గీర్వాణకవుల కవితా గీర్వాణం -4
31-మార్క్సిజం మతం శాస్త్రం కర్త –అదత్ ధర్మ రాజ్ (1957 )
10-4-19 5 7 జన్మించిన అదత్ ధర్మరాజ్ సంస్కృతం లో ఎం ఏ పిహెచ్ డి..కాలడి శంకరాచార్య సంస్కృత విశ్వ విద్యాలయ సంస్కృత ప్రొఫెసర్ .25 గ్రంధాలు రాశాడు .అందులో మార్క్సిజం –భగ వద్గీతాం , మార్క్సిజం మతం శాస్త్రం,లోకాయత దర్శనం వగైరా .
32-మధుర సంస్కృతం కర్త –అధికారి హరి ప్రసాద్ (19 6 3 )
సంస్క్రతం లో పిహెచ్ డి మరియు వారణాసి సంపూర్ణానంద సంస్కృత యూని వర్సిటి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ .ఈయన గురు పరంపర కాశీనాద్ ,పండిట్ రాం పతి త్రిపాఠీ ,పండిట్ మహేష్ చంద్ర శర్మ ,ప్రొఫెసర్ రాధేశ్యాం ద్వివేది .హరిప్రసాద్ రచించిన నాలుగు గీర్వాణ గ్రంధాలలో మధుర సంస్కృతం ,భారతీయ తత్వ మీ మాంస ,సరళ సంస్కృతం మానవీయ జ్ఞాన విషయ సహస్రం .ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ బహుమతి ,గాండీవం సంస్కృత మేగజైన్ బహుమతి పొందాడు .
33-అద్వైత వేదాంతి స్వామి వివేకానంద కర్త –అధికారి మదన్ మోహన్ (19 54 )
కావ్య ,వ్యాకరణ స్మృతి తీర్ధ ,.న్యాయం లో ఎం ఏ .,పిహెచ్ డిఅయిన అధికారి మదన్ మోహన్ 1954 లో ఆగస్ట్ ఏడు న పశ్చిమ బెంగాల్ ఫులై లో జన్మించాడు .స౦స్కృత ,ఆంగ్ల బెంగాలీ భాషలలో 8 గ్రంధాలు రాశాడు .ఓం యోగా కాస్మోపాలిటన్ లవ్ అండ్ పీస్ ,అద్వైత వేదాంతి స్వామి వివేకానంద ,గీతామృతం ,హిడెన్ రూట్స్ ఆఫ్ లైబ్రరి క్లాసిఫికేషన్ వగైరా .వేదవ్యాకరణ న్యాయాలలో సిద్ధ హస్తుడు .
34-ద్వైత వేదాంత గ్రంధ కర్త –ఆడిగ కె శంకరనారాయణ (1962 )
సంస్కృతం లో ఎం ఏ ఎం ఫిల్,.నవ్య న్యాయ విద్వదుత్తమ ,ద్వైత వేదాంత విద్యుదుత్తమ,అలంకార విద్వత్ మధ్యమ .కర్నాటక ఉడిపిలో 6-8-19 62 జననం .పూర్ణ ప్రయాగ విద్యా పీఠ్ డిప్యూటీ డైరెక్టర్ .ద్వైత వేదాంత ,న్యాయాలపై నాలుగు గ్రంధాలు రచించాడు .సచ్చాస్త్ర విచక్షణ బిరుదు పొందాడు .1977 నుండి ఔత్సాహిక౦గా సంస్కృతం నేర్చుకునే వారికి సాయం తరగతులు నిర్వహిస్తున్నాడు .భారత రాష్ట్ర పతి నుండి మహర్షి బాదరాయణ వ్యాస్ సమ్మాన్ అందుకున్నాడు .
35-కాల చక్రం కర్త –లక్ష్మి సింగ్ అగర్వాల్ (19 39)
12-5-19 39 హర్యానా ఫరీదాబాద్ లో జన్మించిన లక్ష్మి సింగ్ అగర్వాల్ సంస్కృతం లో ఎం ఏ .రచనలు -కాళరాత్రి ,కాల చక్రం ,అభినవ వీణ ,శ్రీరామ రసాయనం .హర్యానా సంస్కృత అకాడెమి ఢిల్లీ సంస్కృత అకాడెమీ లనుండి పురస్కారాలు .
సశేషం
సంక్రాంతి శుభాకాంక్షలతో
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -15-1-18 –ఉయ్యూరు
.

