వీక్లీ అమెరికా -17(17-7-17 నుండి 23-7-17 వరకు )
వెంకయ్య నాయుడు వారం
17-7-17 సోమవారం -ఉపరాష్ట్రపతి పదవికి యెన్ డి ఏ అభ్యర్థిగా శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడిని ప్రధాని మోడీ ప్రకటించాడు .మోడీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర్నుంచీ ఈ పేరు వినిపిస్తూనే ఉంది .వెంకయ్యమాత్రం ‘’నేను ఉషాపతి ని మాత్రమే ఉప రాష్ట్ర పతి నికాను ‘’అని ప్రకటిస్తూనే ఉన్నాడు .ఇప్పుడు తప్పలేదు . ఒక ఆంధ్రుడికి ఒక క్రియాశీలక కార్యకర్తకు వక్తకు ముఖ్యంగా మన భాష సంస్కృతులపై విశేషమైన అభిమానమున్న వెంకయ్యకు ,అంటే ఆంధ్రులకు దక్కిన అరుదైన గౌరవం ఇది ..మెజారిటీ ఎలానూ ఉందికనుక ఎన్నిక లాంఛన ప్రాయమే .
వెంకయ్య పై నాకున్న అజ్ఞాత పరిచయం .బహుశా 1967-70 మధ్యకాలం అనుకొంటా సరిగ్గా గుర్తు లేదు . బందరు హిందూకాలేజి లో లెక్కలమేస్టారుగా శ్రీ రాజనాల శివరామ కృష్ణ మూర్తి -ఆర్ ఎస్ కె మూర్తి అనే ఆయన తో పరిచయం కలిగింది .ఆయన లెక్కలు బాగా చెప్పేవారు ఇంటిదగ్గర ట్యూషన్ కు వందలాది విద్యార్థులు ఉండేవారు ఇంగ్లిష్ లో దిట్ట .ఆర్ ఎస్ ఎస్ కు సుశిక్షిత కార్యకర్త బి జెపి నాయకుడు .జాగృతి వారపత్రిక ఆయనే చూసేవారు అందులో సినిమా రివ్యూ చాలా గొప్పగా రాసేవారు మీదు మిక్కిలి మంచి కథా రచయి. హాస్యం అంతర్వాహినిగా ఉండేది ఆయన రచనలలో . మాకు ఫామిలీ ఫ్రెండ్ .ఇద్దరం కలిసి శ్రీ కొల్లూరి కోటేశ్వరరావు గారి అభ్యర్ధన మేరకు ఆయన శాసనమండలి ఎన్నికకు ప్రచారం కూడా చేసాం .మేస్టారూ అని ఆప్యాయంగా పిలిచేవాడిని .
అప్పుడాయన ‘’సాందీపని ‘’అనే మాస పత్రిక నడిపేవారు . దానిలో నన్ను కవితలు రాయమని కోరేవారు .అప్పుడాయన నెల్లూరి కుర్రాడు వెంకయ్య నాయుడు అనే అబ్బాయి చాలా వినయ వివేక శీలి బుద్ధిమంతుడు ,గొప్ప కార్యకర్త .సాందీపనిలో రాస్తూంటాడు .అని చెప్పేవారు ఇదే అజ్ఞాత పరిచయం .నేను ఇందిరా గాంధీ పై ‘’కొమ్మా బొమ్మా అమ్మ ‘’అనే వ్యంగ్య కవిత రాశాను అది చదివి ఆయన సాందీపనిలో ప్రచురించారు . కనుక వెంకయ్య రాసె పత్రికలో నేనూ రాయటం అజ్ఞాత పరిచయమే . తరచుగా వెంకయ్య మేష్టారి దగ్గరకు వచ్చి సలహాలు తీసుకొనే వాడు . ఆ తర్వాత ఆంధ్రా ఉద్యమం లో ఢిల్లీ నుంచి గల్లీ దాకా జరిపిన సభలలో వెంకయ్య ,యలమంచిలి శివాజీ ,వడ్డే శోభనాద్రీశ్వరరావు సుంకర సత్యనారాయణ కొమరగిరి కృష్ణమోహన్ లవంటి యువ రక్తం ఊరూ రా ఉపన్యాసాలతో హోరెత్తించేవారు .విశాఖ ఉక్కు ఉద్యమం లోనూ ముందే ఉన్నారు వాటిఫలితం దక్కలేదు కానీ వీరి పాత్ర మరువలేనిది . వీరిలో శివాజీ ధీరిటీషియన్ .స్టాటిస్టిస్ తోమాట్లాడేవాడు .ఉపన్యాసం రాణించేదికాదు . కొమరగిరి ,వెంకయ్య లు దారాళ పాత వక్తలు .బిజెపి ఆర్ ఎస్ ఎస్ ను నరనరానా జీర్ణించుకున్నవారు .సుంకర కూడా వంకర ప్రాస లతో జనానికి కిక్కెక్కించేవాడు . శివాజీ రాజ్య సభ సభ్యత్వ0 తో చరణ్ సింగ్ అంతేవాసిత్వం తో ఆగిపోతే ,కొమరగిరి ఇక్కడే ఆగి ఒక ఆధ్యాత్మిక పత్రికా సంపాదకుడుగా బందర్ కె పరిమితమైతే లకు ఎక్కడో లక్కలాపట్టి సుంకర కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాడు .వద్దే లోక్ సభ సభ్యుడు రాష్ట్ర మంత్రీ అయ్యాడు . పార్టీని సిద్ధాంతాన్ని పూర్తిగానమ్మి జనసంఘ్ తో తర్వాత భారతీయ జనతాపార్టీ తో నిబద్ధంగా ఉంటూ సుశిక్షిత ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తగా అందరి అభిమానం పొంది గొప్పవక్తగా ప్రాస యమక చక్ర వర్తి గా అంచెలంచలు మీద ఎదిగి బిజెపి అత్యున్నత వ్యవస్థాగత స్థానం పొంది ,ఆంధ్రా విభజన సమయం లో కీలక పాత్ర పోషించి అన్యాయం జరగకుండా ప్రయత్నించి ,అటల్ బిహారీ వాజ్ పేయికి ,లాల్ కృష్ణ అద్వానీ కి అంతేవాసియై మోడీ ప్రధానికావటానికి అడ్డంకులు తొలగించి ,తానూ కేంద్ర మంత్రిపదవి పొంది ,ప్రతిపక్షాలతో చక్కని సంబంధం కలిగి సమస్యా పరిష్కారానికి తగిన వాడనిపించి ఇప్పుడు ఉపరాష్ట్ర పతి పదవి అందుకో బోతున్నాడు నిబద్ధతకు తగిన ప్రతిఫలం ఇది . ఏనాడూ జంపింగ్ ఫ్రాగ్ కాలేదు .ఇది ఆంధ్రులందరు గర్వించదగిన సమయం .అందుకే ఈవారం వెంకయ్య వారం అన్నాను .
మంగళవారం గీ -3 లో కొండవీటి వేంకటకవి పై రాశాను .ఆస్ట్రో ఫిజిక్స్ ఆధారం గా బ్లండరే బ్లండర్ , మూలకాలు అంతరిక్ష మార్పులు రాశాను .ఇక్కడి వేసవి ఉష్ణోగ్రత 100 ఫారం హీట్ డిగ్రీలు ఉంటోంది .యెన్ కస్తూరి అనే ఆయన రాసిన ‘’లవింగ్ గాడ్ ‘’చదవటం ప్రారంభించి ఆపకుండా దాదాపు ఎనభై పేజీలు చదివాను చాలాబాగా ఉంది .కేరళలో పుట్టి మైసూర్ లో ఉద్యోగించి ,ఎన్నో సేవాకార్యక్రమాలు చేసి,శ్రీరామకృష్ణ పరమహంస ,వివేకానంద మార్గం లో ప్రయాణించి సత్యసాయికి దగ్గరై ఆయన జీవిత చరిత్రను తన జీవిత చరిత్రతో కలిపి చాలా బా గా రాశాడు .షిరిడీ సాయి జీవిత చరిత్రకు దంబోల్కర్ అనే హేమాద్రిపంత్ రాసిన షిర్డీ బాబా సచ్చరిత్ర ఎంత సాధికారమైనదో ,శ్రీ కస్తూరి రాసిన ;;లవింగ్ గాడ్ ‘’సత్యసాయి జీవిత చరిత్రకు అంతటి ఆదేంటిక్ రచన అని అందరి అభిప్రాయం .
గురువారం పెన్సిల్వేనియా నుంచి శ్రీమతి శ్రీదేవి గారు మెయిల్ రాస్తూ తాను రెండు పుస్తకాలు పంపాననని అందాయా అని అడిగి మనబ్లాగ్ చాలా ఆసక్తికరంగా ఉందని మెచ్చుకొన్నారు .ధన్యవాదాలు తెలియ జేశాను .రాత్రి రాజేంద్ర ప్రసాద్ సినిమా ‘’గుండమ్మగారి మనవళ్ళు ‘’గొట్టం లో చూసాం . సరదా సినిమా ..
శుక్రవారం శ్రీ మైనేనిగారు శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడుగారు ‘’ముండకోపనిషత్ ‘’పై ప్రసంగం చూడమంటే చూశాను బాగుంది .దీనితోపాటు స్వామి రామా ఉపనిషత్తులపై ఆంగ్లప్రసంగం అద్వైత వేదిక లో శ్రీ అరవిందరావు ప్రసంగాలూ చూశాను . దేనికదే అనర్ఘ రత్నం .
22-7-17 శనివారం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ఉదయం అభిషేకం శాకాంబరీ పూజ ,సాయంత్రం శాకాంబరీ పూజా విశేషాలపై ప్రసంగం బాగా జరిగాయి రమణ అన్నీ దగ్గరుండి నిర్వహింపజేశాడు .
సెప్టెంబర్ 5 మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవం నాడు నాకూ మైనేనిగానికి గురువులైన కీశే శ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గురు వరేణ్యుల గురుపూజోత్సవ కార్యక్రమాన్ని శ్రీ గోపాల కృష్ణగారు ,మా గురుపుత్రులు శ్రీ కోట సోదరులతో మా అబ్బాయి రమణ తో సంప్రదించి నిర్ణయించాము . రాత్రి అన్నమయ్య సినిమా ట్యూబ్ లో చూసాం .
23-7-17 ఆదివారం ఉదయం అంతా తీవ్రమైన ఎండ సాయంత్రం మంచి వర్షం కురిసింది .వీక్లీ న్యూస్ సమాప్తం
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -23-7-17 -కాంప్-షార్లెట్-అమెరికా