— గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
13-సంస్కార రచన కర్త -అభయంకర్ కమల్ శంకర్ –(1938 )
15-12-1938 న మహారాష్ట్ర లో జన్మించిన అభయ౦కర్ కమల్ శంకర్ సంస్కృతం లో ఎం. ఏ., పి హెచ్ డి చేశాడు బొంబాయ్ మహిళా విద్యా పీఠం లో సంస్కృత శాఖాధ్యక్షులుగా పని చేశాడు .సంస్కృతం లో ఆరు గ్రంధాలు రాశారు.అందులో 1-సంస్కార రచన 2-సంస్కృత నిబంధాదర్శం3 కావ్య మీమాంస 4-హాస్య తుషారా మొదలైనవి .
14-ఉద్దవ శతకకర్త –ఆచార్య బుద్ధి వల్లభ (1936 )
వ్యాకరణం లో ఆచార్య అయిన బుద్ధివల్లభ 15-6-1936 న ఉత్తరాఖండ్ లోని అండీ పట్టి లో జన్మించాడు .విద్యా వాచస్పతి గా వెలిగాడు .హరిద్వార్ లోని జగత్ దేవ్ సింగ్ సంస్కృత కాలేజీ ప్రిన్సిపాల్ గా పనిచేశాడు .రసకలసి,ఉద్దవ శతకం రచించాడు .
15-జైన దర్శన సార కర్త –ఆచార్య చిన్ సుఖ్ దాస్ (19 00 )
న్యాయం లో ఆచార్య,తీర్ధ డిగ్రీలు పొందిన చిన్ సుఖదాస్ 1900 లో జైపూర్ లో జన్మించాడు .జైపూర్ దిగంబర జైన సంస్కృత కాలేజీ ప్రిన్సిపాల్ చేశాడు .జైన దర్శన సార ,పావన ప్రవాహ ,భావనా వివేకః ,షోడశ కారణా భావన ,అర్హత ప్రవచన సంస్కృతం లో రచించాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-1-18 –ఉయ్యూరు

