సంగీత సద్గురు శ్రీ త్యాగరాజస్వామి 171 ఆరాధనోత్సవం పుష్యబహుళ పంచమి 6-1-18 శనివారం
సాయంత్రం 6-30 గం లకు సరసభారతి 117 వ కార్యక్రమంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో జరుగును .సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ అధ్యక్షతన సరసభారతి గౌరవాధ్యక్షులు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి గారి ఆధ్వర్యం లో శ్రీమతి కందాల విజయ ,శ్రీమతి పోపూరి పద్మజ ,శ్రీమతి వేమూరి గీతాకళ్యాణి ,కుమారుడు ,,శ్రీమతి నూతి శారదా కుమారి కుమారి మాదిరాజు బిందు దత్తశ్రీ లు త్యాగరాజ పంచరత్నకీర్తనలు ,గానం చేస్తారు .గాయకులకు స్వర్గీయ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ స్మారక పురస్కారాన్ని శ్రీ కోమలి సాంబావదాని శ్రీమతి విజయలక్ష్మి (అమెరికా)దంపతుల సౌజన్యం తోసరసభారతి అధ్యక్షులు ప్రదానంచేస్తారు ..సంగీత సాహిత్యాభిమానులు విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన -గబ్బిట దుర్గాప్రసాద్
—

