వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -30
‘’ఏకావలి’’ కి రాసిన ‘’తరల ‘’వ్యాఖ్యానం లో మల్లినాధుడు చర్చి౦చిన రసాల౦కార విషయాలు -3
ఏకావలి లో రసవిధానం -3
రస విధానం లో 2 వభాగం 23-12-16 న రాశాను .మళ్ళీ ఇప్పుడు కొనసాగిస్తున్నాను .
కావ్యాలలోరాముడు మొదలైన పాత్రలు కొద్ది గానే ఉన్నాయి .అవీ పూర్వకాలం పాత్రలు నటుడు ఈ పాత్రలను పోషించే టప్పుడు ఆ రస భావం అనుభావైకం కాదు అతని దృష్టి అంతా నటనపైనా వినోదం ఇవ్వటం పైనా డబ్బు సంపాదనపైనా కేంద్రీకరించి ఉంటుంది . రసభావన కలగాలంటే నటుడు ప్రేక్షక స్థానం లో ఉండాలి .మరి అప్పుడు రసం పరిధి ఏమిటి ?అప్పుడతను ప్రేక్షకులే పరిధి గా నిరూపిస్తాడు ‘’సామాజికానామితి ‘’.ప్రేక్షకులలో రసానందం కలుగుతుందా ?కాదన్నాడు .ప్రేక్షకుడికి తనకు అనుభావాలైన ప్రేమ మొదలైన వి వాసనా రూపం లో ఉంటాయి .అంటే ప్రేక్షకునిలో వాసనా రూపం లో ప్రేమ ,శృంగారం వంటికి శాశ్వత స్థాయి ఉంటుంది .ఈ స్థాయి ఆనందాన్నివ్వటం లో ఉన్న నిర్ణాయకాలలో అనేక తేడాలుంటాయి .ఈ తేడాలురసం కంటే భిన్నం కాకపొతే వాటి ఉనికికి సార్ధకమేమిటి ?దీనికి సమాధానం ‘’పానక రసన్యాయం .పానకం లో అనేకం కలిసిఉన్నా మొత్తం మీద దాని రుచి వేరుగా ఉంటుంది .అంటే అన్నీ కలిసి ఒక కొత్త అనుభవాన్ని స్తాయి .అందులోని పదార్ధ ప్రత్యేకతలన్నీ కరిగిపోతాయి . ‘’.ఇక్కడ కూడా అంతే .ప్రతిదీ కూడా రసం లాగానే అనుభూతమౌతుంది .కాని చివరికి వాటి సమాహార భావనఅలౌకిక ఆనందాన్నిస్తుంది ఆనందం ఎలాగో ఇదీ అలానే .’’చార్వ్య మాణాతైకప్రాణాఇతి -అనుభవైక జీవిత ఇత్యర్ధః ‘’దీనితో దాని అసాధారణ ,అసామాన్యమైన స్వభావం ఎలా స్థాపించ బడుతుంది ?దీన్ని ఊహించిన రచయిత రసం అంటే బ్రహ్మాను భూతి అన్నాడు ‘’బ్రహ్మాస్వాద సబ్రహ్మ చారీ-బ్రహ్మాస్వాదకల్ప ఇత్యర్ధః ‘’బ్రహ్మానందం శాశ్వతం గా ఉన్నప్పటికీ అంతరాయం లేని నిరంతర ధ్యానం వలన పొందగలుగుతారు అంతకు ముందు కాని ,ఆ ఆతర్వాత కాని అది ఉండదు. అలాగే రసం కూడా స్వయం ప్రకాశకం (సెల్ఫ్ లూమినస్ ).అదిసదా కట్టుబడి ఉండే ఆనంద సారం యొక్క స్వభావం .అది మానసిక గుణం .అది సూచన అనే ‘’వ్యాణీ జన ‘’తో కలిసి ఉంటుంది .జ్ఞానం మొదలైన వాటినుండి వేరు చేయబడి ఉండి వ్యక్తమౌతుంది అది స్వయం ప్రకాశకం గా దర్శన మిస్తుంది .ప్రాపంచిక ఆనందం ఇలా ఉండడు అయితే అసాధారణ అసామాన్య మైన రస స్వభావాన్ని ఎలా కాదనగలం ?రసం బ్రహ్మానందమే .బ్రహ్మానుభవాన్ని యోగ సాధన వలన సాధించ వచ్చు .ఇదే తేడా .ఇక్కడ సరైన విభావ ,అనుభావాదులవలన అనుభవించగలం .ఇదొక్కటే ఈ రెండిటికి ఉన్న తేడా -’’కిం చ బ్రహ్మానంద ఏవాయ మన్యత్ర యోగా గమ్యః-అత్ర తువిభావాదను సంధాను సంధానం గమ్య ఇతీయన్ ‘’
రసానుభవం అనేది సౌందర్య రసజ్నులందరి మనసుల కు సాక్షి .దీని వశీకరణ ఇంద్రియాతీతమైనది .దాని రహస్యాన్ని ఎవరూ విప్పి చెప్పలేరు నిరూపించలేరుకూడా ..అందుకే ఈ ఉద్దేశ్యం తోనే ‘’లోకోత్తర చమత్కారి ‘’అనే పదాన్ని ప్రయోగించాడు దీనిపై రూడేన్ బెర్గ్ చక్కని వివరణ ఇచ్చాడు దాన్ని ముందే మనం తెలుసుకొన్నాం .ప్రేమ మొదలైనవి విభావాలనుండి పుడతాయి అవి ఆలంబన కారణాలయి స్త్రీలలో విభావ నలను చంద్రుడు,కోకిల స్వరం మలయా మారుతం ,అందమైన ఉద్యానవనాలు మొదలైన ఉద్దీప కారణాల వలన అనుభలవుతాయి .విద్యాధరుడు మొదటి అధ్యాయం లోనే ధ్వని సిద్ధాంత సూచన చేశాడు .ధ్వన్యాలంకార కర్త ఆనంద వర్ధనుని సిద్ధాంతాన్ని మరో సారి సమర్ధించి చెప్పాడన్నమాట .ధ్వనిని వ్యతిరేకించేవారిని వ్యతిరేకించాడు విద్యాధరుడు .ఈ విషయం లో మల్లినాద సూరి వ్యాఖ్యానం చాలా సరళం సంక్షిప్తం వివాదాస్పదం .
దీని తర్వాత ఏకావలి లో అలంకారాలను గురించి తెలుసుకొందాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
—

