గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
64 – ఇంద్రధ్వజ విధాన కర్త -జ్ఞానమతి మాతాజీ ఆర్యిక(19 34 )
1934 లో ఉత్తరప్రదేశ్ బారాబంకి తికైట్ నగర్ లో జన్మించిన జ్ఞానామతి మాతాజీ ఆర్యిక ఆచార్య దేశాభూషణ్ మహారాజ్ శిష్యురాలు .ఇంద్ర ధ్వజ విధానం ,ఆశా సహస్రి ప్రబందే ,శ్రీ పంచమేశ స్తుతి ,సహా జయతు గురు వర్యః మొదలైన అయిదు రచనలు చేసింది .సమ్యజ్ఞానమేగజైన్ సంపాదకురాలు .
65 –శివాకాశ స్తోత్ర కర్త –జిన్మతి మాతాజీ ఆర్యిక –(1945 )
జ్ఞానమతి మాతాజీ ,ఆచార్య వీర సాగర్ జీ ,ఆచార్య శివ సాగర్ మహారాజ్ శిష్యురాలైన జిన్మతి మాతాజీ ‘’శివాకాశ స్తోత్రం ‘’అనే ఒక్క కృతి మాత్రమె చేసింది .
66 –సాగర ధర్మామృత కర్త –సుపార్శ్వ మతి మాతాజీ ఆర్యిక (1985 )
రాజస్థాన్ నగౌర్ లోని మెయిన్ సార్ లో 1985 లో జన్మించిన సుపార్శ్వమతి మాతాజీ గురువులు ఆచార్య అజిత్ సాగర్ జీ ,ఆచార్య వీర సాగర్ మహారాజ్ లు .సాగర ధర్మామృతం ,సా ప్రభ్రుతం ,వార్యాంగ చరిత్ర ,పరమ ఆధ్యాత్మ తరణి మొదలైన 5 రచనలు చేసింది .
67-సమాధి దీపిక కర్త –విష్ణు ధమతి మాతాజీ ఆర్యిక (1929-2001 )
12-4-1929 మధ్య ప్రదేశ్ లోని రితి కత్ని లో జన్మించిన విష్ణు దమతి ఆర్యిక –సాహిత్య రత్న ,విద్యాలంకార .ప్రదానోపాధ్యాయురాలుగా పని చేసింది .శుశ్రుత సాగర్ ,అజిత్ సాగర్ ,రతన్ చంద్రలు గురువులు .22-1-20 01 న 72 వ ఏట సిద్ధి పొందింది .వత్తు విజయ ,శ్రమణాచార్య,సమాధి దీపిక ,స్తోత్ర సంగ్రహం ,శ్రావకా సోపాన రచించింది .
68-త్రిలోక సార కర్త –విష్ణు ధమతి మాతాజే ఆర్యిక (1980 )
మధ్యప్రదేశ్ జబల్పూర్ లో రతి గ్రామం లో జన్మించింది .సాగర్ లోని శ్రీ దిగంబర జైన్ మహిళా ఆశ్రమ ప్రిన్సిపాల్ చేసింది .పన్నాలాల్ సాహిత్య రత్న ,ఆచార్య శివ సాగర్ లు గురువులు .త్రిలోక సార ,అష్టోత్తర శతనామ స్తోత్రం రచించింది .సంస్కృత ,ప్రాకృతాలలో సమాన ప్రజ్నతో రాణించిన విదుషీమణి .
69-కాళిదాస క్రియా పద కోశ కర్త –ఆషా (1959 )
ఢిల్లీ లో 1959 ఆగస్ట్ 28 జన్మించిన ఆషా రొహ్ తక్ యూని వర్సిటి సంస్కృత ప్రొఫెసర్ ,ఎం డి.కాళిదాస క్రియా పదకోశం మాత్రమె రచించింది .
70 –వాసిష్ట దర్శన కర్త –భీక్షన్ లాల్ ఆత్రే (1930 )
ఫణి భూషణ అధికారి శిష్యుడైన భీక్షన్ లాల్ ఆత్రే బెనారస్ హిందూ యూని వర్సిటి లో ఎం ఏ పి హెచ్ డి చేసి ,13 రచనలు చేశాడు .అందులో ముఖ్యమైనవి –వాసిష్ట దర్శనం ,యోగ వాసిష్ట సారం ,శంకరాచార్యకా మాయా వాద,దిఎలిమెంట్స్ ఆఫ్ ఇండియన్ లాజిక్ ,యోగ వాసిష్ట అండ్ ది మోడరన్ థాట్ .
71-మహాకవి సమాగమః –కర్త –వి .స్వామి నాధ ఆత్రేయ (1919 )
తమిళనాడు తంజావూర్ లో 1919 లో జన్మించిన వి.స్వామినాథాచార్య –కుప్పుస్వామి శాస్త్రి దండపాణి ల శిష్యుడు .అనురూప ,మహాకవి సమాగమః ,బద్రీ –కేదారనాధ యాత్రా ప్రబంధ ,మొదలైన 6 రచనలు చేశాడు .మాన్యు స్క్రిప్టాలజిస్ట్ గా ప్రసిద్ధుడు .ఆశుకవి గా లబ్ధ ప్రతిస్టుడు .ఆశుకవి తిలక ,సాహిత్య వల్లభ బిరుదులు పొందాడు
72-పాణిని దాత్వాను క్రమ కోశః కర్త –అవనీంద్ర కుమార్ (1940 )
1940 మార్చి 13 ఉత్తర ప్రదేశ్ ఈతా లో పుట్టిన అవనీంద్ర కుమార్ వ్యాకరణ ,నిరుక్తా చార్య .ఎం ఏ పిహెచ్ డి..ఢిల్లీ యూని వర్సిటి సంస్కృత శాఖాధ్యక్షుడు పండిట్ బ్రహ్మదత్త జిగ్యాసు ,పండిట్ యుధిష్టిర మీమా౦సక్ ,పండిట్ జ్యోతిస్వరూప్ ఆచార్య లకు శిష్యుడు .ప్రొఫెసర్ మిదిలేష్ చతుర్వేది ,డా.ఓం నాద బిమ్లి లకు గురువు . పాణిని దాత్వాను క్రమ కోశః.అష్టాధ్యాయి పదానుక్రమ కోశ ,వ్యాకరణ్ కా ఇతిహాస్ మొదలైన 6పుస్తకాలు రాశాడు .వ్యాకరణం లో అద్వితీయుడు .ప్రెసిడెంట్ అవార్డీ .సాహిత్య సేవా సమ్మాన్ ,పాణిని సాయన్ సమ్మాన్ ,న్యు మెక్సికో పురస్కార గ్రహీత .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -20-1-18 –ఉయ్యూరు

