గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
81-మార్కండేయ సంహిత సంపాదకులు –చలమచర్ల వేంకట శేషాచార్యులు (19 25 )
సంస్కృతాంధ్ర భాషా పండితుడు ,వ్యాకరణ వేత్త చలమ చర్ల వేంకట శేషాచార్యులు 195 6-61 లో కృష్ణా జిల్లా చిట్టి గూడూరు శ్రీ లక్ష్మీ నృసింహ సంస్కృత కళాశాలలో మహామహోపాధ్యాయ ఎస్ టి జి వరదాచార్యులు,టి నరసింహా చార్యుల వద్ద కావ్య శాస్త్రాలు నేర్చి ,19 61 లో ఆంద్ర విశ్వ విద్యాలయం నుండి ప్రధమ శ్రేణిలో విద్యా ప్రవీణ పొంది తాతా సుబ్బరాయ శాస్త్రి స్మారక పురస్కారం ,కామేశ్వరీ విశ్వనాథ్ స్వర్ణ పతకం అందుకున్నారు ..1969 లో తిరుపతి సంస్కృత విద్యా పీఠం నుండి శిక్షా శాస్త్రి డిప్లొమా ప్రధమ శ్రేణిలో సాధించారు .
తిరుమల తిరుపతి దేవస్థాన కళాశాల సంస్కృత అధ్యాపకుడుగా పని చేసి రిటైరయ్యారు . .ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారంఅందుకున్నారు .
స్వీయ సంపాదకత్వం లో మార్కండేయ సంహిత(పాంచ రాత్ర ఆగమ గ్రంథం) వెలువరించారు.తెలుగులో సంస్కృత సంగ్రహ వ్యాకరణం ,శ్రీ మద్రామాయణం 8 భాగాలు ,,సంస్కృతాంధ్ర వివరణలతో తెలుగులో అమరకోశం,ఆధ్యాత్మ రామాయణం ,శ్రీరామ కర్ణామృతం ,సంస్కృతాంధ్ర నిఘంటువు ,రఘువంశం మొదటి 5 సర్గలు ,కుమార సంభవం 5,6 సర్గలకు అర్ధ తాత్పర్య వ్యాకరణా౦ శాలు, ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత పాఠశాలలు ,జూనియర్ కాలేజీల పాఠ్య గ్రంధాలు రచించాడు .ప్రస్తుతం వాల్మీకి రామాయణం గోవింద రాజ వ్యాఖ్య ముద్రణకు పర్యవేక్షకులుగా ఉన్నారు. ఆకాశవాణి లో సంస్కృత పాఠాలు 19 7 7 నుండి 20 01 వరకు 24 ఏళ్ళు నిరాటంకంగా బోధించారు .ఆచార్యశ్రీ గారి స్వీయ రచన-1, సంపాదకత్వం చేసినవి -2,అనువాదాలు 2,కూర్పు 2 .
82-మేదినీ కోశ కర్త –మేదినీ కరుడు
నానార్ధ శబ్ద సర్వసం అయిన’’ మేదినీ కోశం ‘’ను మేదినీ కరుడు రచించినట్లు తెలుస్తోంది .పుట్టు పూర్వోత్తరాలు తెలియ రాలేదు .గ్రంథం చివర మాత్రం ‘’మేదిని కరేణు కోశః ప్రాణ కర సూనునా రచితః ‘’అని మాత్రమె చెప్పుకున్నాడు రచయిత .ఎక్కడ పుట్టాడో తలిదంద్రులెవరో ఏ కాలం వాడో కూడా తెలియలేదు .గ్రంథం చివరలో –‘’ఉత్పలినీ శబ్దార్నవ సంసారావర్త నామ పాలాఖ్యాన్ —– షట్శత గాథాకోశ ప్రణయన విఖ్యాత కౌశలేనాయం –మేదిని కరేణ కోశః ప్రాణ కర సూనునా విరచితః ‘’అని ఉన్నదానిని బట్టి ఈ కవి ‘’ఉత్పలినీ శబ్దార్నవం ‘’,విశ్వ ప్రకాశ ‘’మొదలైన గ్రంథ ములను సాకల్యంగా అధ్యయనం చేసి మేదినీ కోశం రాసినట్లు తెలుస్తోంది అన్నారుపీఠికలో వావిళ్ళ రామ స్వామి శాస్త్రులు ఈ గ్రంధాన్ని తెలుగు లో ముద్రిస్తూ .అంతేకాక ‘’అపి బహుదోషం విశ్వ ప్రకాశ కోశం చ సు విచార్య’’ అనటం వలన విశ్వ ప్రకాశ కోశం లో చాలా తప్పులున్నాయని తన గ్రంథం దోష రహితమైనదని కితాబిచ్చుకున్నాడు మేదినీ కరుడు .దీన్ని బట్టి కోశ కారులలో యితడు చాలా అర్వాచీనుడు అని శాస్త్రులు తేల్చారు .షట్శతగాథా కోశ ప్రణయన విఖ్యాత కౌశాలేనాయం ‘’అని తనను తాను చెప్పుకోవటం వలనఅనేక కథాగ్రంథాలు రాసినట్లు భావించారు .
‘’నానార్ధ కోశ పుస్తక భారార్జన దుఃఖ హానయే కృతినః -మేదినీ కర కోశో విశుద్ధ లింగో భి లిఖ్యతా మేకః ‘’అని కూడా కవి గ్రంథం మొదట్లో చెప్పటం వలన ‘’నా గ్రంథం ఒక్కటి ఉంటె చాలు .వేరే నానార్ధ కోశాలను చూడాల్సిన పనే లేదు ‘’అని ఢంకా బజాయించి చెప్పాడు .విశ్వ కోశం లాగా మేదినీ కోశం కూడా శబ్ద అంత్య వర్ణ క్రమం అనుసరించి రాయబడింది .కనుక కావలసిన పదం వెతుక్కోవటం చాలా సులభం అవుతోంది అంటారు వావిళ్ళ.సంస్కృతం తెలుగు నేర్చుకునే విద్యార్ధులకు ఇది కరతలామలకమే .వావిళ్ళవారు బహు వ్యయ ప్రయాసలకోర్చి చక్కని తెలుగు టీకతో ఈ గ్రంధాన్ని ప్రచురించి సాహితీ జిజ్ఞాసులకు అందుబాటు లోకి తెచ్చినందుకు అభినందనీయులు .ఇందులో మచ్చుకి కొన్ని శ్లోకాలు చూద్దాం –
1-వృషాంకాయ నమస్తస్మై యస్య మౌళి విళంబినీ –జటా వేస్ట నజాం శోభాం విభావయతి జాహ్నవీ .
10-క్లీబే నపు౦సకే పు౦సి స్త్రియాం యోషితి చ ద్వయో –త్రిషు చేత్యాది యద్రూపం తల్లి౦గ స్యైవ వాచకం .
చివరి శ్లోకం –నానార్ధ కోశ పుస్తక భారార్జన దుఃఖ హానయే కృతినః-మేదినీ కర కృత కోశో విశుద్ధ లింగో భి లిఖ్య తామేకః .
కద్వికం –కో బ్రహ్మణి సమీరాత్మ యమ దక్షేషు భాస్కరే –కామే గ్రన్ధౌచక్రిణి చ పతత్రిని చ పార్దివే –మయూరేగ్నౌచ పు౦సిస్యాత్ సుఖ శీర్ష జలే షుకం.
తెలుగులో అర్ధం –ఏకాక్షర శబ్దాలు –కః –బ్రహ్మ ,వాయువు ,ఆత్మ ,యముడు, దక్ష ప్రజాపతి ,సూర్యుడు మన్మధుడు ,ముడి ,విష్ణువు ,పక్షి ,రాజు ,నెమలి ,అగ్ని .కం –సుఖము ,శిరస్సు జలం .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -22-1-18- ఉయ్యూరు
—

