సాహితీ బంధువులకు సంక్రాంతి శుభాకాంక్షలు – సరసభారతి ఆధ్వర్యంలో ఉయ్యూరులో వేదవిద్వత్ సభలు ఏప్రిల్ 29, 30 ఆది సోమవారాలలో రెండు రోజులు నిర్వహించాలని డా శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు కోరటం ఆ విషయం మీకు తెలియ జేయటం తిరిగింది .ఈ నెల 2 వతేదీ కెసిపి సిఇఓ గారి తో ఆ విషయం మాట్లాడాలను కొని ఫోన్ చేస్తే వారు చాలా పనులఒత్తిడిలో ఉన్నామని అనుకూలమైన తేదీ తామే ఫోన్ చేసి తెలియ జేస్తామని అన్నారు .గబ్బిట వారు 4 వ తేదీ యలమర్రు లో వేదపండితుల లిస్ట్ నమూనా ఆహ్వానపత్రం తెచ్చి నాకు ఇచ్చి కాశీకి వెడతానన్నారు .నిన్న ఉదయం వరకు వై రెండువైపులనుంచి వార్తలేమీ రాలేదు .ఇక ఇది మనవల్లకాని విషయ మనుకోని ఆలోచన విరమించి ఉగాదినాడు సరసభారతి వేడుకలలో నలుగురు వేదపండితులకు సత్కారం చేసి సరి పుచ్చుకుందాం అని పించి ఈ విషయం గబ్బిట వారికి ఫోన్ చేసి చెబుదామనుకున్నా
కానీ నిన్న ఉదయం మా దేవాలయం లో ధనుర్మాసఉదయ పూజాదికాలు అయి ఇంటికి రాగానే కెసిపి నుండి ఫోన్ వచ్చి మధ్యాహ్నం 3 -15 కు సి యి ఓ గారితో అపాయింట్ మెంట్ ఉంది రమ్మన్నారు నేనూ మా అబ్బాయి రమణ వెళ్లాం వారు చాలా మర్యాదగా ఆహ్వానించారు మన”ద్వయం”వారికి అందజేసి సూటిగా విషయం చెప్పాం .వారు చాలాసంతోషించి తమ ప్రాంగణం లో వేద సభలు నిర్వహించటానికి అనుమతించి ,కావలసిన ఇన్ఫ్రా స్ట్రక్చర్ అంతా అందజేస్తామని హామీ ఇచ్చారు . డబ్బు యెంత ఖర్చవుతుంది అంటే చెప్పాం . ఫండ్స్ ప్రయత్నించండి అన్నారు మేము నిధులు దొరికితేనే ముందుకు సాగుతాం లేకుంటే లేదు అని చెప్పాం . .దీనినే నేను ”నాడా దొరికింది ”అన్నాను ఇక గుర్రం కొనాలి .. పడకేసింది అనుకొన్నది మళ్ళీ సాగి ఆశలు చిగురించాయి .జనవరి 18 మాఘమాసం వచ్చాక మిగిన పెద్దలను కలిసి సరసభారతి కెసిపి గ్రామ పెద్దల సహకారం తో కార్య క్రమ0ఆలోచించాలి .ఇదీప్రస్తుత తాజా వార్త. .వేదమాత అనుగ్రహం ఆంజనేయస్వామి కరుణ ఎలాఉంటే అలా జరుగుతుంది -దుర్గాప్రసాద్
—
About gdurgaprasad
Rtd Head Master
2-405
Sivalayam Street
Vuyyuru
Krishna District
Andhra Pradesh
521165
INDIA
Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D