గీర్వాణకవుల కవితా గీర్వాణం -4
26-సీమాతిక్రమణ౦ కర్త –ఆచార్య శ్రీకాంత్
జననాది పూర్తి వివరాలు లభ్యంకాని ఆచార్య శ్రీకాంత్ ఉత్తరాంచల్ లోని డెహ్రాడూన్ లో జన్మించాడు .హిమాచల్ ప్రదేశ్ లోని సొలాన్ ప్రభుత్వ సంస్కృత కాలేజి లెక్చరర్ గా పని చేశాడు .సీమాతిక్రమణ౦,ప్రతాప విజయం సంస్కృతం లో రాసినట్లు తెలుస్తోంది .
27-వేద గణితాన్ని ఆధునిక గణితం తో పోల్చిన –ఆచార్య సుద్యుమ్న (1946 )
సంస్కృతం లో ఎం ఏ పిహెచ్ డి అయిన ఆచార్య సుద్యుమ్న 9-1-1946 న మధ్యప్రదేశ్ లోని సాత్నాలో జన్మించాడు .సాత్నా లోని వేదవాణి వితాన్ ఓరియెంటల్ పబ్లికేషన్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ డైరెక్టర్ చేశాడు.గణిత శాస్త్రం పై 10 పుస్తకాలు రచించాడు .వ్యాకరణం లింగ్విస్టిక్స్, ఫిలాసఫీ ,ఫిజికల్ సైన్స్, వేద , వేదిక్ సైన్స్ ,పూర్వ గణితాలపై ప్రత్యెక పరిశోధన చేశాడు .ప్రాచీన శాస్త్రాల లను ఆధునిక విజ్ఞానం తో సరిపోల్చి అనేక రచనలను ఆధునికులకోసం రాసి ప్రాచీన వేద విజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చాడు .ప్రాచీన గణిత శాస్త్ర వేత్తల సిద్ధాంతాలు ,సూత్రాలను హై లైట్ చేయటమే ధ్యేయంగా ఆయన రిసెర్చ్ సాగింది .సుద్యుమ్న సాటి లేని సాహిత్య కృషికి రాష్ట్ర పతి పురస్కారం లభించింది .
28-ఉద్యోగ లహరి కర్త –ఆచార్య సూర్యనారాయణ –(1883 )
1883 లో భివానీ లోని కనోద్ లో జన్మించిన ఆచార్య సూర్య నారాయణ వ్యాకరణం లో ఆచార్య .జైపూర్ మహారాజా సంస్కృత కాలేజి లో సంస్కృత ప్రొఫెసర్ .సవాయ్ .మాన్సింగ్ లో సీనియర్ ప్రొఫెసర్ . మానవాంశ,ఉద్యోగ లహరి సంస్కృత కావ్యాలు రాశాడు .సంస్కృత రత్నాకర పత్రిక కు సంపాదకుడు .సాహిత్య భూషణ్ బిరుడుపొండాడు .
29-కర్తవ్య సా త్రి౦సిక కర్త –ఆచార్య తులసి (
రాజస్థాన్ లోని లడాను లో జన్మించిన ఆచార్య తులసి సంస్కృతం లో 8 గ్రంథాలు రాశాడు . అవే -కర్తవ్య సా త్రి౦సిక ,పంచ సూత్రం ,శిక్షా సన్నవతి మొదలైనవి .ఇంతకంటే వివరాలు తెలియలేదు .
30-పంచశతి కర్త –ఆచార్య విద్యా సాగర్ (1946 )
10-10-1946 కర్నాటక బెలగాం లో జన్మించిన ఆచార్య విద్యాసాగర్ సన్యాసం స్వీకరించాడు .మరాటీ .దర్శన ,ఇతిహాస ,మత ,సాహిత్య న్యాయ వ్యాకరణ ,సైకాలజీలలో అఖండ ప్రజ్ఞావంతుడు .అయిదు శతకాల సంపుటిగా ‘’పంచశతి ‘’రాశాడు .
సశేషం
సంక్రాంతి శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-1-18 –ఉయ్యూరు

