వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -27
‘’ఏకావలి’’ కి రాసిన ‘’తరల ‘’వ్యాఖ్యానం లో మల్లినాధుడు చర్చి౦చిన రసాలా౦కార విషయాలు
అలంకారం –రసం
కవిత్వం లో ధ్వని ముఖ్య భూమికను పోషిస్తుంది అని సంస్కృత ఆలంకారికుల భావన .ఇదే సాంకేతికంగా రసం అనబడుతుంది .దాదాపు ఆలంకారి కులందరూ మొట్టమొదటి ఆలంకారికుడు భరతుడు దగ్గర్నుంచి దాదాపు ఆలంకారికులు అందరూ రస చర్చ చేసినవారే .కళ లో రసం సౌందర్యానికి భావన .ఈ భావన మీద తాత్విక విచారణ విస్తృతంగా జరిగింది .ప్రొఫెసర్ వి.రాఘవన్ దీనిపై అద్భుత ఆవిష్కరణ చేశారు .రసము ,అలంకారం అనే రెండు పదాలు సంస్కృతం లో సౌందర్యాన్ని వివరించే ముఖ్య విభాగాలు (కాన్ స్టి ట్యుఎంట్స్).వైభవ౦ (పాంప్ ),అలంకరణ ( ఆర్న మెంటేషన్)అనేవి అలంకారానికి లక్షణాలు .శోభ( (స్ప్లెండర్,)రమణీయం (డెలెక్టి బిలిటి )రసానికి ముఖ్య లక్షణాలు .స్థాయీ భావాల ఆధారం గా రసం 9 రకాలు .అవి వేర్వేరు భావాలను అంటే ఆహ్లాద ,అనాహ్లాద మొదలైన వాటిలో చేరి కళాకారుని భావ వ్యక్తీకరణలో ప్రేరణ చేత భాగమై వ్యక్తిగతం చేసి అనుభూతికలిగించి పరమానంద స్థితిని ,ప్రశాంతతను లేక సమదృష్టిని కలిగిస్తాయి .భరతుడు దీనిని –సూత్రీకరిస్తూ –‘’విభావానుభావ వ్యభిచారి సంయోగాత్ రస నిష్పత్తి ‘’అన్నాడు .
కవులు ,అందులోనూ ముఖ్యంగా మహా కావ్య కవులు తమ రచనలను అలంకార పుస్టితో సౌందర్య రుచి సంభూతంగా మలిచారు .కాని కావ్యానికి రసమే ఆత్మ.కావ్యాలు ఈ రకంగా వృద్ధి చెందుతుంటే ,కవిత్వ శాస్త్రం కూడా ఏకకాలం లో స్థానం పొందింది .పూర్వ రచయితలైన భామహుడు దండి ఉద్భటులు అలంకారానికి అధిక ప్రాధాన్యమిస్తే ,ఆనంద వర్ధనుడు లాంటి వారు రసానికి ప్రాధాన్యమిచ్చి అలంకార ,రసాల మధ్య ఉన్న భేదాలను స్పష్టం గా తెలియ జేశారు ,అలంకారం లో ముఖ్య అర్ధం ఆధిపత్యం వహిస్తే ,రసం లో సూచించిన అర్ధ౦ (ప్రతీయమానం )ఇంకా ఎక్కువ ఆధిపత్యం వహిస్తుంది .ఆన౦ద వర్ధనుని తరువాతి ఆలంకారికులు విస్తృతంగా ఈ రెండు భావనలమీదా సమగ్రమైన చర్చ చేసి వెలుగులు కుమ్మరించారు .అలంకార రసాలకున్న సూక్ష్మధర్మాలను వివరించటానికి శక్తి యుక్తులన్నీ ధార పోశారు -అని పి. బి లాల్యే పండితుడు వివరించాడు .
ఏకావలి
14 వ శతాబ్దానికి చెందిన ఒరిస్సా ఆలంకారికుడు విద్యాధరుడు ‘’ఏకావలి ‘’రచించాడు .ఆయన ధ్వని సిద్ధాంతాన్ని కొద్దిగా చర్చించాడు .అందరు ఆలంకారికులు లాగానే విద్యాధరుడు కూడా ఉత్తమకవిత్వానికి ధ్వని ఆధారం అని సూచన చేశాడు .అయినా కొన్ని అలంకారాలను ఏకావలి లో చర్చింఛి నిర్వచింఛి ఉదాహరించి అందులోని రకాలను వివరించాడు .అవి తన స్వంత౦ అని విద్యాధరుడూ చెప్పుకోలేదు దానిపై వ్యాఖ్య రాసినా మల్లినాదుడూ చెప్పుకోలేదు .విద్యాధర ఆలంకారికునికి మల్లినాధుడు వ్యాఖ్యాన కర్త .అయినా సూరి ప్రామాణికమైన మమ్మటుని కావ్య ప్రకాశ ,రుయ్యకుని అలంకార సర్వస్వం లనుండి ఉదాహరణలనిచ్చి తన వాదనలను సమర్ధించుకొన్నాడు . ధ్వని సిద్ధాంతం రససిద్దా౦తానికి అతి సన్నిహిత సంబంధం కలిగిఉంది .నిజానికి ధ్వని కవిత్వానికి ఆత్మ లేకజీవం .ఏకావలి లోని 4 వ ఉన్మేలనం లో విద్యాధర ,మల్లినాదులు దీనిని విస్తృతంగా చర్చించారు .తరువాత ఏకావలి లో లో రసచర్చ చూద్దాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-12-16-ఉయ్యూరు .

