వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -29
‘’ఏకావలి’’ కి రాసిన ‘’తరల ‘’వ్యాఖ్యానం లో మల్లినాధుడు చర్చి౦చిన రసాల౦కార విషయాలు -3
ఏకావలి లో రసవిధానం -2
మల్లినాధుడు అప్పుడప్పుడు చేసే వ్యాఖ్యలు స్వయం వివరణలుగా ఉంటాయి .’’’’వ్యక్తి ‘’పై అభిప్రాయాన్ని రాయటం ఆరంభిస్తూ’’అని మొదలు పెడతాడు .ఇక్కడ వ్యక్తిఅంటే అభినవ గుప్తుని అభి వ్యక్తి అని అర్ధం .దీనిని విద్యాధర ,మల్లినాదులిద్దరూ సమర్ధించారు .కొన్ని పదాలకు పర్యాయ పదాలిస్తాడు .అనుభవ స్థితికి ఎదగటం అంటే పరిపక్వత అనుభవ స్థాయిని అందుకోవటం అని అర్ధం చెప్పాడు .అది చివరికి మనోభావానికి ఎదుగుతుంది .అందువలన రసం సార్వత్రిక స్థాయి ఎదిగి స్వంతం ,అన్యులు ,ఉదాసీనత వంటి సంబంధాలన్నీ దూరమై పోతాయి . అది ప్రేక్షకులమనసులలో ఆనందాన్ని నింపుతుంది .’’కదాపి ‘’అనే మాటలో విద్యాధరుడు రసం అనేది ఏ ఇతర మానసిక క్రియ కు ప్రత్యేకతలు ,దాని ఉద్దేశిత స్వభావాన్ని స్థాపించటానికి వస్తువు కాదు అందుకే ‘’కదాపిత్యా ధీన ‘’అన్నాడు
‘’నానుభూత ‘’వంటి పదాలలో అర్ధాన్ని అన్ని కోణాలనుంచి తీసుకోవాలి కాని ఒకే ఒక ప్రత్యేక కార్యానికే ఉపయోగించరాదు .సాధన కారణం తెలియ జెప్పే ది గా ఉండాలి . రసం విభావ మొదలైన ధనాత్మక ఋణాత్మక భూమిక మీద ఉత్పత్తి అవుతుంది అని చెబుతూ గ్రంధ కర్త రసం ఉత్పత్తి అయితే విభావ మొదలైనవి అదృశ్యమై పోతాయి అన్నాడు .’’న జ్ఞాత ‘’వాక్యం లో రసం భౌతిక రుజువులకు లోను కాదు .’’న క్రాన్తః కార్య తయేతి ‘’=మల్లినాధుడు దీనికి –‘’కార్యత్వే ఘటాదివత్ విభావాదినిమిత్తనాశేపి ,రసాను వ్రుత్తి ప్రసంగఇతి భావః -అది భౌతికాతీతమైనదే కాక అది స్వయం ప్రకాశం కూడా .’’విగలిత ‘’స్వభావం పరమ ఉత్కృష్టమైనఆనందం .అప్పుడు ఇతర మైన విషయాలన్నీ తొలగిపోతాయి .అప్పుడది పరిపూర్ణమై రెండవ దేదీ లేనిదౌతుంది .’’పరిమితౌ ‘’అంటే బ్రహ్మానందాను భూతి కంటే వేరైనదికాదు .’’అనదీతి ‘’అంటే ‘’అపరిచితి ‘’’విగలితేతి-విగలితాని వేద్యాన్తరాణియస్మిన్ తస్య భావస్తత్వం తేనోప లక్షితః నిరతిశయానందాత్మకయా విజాతీయ విషయ స్పురణ పరిహరేణసత్య మేవా ద్వితీయ భావేనా భాసమాన ఇత్యర్ధః ‘’
రసం రుజువులకు చిక్కేదికాదు ,అది స్వయం గా సూటిగా అనుభావి౦చగలిగేది మాత్రమె .అది దృశ్యమానం కాదా?దీనికి సమాధానం ‘’ధ్వవనన ‘’మొదలైనవి .ధ్వవనన చేసే పనినే ‘’వ్యంజన ‘’అంటారు .అది అపూర్వమైన నూతనమైన అసాధారణమైన ధర్మం .’’అపరిచితి అంటే అపరిమితి ‘’అధీతమనేనేతి అధీతీ –సూత్రం లో ఇతి అనేదికలిపాడు ‘’ఇష్టాదిభ్యః ‘’ఉనికి చూపటానికి వార్తిక లో ‘’కతస్యోన్విషయస్య కర్మన్యుప సంఖ్యానాం ఇతి సప్తమీ ‘’
పరిరమ్య అనేది విషయం నిర్భారతయా అంటే ద్రుఢం గా అని అర్ధం .సముల్లాసన్ నువ్యవహితే నన్వయః అంటే అర్ధం అనుభావి0 చేదేకాని చెప్పటానికి కుదరనిది ‘’అనుకార్యానుకర్త్రు గతత్వ పరిహరేణోతి ‘’అనే వ్యక్తీకరణ ను రచయిత భట్ట తౌతుడు మొదలైన వారు చెప్పిన వాటిని తిరస్కరించాడు .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -23-12-16 –ఉయ్యూరు

