గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
51-సంస్కృత భాష్య కర్త –అ౦పల్లూర్ శ్రీధరన్ (1928 )
16-8-19 28 కేరళ అమ్పల్లూర్ లో జన్మించిన అమ్పల్లూర్ శ్రీధరన్ కావ్య భూషణ .సంస్కృత భాష్యం పాశ్చాత్య దర్శన గ్రంధః రాశాడు .కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ను సంస్క్రుతీకరించాడు .
52-కృష్ణ యజుర్వేద ,కర్మకాండ లస్పెషలిస్ట్ –రాజగోపాలన్ అనంతాచార్య (1940 )
30-11- 1940 తమిళనాడు తంజావూర్ జిల్లా తెరాజుందూర్ లో జన్మించిన రాజగోపాలన్ అనంతాచార్య ఆర్ కృష్ణ స్వామి అయ్యంగార్ ,కేకే యమునాచార్య వద్ద వేద విద్య నేర్చాడు .తిరుమల తిరుపతి దేవాలయ సలహాదారు .కృష్ణ యజుర్వేద,కర్మకా౦డ నిష్ణాతుడు .
53-కాళిదాస స్పెషలిస్ట్ –అనంత రంగా చార్య (1920 )
వేదాంత విద్వత్ ,సంస్కృత ఎం ఏ పిహెచ్ డి.కర్ణాటకలో మైసూర్ లో 15-2-1920 జననం .మహారాజా సంస్కృత కాలేజ్ ప్రిన్సిపాల్ చేశారు .సంస్కృతం కన్నడ భాషలలో 75 గ్రంధాలు రచించారు .విశిష్టాద్వైత వేదాంతం ,వేద ,ఉపనిషత్ సాహిత్యాలలో ప్రత్యెక కృషి చేశాడు .జిల్లా విద్యాశాఖాధికారి గా ,కర్నాటక రాష్ట్ర లలిత సాహిత్య సంగీత నాటక అకాడేమి సేక్రేటరిగా భారతీయ విద్యాభవన్ గౌరవ రిజిస్ట్రార్ గా అమూల్య సేవలు అందించాడు .దేశమంతా పర్యటించి వేద ,ఉపనిషత్ దర్శన కాళిదాస సాహిత్య విషయాలపై అనేక ప్రసంగాలు చేశాడు .ఈయన సాహితీ సేవకు రాష్ట్ర పతి పురస్కారం అందుకున్నాడు .
54-శ్రీ తిలక యశోర్నవః –కర్త –మాధవ్ శ్రీహరి ఆనే (1880-1968 )
1880 లో మహారాష్ట్ర పూనాలో జన్మించిన మాధవ్ శ్రీహరి ఆనే మహారాష్ట్ర విద్యా పీఠం వైస్ చాన్సలర్ చేశాడు .శ్రీ తిలక యశోర్నవః అనే ఒకే ఒక్క సంస్కృత గ్రంధం రాశాడు .88 ఏళ్ళు నిండు జీవితం అనుభవించి 1968 లో మరణించాడు .ఈయన విద్వత్తును గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ పురస్కారం అందజేసింది
55 –చపల శతకకర్త – అంజు రాణి(1980 )
సంస్కృత ఎం ఏ పిహెచ్ డి.అంజు రాణి 15-1-19 80 గడ్వాల్ లోని చమోలీ లో జన్మించింది . రేలాయాత్ర ,చపల శతకం రాసింది .ఇంతకంటే వివరాలు తెలియలేదు .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -18-1-18 –ఉయ్యూరు

