20 రోజుల్లో (29-12-17 నుండి 17-1-18 వరకు )గీర్వాణం -4 అర్ధ శతం పూర్తయింది అని తెలియజేయటానికి సంతోషంగా ఉన్నది -దుర్గాప్రసాద్
గీర్వాణకవుల కవితా గీర్వాణం -4
41-తర్క సంగ్రహ కర్త –బీనా అగర్వాల్ (1959 )
1-1-1959 జన్మించిన బీనా అగర్వాల్ సంస్కృత ఎం ఏ పి హెచ్ డి.రాజస్థాన్ సంస్కృత యూని వర్సిటీ సంస్కృత ప్రోఫెసర్ .తర్క సంగ్రహం ,నాట్య శాస్త్రం (రసోధ్యాయం )సంస్కృతం లోను సంస్కృత సాహిత్య కా ప్రాచీన ఔర్ అర్వాచీన ఇతిహాస ను హిందీ లో రచించారు .
42-వైదిక అర్ధ వ్యవస్థ కర్త –మహావీర్ అగర్వాల్ –(1951 )
మహారాష్ట్ర పాల సహన్ లో 9-10-1951 జన్మించిన మహావీర్ అగర్వాల్ వ్యాకరణం లో ఎం ఏ ,డి లిట్.ఉత్తరాంచల్ సంస్కృత అకాడెమీ వైస్ ప్రెసిడెంట్ .వైదిక అర్ధ వ్యవస్థ ,సంస్కృత గద్య లతిక ,రుక్ సూత్ర సౌరభం గీర్వాణం లోను హిందీలో వాల్మీకి రామాయణ మే రస విమర్శ రాశాడు .
43- పాణిని కాలీన భరత వర్ష కర్త –వాసుదేవ శరణ అగర్వాల్ (20 వ శతాబ్ది )
చరిత్రలో ఎం ఏ .డి.లిట్ .కాశీ భారతీ కాలేజ్ ప్రిన్సిపాల్ .సెంట్రల్ ఏషియన్ ఆన్టిక్విటీస్ డైరెక్టర్ .మధురలోని కర్జన్ మ్యూజియం క్యురేటర్ .ఉత్తర ప్రదేశ్ లో జన్మించినట్లు భావించాలి .అంతకంటే జనన వివరాలు తెలియదు .20 వ శతాబ్ది వాడు. 10 గ్రంథాలు రాశాడు. అందులో –పాణిని కాలీన భరత వర్ష ,పద్మావత ,పృధ్వీ పుత్ర,గీతా నవనీతం ,గుప్తా ఆర్ట్ ముఖ్యమైనవి .
44- సంస్కృత సామెతల నిఘంటు కర్త –రఘునాద్ ఐరి (1935 )
సంస్కృతం లో ఎం ఏ హిందీలో ప్రభాకర్ డిగ్రీ పొందిన రఘునాద్ ఐరి 1935 లో మే 1 న పంజాబ్ లో హోషియార్ పూర్ లో జన్మించాడు .సంస్కృత విద్యా భూషణ్ ,పిహెచ్ డి.హర్యానా విద్యా వ్యవస్థలో ప్రిన్సిపాల్ చేసి రిటైరయ్యాడు .పండిత పరమేశ్వరానంద శాస్త్రి డా శ్రీ ధర్మానంద శాస్త్రి ల వద్ద చదివాడు .10 గ్రంథాలు రచించాడు .అందులో సంస్కృతం లోని సామెతలు జాతీయాల నిఘంటు నిర్మాణం ముఖ్యమైనది .కాన్సెప్ట్ ఆఫ్ సరస్వతి ఇన్ వేదిక్ ఇతిహాస అండ్ పౌరాణిక్ లిటరేచర్ ,ఆన్నోటేటేడ్ బిబ్లియాగ్రఫీ ఆఫ్ పాప్యులర్ బుక్స్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిటెన్ ఇన్ సంస్కృత ,స్టడీస్ ఇన్ వేదిక్ సాంస్క్రిట్ లిటరేచర్ మొదలైనవి .
45-దేవ రాజ లేఖామాల కర్త –అజిత కుమార్ (19 50 )
వ్యాకరణ సాహిత్యా చార్య అజిత కుమార15-7-1950 ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లా దిన్దావాలి లో జన్మించాడు .భగవాన్ మహా వీర్ సంస్కృత విద్యా పీఠంలో ఉపాధ్యాయుడు .దేవరాజ లేఖా మాల అనే ఒక్క గరందాన్నిమాత్రమే సంస్కృతం లో రచించాడు.
46-అప్పా శాస్త్రి సాహిత్య సమీక్ష కర్త –అక్లుజ్ కర్ అశోక్ (1941 )
6-11-1941 మహారాష్ట్ర పండరీ పురం లో జన్మించిన అక్లుజ్ కర్ అశోక్ –బ్రిటిష్ కొలంబియా యాన్కోవార్ బి సి కెనడా ప్రొఫెసర్ .’’మారాహి మాటి ‘సమీక్ష ,అప్పాశాస్త్రి సాహిత్య సమీక్ష ,సంస్కృతం లోను ,ఇంట్ర డక్షన్ టు యాన్ ఎంచాన్టింగ్ లాంగ్వేజ్ ,ధీరీ ఆఫ్ నిపాతాస్ ఇన్ యాస్కాస్ నిరుక్త మొదలైన 10 పుస్తకాలు రాశాడు .
47 –దేవ ప్రశస్తి కావ్య కర్త –వీరేంద్ర కుమార్ అలంకార (1962 ) ,
సంస్కృతం వేద సాహిత్యం ఎం ఏ ఎం ఫైల్ ,సాహిత్యం లో ఆచార్య ,రష్యన్ ,ప్రాకృతాలలో అడ్వాన్సేడ్ డిప్లొమా ,పిహెచ్ డి ,డి లిట్ సాధించిన వీరేంద్ర కుమార్ అలంకార 15-10-1962 లో జన్మించాడు .పంజాబ్ సంస్కృత యూని వర్సిటి సంస్కృత ప్రోఫెసర్ ,,చైర్ పర్సన్ ..16 గ్రంథాలు రచించాడు .ముఖ్యమైనవి-పాలిప్ప దీపిక ,మీమాంస దర్శన (తర్క అధ్యాయం ),దేవ ప్రశస్తి కావ్యం ,భారతీ కావ్యం ,మానవామూల్య విశ్వ కోశం .సంస్కృతం వేదం వ్యాకరణం వేదాంతాలలో నిష్ణాతుడు. మహాకవి గా లబ్ధ ప్రతి స్టుడు.మహాకవి బాణభట్ట పురస్కార గ్రహీత .
48-శంకర యోగ వివరణ కర్త –వేదవ్రత అలోక్ (1938 )’
అస్ట కోపాధ్యాయ ,ఆచార్య ,సంస్కృత ఎం ఏ పి హెచ్ డి,లింగ్విస్టిక్స్ లో డిప్లొమా పొందిన వేదవ్రత అలోక్ 1938 జులై 20 న పాత ఢిల్లీ సీతారాం బజార్ లో జన్మించాడు .కాలేజి టీచర్ గా రిటైరయ్యాడు .ఈయన గురు పరంపరలో స్వామి దయానంద సరస్వతి ఆశ్రమ పరంపర ,స్వామి శ్రీ యోగీశ వరానంద సరస్వతి ,స్వామి సచ్చిదానంద యోగి వంటి మహానుభావులున్నారు .ముఖ్య శిష్యుడు డా దేవ శర్మ .5 గ్రంథాలు రాశాడు.ప్రణవ యోగ ,ప్రణవ యోగ సార ,శంకర యోగ వివరణ ,ముద్రా ప్రాణ యోగ తోపాటు ,ఫిలాసఫీ అండ్ ప్రాక్టీస్ ,ప్రాణయోగ ప్రాక్టీసెస్ ఉన్నాయి .న్యూజిలాండ్ సింగపూర్ ఆస్ట్రేలియాలను సందర్శించాడు .
49-పాళీ భాషా శాస్త్రవేత్త –అమృత రాజ్ రాహుల్ (1982 )
పాళీ భాష లో ఎం ఏ .NET,JRF,పి హెచ్ డి అయిన అమృత రాజ్ రాహుల్ 5-1-1982 బీహార్ లో గోపాల్ గంజ్ లో జన్మించాడు .లక్నో సంస్కృత సంస్థాన్ లో పాళీ భాష ఆచార్యుడు .గురువు ప్రోఫెసర్ బిమలేంద్ర కుమార్ .8 మంది ప్రముఖ శిష్యులున్నారు .పాళీ భాషలో ఈ నాటి మేటి భాషా శాస్త్రవేత్తగా గుర్తింపు పొందాడు .
50-మహా సంస్కృత పండితుడు –కమలానంద్ (1942 )
18-10-1942 లాహోర్ లో జన్మించిన కమలానంద్ సంస్కృత ఎం ఏ పిహెచ్ డి,డి.లిట్.హోషియార్పూర్ లోని విశ్వేశ్వరానంద వేదిక్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ ఆనరరి ప్రోఫెసర్ .విశ్వ సంస్కృతం ,విశ్వ జ్యోతి సంస్కృత మాసపత్రికల సంపాదకుడు .సంస్కృతం లో నాలుగు గ్రంధాలు ,50 కి పైగా పరిశోధనా వ్యాసాలూ రాశాడు .కెనడా నుండి రామకృష్ణ అవార్డ్ , శిరోమణి , సంస్కృత సాహిత్యకార్ పురస్కారాలను పంజాబ్ ప్రభుత్వం నుండి అందుకున్నాడు .రాష్ట్రపతి పురస్కారాన్ని సంస్కృత సేవ కు పొందాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్- 17-1-18 –ఉయ్యూరు
.

