గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
36-కాత్యాయన యజ్న పధ్ధతి విమర్శ కర్త –భగవాన్ లాల్ అగ్ని హోత్రి (1873-1959 )
చియావా జిల్లా ఝు౦జి హూన్ లో 1873 లో జన్మించిన భగవాన్ లాల్ ఆచార్య ఋగ్వేద ,అధర్వణ వేద సాహిత్యాలలో ఆచార్య.సంస్కృత ఎం ఏ పిహెచ్ డి.కాశీలోని ఎస్ ఎస్ వి వి లో సంస్కృత లెక్చరర్ .గురువు లక్ష్మీ శంకర ద్వివేది .శిష్య పరంపరలో తంగిరాల శ్రీ గంగాధర్ ,నాదూలాల్ పంచోలి ,భగవాన్ లాల్ పంచోలి ,నారాయణ ధూలే ,నర్మదా శంకర్ పంచోలి ,పరశురామ రాం ధోకర్కర్ మొదలైన విద్వాంసు లున్నారు .భగవాన్ లాల్ రాసిన ఏకైక గ్రంధం –‘’కాత్యాయన యజ్నపద్దతి విమర్శ’’ .శ్రీ వల్లభ రాం సాలిగ్రాం సంగ వేద పాఠశాల నెలకొల్పి నిర్వహించాడు .1959 లో 86 వ ఏట మరణించాడు .
37-అభినవ మనోవిజ్ఞాన కర్త –ప్రభు దయాళ్ అగ్ని హోత్రి (1914 )
వ్యాకరణాచార్య ,కావ్య తీర్ధ ,హిందీ ప్రభాకర్ ,సాహిత్య రత్న ,ఎం ఏ పిహెచ్ డి ప్రభుదయాల్ అగ్ని హోత్రి .20-7-19 14 న ఉత్తరప్రదేశ్ సహజాన్ పూర్ లో జన్మించాడు .జబల్పూర్ యూని వర్సిటి వైస్ చాన్సలర్ .పండిట్ లక్ష్మీ నారాయణ శర్మ ,పండిట్ పరమానంద మిశ్ర ,పండిట్ శివ రత్న ద్వివేదీలు గురుపరంపర .60 గ్రంధాలు రచించాడు .అందులో ముఖ్యమైనవి –అభినవ మనో విజ్ఞానం ,అరుణిమ ,అగ్ని గర్భ ,మహాకవి కాళిదాస మొదలైనవి .
38- శ్రౌత పదార్ధ వివేచన కర్త –ప్రభు దత్త అగ్ని హోత్రి (1864-1929 )
1864 లో హర్యానాలోని ఖేడి జిల్లా సిర్సా లో జన్మించిన ప్రభుదత్త అగ్ని హోత్రి శుక్ల యజుర్వేద ,శతపథ బ్రాహ్మణ ,వ్యాకరణ ,సాంఖ్య యోగ ,కర్మకాండ లలో అద్వితీయ ప్రతిభ ఉన్నవాడు .కాశీలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి అనుబంధమైన రణవీర్ సంస్కృత పాఠశాల లెక్చరర్ .చింతామణి గుర్జార్ ,పండిట్ మూల చంద్ గుర్జార్ ,పండిట్ జగనాద శర్మ,పండిట్ అనంతరాం శాస్త్రి ,పండిట్ యుగళ్ కిషోర్ పాథక్ లవద్ద విద్య నేర్చాడు .శిష్యపరంపరలోపండిట్ భీమ సేన్ చతుర్వేది ,పండిట్ విజయ చంద్ చతుర్వేది ,పండిట్ ధర్మదత్ వేద శాస్త్రి వంటి ప్రసిద్దులున్నారు .9 గ్రంధాలు రచించాడు అందులో ముఖ్యమైనవి-శ్రౌత పదార్ధ వివేచన ,శ్రార్ధ ప్రకాశిక ,రుక్ ప్రాతిశాఖ్య ,మహా రుద్ర పధ్ధతి,జీవిత శ్రద్ధా పధ్ధతి . 1929 లో 65 వ ఏట ప్రభుదత్త అగ్ని హోత్రి’’ అగ్ని ప్రభు’’ ను చేరుకున్నాడు .1924 లో బ్రిటిష్ ప్రభుత్వం మహా మహోపాధ్యాయ బిరుదు నిచ్చి సత్కరించింది .బిర్లా కుటుంబానికి ‘’కుల గురువు ‘’గా విరాజిల్లాడు .
39-ఆగ్నేయః కర్త –రుషిరాజ్ చున్నీలాల్ అగ్ని హోత్రి (19 27 )
2-9-1927 గుజరాత్ లోని రాజ్ ఘర్ లో జన్మించిన రుషిరాజ్ చున్నీలాల్ అగ్ని హోత్రి వేదాంతం లో ఎం ఏ .కావ్యతీర్ధ .ఒకే ఒక్క గీర్వాణ గ్రంధం ‘’ఆగ్నేయః ‘’రచించాడు .
40- కారక దీపిక కర్త –శివ ప్రసాద్ అగ్ని హోత్రి (1957 )
శుక్ల యజుర్వేద నిష్ణాతుడు ,నవ్య వ్యాకరణం లో ఆచార్యుడు ,విద్యా వారిది బిరుదాంకితుడు శివ ప్రసాద్ అగ్ని హోత్రి 5-6-1957 న ఉత్తర ప్రదేశ్ లో జన్మించాడు .కాన్పూర్ డి .బి .ఎస్.పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేశాడు .అభిజ్ఞాన శాకుంతలం కు ‘’శివ టీక’’, ‘’కారక దీపిక ‘’(సిద్ధాంత కౌముది ) రాశాడు .కాళిదాస సమ్మాన్ పురస్కార గ్రహీత .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-1-18- ఉయ్యూరు

