గీర్వాణకవుల కవితా గీర్వాణం -4
12-భక్త్యుద్బోధక పంచకం కర్త –శ్రీమాన్ కోవెల రంగాచార్య
ఆంద్ర దేశం లో జరిగే వేద విద్వత్ సభలలో తెలంగాణా ప్రాంతం నుండి శ్రీమాన్ కోవెల రంగా చార్యులుగారు ‘’యే కంఠలగ్న తులసీ నళినాక్ష మాలాః ‘’అన్నట్లుగా విలక్షణ వైష్ణవ చిహ్నాలుకలిగి ,పాండిత్య స్పోరకమైన సింహ తలాటాలు హస్త భూషణాలుగా ధరించి ,కంచు కంఠం తో గంభీరంగా విస్తృత ఉపన్యాసాలు చేసేవారు .ఆ సభలకు గొప్ప ఆకర్షణగా నిలిచేవారు . వీరితోపాటు శ్రీ అమరవాది నారాయణాచార్యస్వామి గారు కూడా గంభీరోపన్యాసాలతో ఆకట్టుకునేవారు వీరిద్దరిని సూర్య చంద్రులుగా భావించేవారు .అమరవాదివారిది సంస్కృత వేదాంతం లో అందె వేసిన చేయి .కోవెలవారు తూర్పు గోదావరి జిల్లా తుని లో శ్రీ నల్లాన్ చక్రవర్తుల రంగా చార్యుల వారి వద్ద మూడేళ్ళు తర్క శాస్త్రాధ్యయనం తో సహా శ్రీ భాష్యం అభ్యసింఛి ఉభయ వేదాంత ప్రవచకులయ్యారు .
సంస్కృత సాహిత్యం గీతాభాష్య శ్రీ భాష్యాలు కరతలామలకం అవటం తో ప్రౌఢ పాండిత్యం తో పాటు అద్భుత కవిత్వమూ అబ్బింది .గొప్ప సంస్కృత రచనలు చేసి తమ ఉభయ వేదాంత నిధి ని సార్ధకం చేసుకున్నారు .కావలసిన అధికారులు లేకపోవటం తో శ్రీ భాష్య ప్రవచనం చేయలేదు చివరికి తన కుమారు లిద్దరి కూర్చోబెట్టుకుని శ్రీభాష్య ప్రవచనం ప్రారంభించారు .అప్పటికే 75 వయసులో ఉన్నా ఎక్కడా విస్మ్రుతికాని ,పూర్వోత్తర విషయ ప్రస్తావనలో విస్పస్టత కాని తగ్గలేదట .అదీ వారి పటుతర విషయ ధారణ.
తమ విషయ పరిజ్ఞానికి ,కవిత్వ పటుత్వానికి దీటుగా కోవేలవారు సంస్కృతం లో రచనలు’’ శాయించారు’’ .123శ్లోకాలతో రాసిన ‘’శాస్త్ర హృదయం ‘’పండితలోకాన్ని మెప్పించింది .ఇతర కృతులు వేదాంత పంచ విమ్శతి ,గీతార్ధ సంగ్రహం ,భక్త్యుద్బోధ పంచకం ,చన్నూరు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ,పర్ణశాల శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ,గోపాల విమ్శతీ ,భగవత్ప్రార్ధనా వ .120 సంవత్సరాల పూర్ణాయుర్దాయం తో జీవించి’’ ద్వి షష్టిపూర్తి ‘’ఉత్సవాలు ఘనంగా పుత్ర పౌత్రాదుల సమక్షం లో నిర్వహించుకున్న ఘనత శ్రీమాన్ కోయిల్ కందాళై రంగా చార్యుల వారిది .వీరి గ్రంధాలను ‘’కోవెల రంగాచార్య మెమోరియల్ ట్రస్ట్ ‘’వారు శ్రీ కోవెల సంపత్కుమారాచార్య శ్రీ కోవెల సుప్రసన్నాచార్య సోదర బృందం 20 05 లో ప్రచురించి లోకానికి అందించింది .అర్ధ తాత్పర్యాలు కూడా చేరిస్తే జిజ్ఞాసులకు ఉపయుక్తంగా ఉండేది . ఇప్పుడు కోవెలవారి గీర్వాణ కవితా కోవెల లోకి ప్రవేశిద్దాం –
1-శాస్త్ర హృదయం
1-శ్లోకం -యజ్జన్మాద్యస్య జగతః నిర్ధూతాఖిల కల్మషం –నమస్తస్మై మహానంద రూపిణే గుణ దీపినే ‘’
8- జ్ఞానాజ్ఞాన ద్వయం లోకే మోక్ష బంధైక కారణం –జ్ఞానాన్మోక్ష మథాజ్ఞానాత్ సంసార ఇతి సూత్రితం .
18- శ్రీపతిత్వం వ్యాపకత్వం నిత్యత్వ మనవద్యతా –నైర్గుణ్య౦ నిర్వికారత్వం నిరాకారత్వ మిత్యపి .
39-ఇత్యాది తత్వ మస్యా౦తకమ్ వాక్య ముద్దాలకో బ్రవీత్ –కారణత్వ నియంత్రత్వ శేషిత్వా ధారతాదికం ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-1-18 –ఉయ్యూరు

