గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3
22-ప్రస్థాన త్రయం పై సంస్కృత భాష్యం రాసిన –భద్రేశ్ దాస్ స్వామి
స్వామి మేధో సర్వస్వం (మాగ్నం ఓపస్ )
సంస్కృత మహా విద్వాంసుడు ,’’బోచసన్వాసి అక్షర పురుషోత్తమ స్వామి నారాయణ్ సంస్థ’’(B.A P.S)యోగిపుంగవుడు భద్రేశ్ దాస్ స్వామి .భగవద్గీత బ్ర,హ్మ సూత్రాలు ,ఉపనిష త్తులు అనే ప్రస్థాన త్రయం పై 5 భాగాల స్వామి నారాయణ భాష్యాన్ని సంస్కృతం లో రచించిన మహాను భావుడు .అక్షర పురుషోత్తమ వేదాంతాన్ని వ్యాప్తి చేసినవాడు .అక్షర బ్రహ్మ ,పరబ్రహ్మ ,మోక్ష ,భక్తి,ఉపాసనా మార్గాలను విస్తృతంగా ఇందులో చర్చించి మార్గ దర్శనం చేశాడు .శంకర ,రామానుజ ,మధ్వాచార్య సంప్రదాయాలను అనుసరించి విస్తృతంగా ‘’ప్రస్థాన త్రయం ‘’పై రాసిన మొట్టమొదటి సమగ్ర సంస్కృత వ్యాఖ్యానం ఇది .
విద్యా ఉద్యోగ ప్రస్థానం
సంస్కృతం ,షట్దర్శనాలలో ఎం.ఎ .డిగ్రీని బెనారస్ సంపూర్ణానంద్ సంస్కృత యూని వర్సిటి భారతీయ విద్యాభవన్ ల నుండి 1996 లో పొంది ,కర్నాటక యూని వర్సిటి నుండి భగవద్గీత పై దిసీస్ రాసి 2005లో పి .హెచ్ .డి.అందుకున్నాడు .ఉపనిషత్ ,భగవద్గీత లపై విస్తృత పరిశోధన చేశాడు .మహర్షి సాందీపని వేద విద్యా ప్రతిస్టాన్ లో సభ్యుడయ్యాడు .న్యు ఢిల్లీ లోని స్వామి నారాయణ ఇన్ స్టిట్యూట్ లో, గుజరాత్ లోని వేరావల్ సోమనాధ సంస్కృత విశ్వ విద్యాలయం లోను సంస్కృత , భారతీయ వేదాంతం లపై విద్యార్ధులకు మార్గ దర్శనం చేశాడు .గుజరాత్ లో సారంగపూర్ యజ్న పురుష పాఠశాల లో సంస్కృత శాఖాధ్యక్షుడిగా పని చేసి తత్వ శాస్త్రం ,న్యాయ దర్శనం ,వేదవిజ్ఞానం ,పాణినీయం ,శాస్త్రీయ సంగీత శాస్త్రం లో తబలా ,ఫ్లూట్ వయోలిన్ లపై శిక్షణ నిచ్చాడు .ఢిల్లీ లోని రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ మేనేజర్ గా సమర్దవంతం గా విధి నిర్వహణ చేశాడు .ప్రస్తుతం వేదాలకు భాష్య రచనలో తలమునకలై పని చేస్తున్నాడు .
శ్రేయాంసి బహు విఘ్నాని
పి .హెచ్. డి. పొందిన తర్వాత గురువు ప్రముఖ్ స్వామి మహారాజ్ భద్రేశ్ స్వామిని ‘’ప్రస్థాన త్రయం ‘’పై విపులమైన భాష్యం రాయవలసినదిగా ఆదేశించగా స్వామినారాయణ భాష్యం రాశాడు .2007జూన్ లో సారంగాపూర్ జిల్లాలోని ఒక పల్లె టూరులోఆశ్రమం లోని బేస్ మెంట్ లోని చిన్నగదిలో రచన ప్రారంభించి రాస్తుండగా విపరీతమైన వర్షాలు వరదలు వచ్చి రాసిన 25 ,00 పేజీల రచన , నోట్సు అంతా నీటిలో కొట్టుకు పోయింది .డిసెంబర్ 2007కు భాష్యం పూర్తికావాల్సి ఉంది .ఏమి చేయాలో పాలుపోకుండా ఉంటె గురుమహరాజ్ వచ్చి ఆశీర్వదించి పునః ప్రారంభించమన్నారు .రోజుకు 20 గంటలు అదే ధ్యానం గా రాసి స్వామినారాయణ భాష్యాన్ని20,150 పేజీలతో పూర్తీ చేసి 17-12-2017న సంస్థ శత వార్షికోత్సవం రోజున అహ్మదాబాద్ లో ఆవిష్కరింప జేశాడు . శంకరాచార్యుల వారు (780-820) రాసిన ప్రస్తాన త్రయ భాష్యం తరువాత భద్రేశ్ దాస్ స్వామి రచించిన ఈ భాష్యం 15 వ మహా భాష్యంగా జబల్ పూర్ యూని వర్సిటి ఫిలాసఫీ ప్రొఫెసర్ ఎస్ .పి దూబే అభి వర్ణించాడు .ఎన్నో యూని వర్సిటీలనుండి మేధావులు ఫిలాసఫర్లు ఈ భాష్య ప్రత్యేకతను వేనోళ్ళ శ్లాఘించారు .
సన్మాన సత్కార ప్రస్థానం
భద్రేశ్ స్వామి భాష్యానికి గుర్తింపుగా నాగ పూర్ లోని కాళిదాస సంస్కృత యూని వర్సిటి డి.లిట్ ను, మహా మహోపాధ్యాయ బిరుదును ఇచ్చి గౌరవించి సత్కరించింది .మైసూర్ యూని వర్సిటి నుండి జి.ఏం .మెమోరియల్ అవార్డ్ ,’’దర్శన కేసరి పురస్కారం ‘’,అందుకొన్నాడు .2015 లో బాంకాక్ లో జరిగిన ప్రపంచ సంస్కృత సమ్మేళనం లోధాయ్ లాండ్ లోని సిల్పకారన్ యూనివర్సిటి ‘’వేదాంత మార్తాండ సమ్మాన్ ‘’ప్రదానం చేసి భద్రేశ్ స్వామిని ఘనంగా సత్కరించింది .
. భద్రేశ్ స్వామి భద్ర రచనా వైభవం
1-ప్రస్థాన త్రయం పై స్వామినారాయణ భాష్యం 2-ఉపనిషత్ స్వామి నారాయణ భాష్యం ౩-చాన్దోగ్యోపనిషత్ పై స్వామి నారాయణ భాష్యం 4-ముక్తి మీమాంస 5-ఉపనిషత్ సారం మొదలైనవి .
సార్ధక జన్ములు భద్రేశ్ స్వామీ మహారాజ్ .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-12-16-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్
—

