల ఆవిష్కరణలు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లోనే నిర్వహిస్తామని తెలియ జేస్తున్నాను -వీటితో సరసభారతి ప్రచురణా స0ఖ్య 24 అవుతుంది -దుర్గాప్రసాద్

