‘’గీర్వాణ భాషా వైభవం ‘’-1
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2-రెండవ భాగం 4-12-16 ఆదివారం ఆవిష్కరణ సందర్భం గా ‘’గీర్వాణ భాషా వైభవం ‘’ పై జరిగిన పద్య కవి సమ్మేళనం లో కవుల పద్య మకరంద ధారను ధారావాహికం గా అందజేస్తున్నాను .అనుభవించి ఆస్వాదించండి .
1-డా రామడుగు వెంకటేశ్వర శర్మ (గుంటూరు ) 9966944287
గీర్వాణ భాషా వైభవం
1-సీ –రామ నీరద సుదర్శన మాత్ర కవన నృత్యతా కేకి వాల్మీకి !అంజలు లివె
శ్రుతి పురాణార్ధ భారత పద్మ వికసనోల్లాస వేద వ్యాస !ప్రణతి వినుతి
ప్రతిభా సమేత రూపక దీపికా వాస ! భాసా నమోస్తు
కమ్రోపమాన సత్కవితా విలాస శ్రీ కాళిదాసా!నమస్కార శతము
మహిత మమృతమ్ము జ్ఞాన సంపత్తి కోరి– ,నవ్య మానంద సంస్పంద నంబు తోడ
రామడుగు వేంకటేశ శర్మ యొసంగు- అక్షర సువర్ణ సీస పద్యాల మాల .
2-సీ-‘’కవి భారవే రర్ధ గౌరవ ‘’ఖ్యాతి చేకొన్న భారవి !ఏటి కోళు లివియె
శబ్ద లాలిత్యైక సంపస్సముద్దండి!దండి మహా కవీ దండమయ్య
మల్లినాద ప్రశంసా ‘’మాఘ మేఘేతి’’ వాక్య కారక మాఘ !ప్రణతి శతము
శివ మహిమ్న స్తోత్ర కవి గాఢ భక్తాగ్ర గణ్య సత్కీర్తి సౌజన్య !నతులు
మహిత మమృతమ్ము జ్ఞాన సంపత్తి కోరి – నవ్య మానంద సంస్పంద నంబు తోడ
రామడుగు వేంకటేశ శర్మయె యొసంగు- అక్షర సువర్ణ సీస పద్యాల మాల .
3-సీ –నవ విద్వ దౌషధ నైషద కవితా ప్రవర్ష ,హర్షా !ఇదే ప్రణుతి శతము
కాదంబరీ రసజ్ఞాన దాయక బాణ !బాణ భట్టారకా వందనములు
‘’సరస పద్మావతీ చరణ చారణ చక్ర వర్తి ‘’యౌ జయదేవ వందనములు
‘’ కృష్ణ కర్ణామృత లీలాశుకా ‘’!జ్ఞాన చింతామణి కవీంద్ర !చేతు నతులు
మహిత మమృతమ్ము జ్ఞాన సంపత్తి కోరి – నవ్య మానంద సంస్పంద నంబు తోడ
రామడుగు వేంకటేశ శర్మయె యొసంగు- అక్షర సువర్ణ సీస పద్యాల మాల .
4-సీ –కరుణా రసైక సత్కవన గోదావరీ వర భూతి ,భవ భూతి !వందనములు
గుణ్య సామాన్య నైపుణ్య జీవన రూపకా !మృచ్చ కటికాఖ్య కర్త !నతులు
చాణక్య రాజ్యాంగ చతురతా పూర్ణ ‘’ముద్రారాక్షస ‘’విశాఖ దత్త నతులు
తృతీయ పంథా ప్రధానా !’’అనర్ఘ రాఘవ రూపకా !నమస్కార శతము
బంధుర రసానంద పరీమళ’’!కుందమాలా కార! వందనములు
నిర్మల ప్రియదర్శినీ రూప నవ్య నాగానంద హర్షాధిపా నమోస్తు
మహిత మమృతమ్ము జ్ఞాన సంపత్తి కోరి – నవ్య మానంద సంస్పంద నంబు తోడ
రామడుగు వేంకటేశ శర్మయె యొసంగు- అక్షర సువర్ణ సీస పద్యాల మాల .
2- డా తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి-పొన్నూరు -8106766197
పద్య మందార మాలతో అభినందన చందనం –
1-జయశీలంబును ,కార్య శూరతయు ,సౌజన్యంబు రూపంబు దా
ల్చి ,యపూర్వంబుగ దీర్చి దిద్దిన గీర్వాణ కళాక్షేత్రంబు’’ గీర్వాణ వా
ణి’’,యమూల్యంబగు భావ సంపదల నున్మేషింప,సారస్వత
ప్రియు లిద్దాని గుణంబులన్ గని ,ప్రహర్షింపన్,సమర్ధంబగున్ .
2- ఘనులై సంస్కృత భాష నధ్యయనమున్ గావించి ,కావ్యాలు వ్రా
సిన ,ఆయా కవి జీవితంబుల ప్రశస్తిన్ ,జ్ఞాన విజ్ఞాన భా
వనలన్, బ్రోది యొనర్చి ,భావి తరముల్ భద్రంబు లై వర్దిల౦
గను ,గీర్వాణ కవి ప్రణీతములు సద్గ్రంధంబులన్ దెల్పుచున్ .
3-తరువుల్ బూచిన పుష్ప సౌరభము ,లుత్సాహంబు తో, వాయు
వెల్లరకున్ బంచిన రీతి ,సంస్కృతుల సంలాపంబు ,లాంద్రోక్తి సుం
దరమై భాసిల జేయు సత్కవులు ,సత్కారార్హులాత్మోన్నతిన్
బర మార్ధంబు గ్రహించి ,లోకులకు జెప్పన్ ,సద్విర్మంబగున్ .
4-అభినందించు బ్రపంచ మీ కృతికి ,నత్యంతంబు సత్య౦బు ,దు
ర్లభౌ ,సంస్కృత కావ్యముల్ విబుధు లౌరా !యంచు గీర్తింప ,ద
చ్చుభ సందర్భ,ముదాహరి౦చుచు ,కవీశుల్ మెచ్చ సాహిత్య ,సౌ
రభ ముల్,దిక్కుల నింపు మీ కృషి ,సువర్ణం బై విరాజిల్లెడున్ .
5-తినబోవన్ రుచి గూర్చి చెప్పవలెనా ?తియ్య౦దన౦ ,భిక్షుఖా
దన మన్నన్ బునరుక్తి కాదొకొ ?ప్రసాదంబిట్టి దౌనంచు ,వ
ర్ణన గావి౦పగ శక్యమే ?సవిత నారాధింప ,దీపంబు జూ,
పిన చందంబిది,గబ్బిటాన్వయ మణీ!విద్వద్విమర్శాగ్రణీ’’.
డా .తూములూరు శ్రీ దాక్షిణా మూర్తి శాస్త్రి
రిటైర్డ్ ప్రిన్సిపాల్ – శ్రీ భావనారాయణ స౦స్కృత కళాశాల –పొన్నూరు
3-శతావధాని శేఖర ,కాశీకావి ,విద్యా వారిది ,అసమాన అవధాన సార్వ భౌమ ,అవధాన కళా తపస్వి
డా.పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ –విజయవాడ -9440346287
వందేహం గీర్వాణీం
1-సంస్కృతస్య ప్రతిస్ఠేద్వే సంస్కారః సంస్కృతిస్తధా-వ్యక్తీనాం చ సమాజస్య మార్గోప దేశం భజే ‘’
2-బాసల గన్న బాస ముది బాసల ముందటి బాస ,చాల మేల్-బాస ,పరాయి బాస తెలబారగ వెల్గెడు బాస ,తన్ను రా
జేసిన పెక్కు బాసలకు చిక్కులు దీసిన వేల్పు బాస ఈ –బాస యొసంగు గాక సరి బాటను ,కైతను ,కట్టు బాటులన్ .3మాతృ స్తన్యేన కొ భ్రస్టః పుష్ప ఏవ సదా భవేత్ –గీర్వాణ భాషయాసర్వాః భాషా వర్ధంత ఇత్యలం ‘’
4-వందేహం గీర్వాణీ౦ –వాణీ మజ్నాన తిమిర దీపాం త్వాం
చతురోక్తి రూప హేలాం –లీలా రస మార్గ మోక్ష సంధాత్రీం ‘’
5-జయతు జయతు వాణీ సంస్కతాఖ్య పురాణే-సురస సరస దానీ భారతీ చేక్షు పాణీ
బహు యుగ పరిదీప్తా దుర్గ మార్ధ ప్రదాత్రీ –రసమయ కవితొక్తిః వేద వేదా౦గ మూర్తిః’’
4-డా .ధూళిపాళ రామ కృష్ణ –విజయవాడ -9963668214
సంస్కృత సంస్కృతి
1-దుర్గా ప్రసాద కవితా సరసాసుర భారతీ –ఆసక్తి కర సంలగ్నా భూయాత్ కవి యశః కరీ
2-రాజ్యాది భోగ నిష్కామాః రస సిద్ధాః కవీశ్వరాః-ఏయే కామ దుఘా జాతా అమరాన్ తానుపాస్మహే ‘
3-కాంతా సంమితకావ్య మంజుల పదైః రమ్యోప దేశా గిరః –రామాజ్యాచరణ ప్రబోధ రసికా ఉత్తేజ యంత్యఃప్రజాః
ధర్మా ధర్మ వివేక పావన ధియః కుర్వంత్య ఏవానిశం –ఆవేదాత్ సుకవీశ్వరావధి సఖే గీర్వాణ వాణ్యా౦ స్థితాః’’
4-వక్తహ గణికాస్యేవం మాకస్యా పేతి సంస్కృతా-తచ్చూద్రక వచో మూలం మానిషాదేతి మంగళం ‘
5-స్త్రీ వ్యాద ద్విజ సంవాదే పరిణీతేన కర్మణా-సర్వ తోషణ మాదిస్టం వ్యాసేనాద్బుతకర్మణా ‘’
6-భవ వత్స విమత్సరస్సదా-ధృవ మాతా యదవచో దాత్మ జాతం
మనశ్శమ మాదిమ గురుః-సురభాషైవ దిదేశ లక్ష్య సిద్ధౌ ‘’
7-లోక జ్ఞాన దర్శితౌ కావ్యే కణ్వవ్యాధౌ వనౌకసౌ –శాకున్తలే భారవేచ సంస్కృతే సంశ్రూతి స్తదా ‘’
8-గుణేషు క్రియతాం యత్నః గుణ లుబ్ధాహి సంపదః –విమృశ్య కారితా తత్ర ధర్మ రాజేన బోధితా ‘’
9-ఏతద్వ్రతం మమేత్యాహ రాజా రామో మహా యశాః-సర్వాభయ ప్రదానం హి సర్వ దానాధికం మతం ‘’
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -9-12-16 –ఉయ్యూరు

