గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
83- ‘’సంస్కృత కురానం ‘’ కర్త –సహరాణాపూర్ రజియా సుల్తానా(19 30 )
సహరాణాపూర్ రజియా సుల్తానా ఉర్దూ లో ఉన్న పవిత్ర కొరాన్ గ్రంధాన్ని అనువదించింది .దీనికి ఆమెకు 12 ఏళ్ళకాలం పట్టింది .కొరాన్ పదాలకు సరైన సంస్కృత పదాల వెతుకులాట తనకు చాలా కష్టమైనట్లు ఆమె చెప్పింది .ఈ అనువాదాన్ని ఇరాన్ అమెరికా ,రష్యా ,యూరోపియన్ దేశాలు బాగా మెచ్చుకోవటమే కాదు ఆయా దేశాలలో పర్య టి౦చమని అభ్యర్ధించాయి కూడా . దీనితో ఆమె ప్రతిభ జగద్విదితమైంది .ఈమె ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ సంస్కృత హిందీ భాషలలో మహా ప్రవీణుడు మొహమ్మద్ సులేమాన్ మనవరాలు .సులేమాన్ అప్పటికి 20 సంవత్సరాల క్రితం కొరాన్ ను హిందీ లోకి అనువదించి లబ్ధ ప్రతిష్టు డయ్యాడు .ఈ గ్రంథాన్ని రాష్ట్రపతి శంకర దయాళ్ శర్మ ఆవిష్కరించారు .సంస్క్రుతానువాదానికి మనవరాలికి తాతగారు కొంత సాయం చేశాడు .
1964 లో ‘’సంస్కృతం కురానం ‘’గా అనువాదం పొంది, ప్రచురింప బడిన ఈ గ్రంథ౦ ప్రపంచం మొత్తం మీద మొదటి సారిగా కొరాన్ సంస్క్రుతానువాదం పొంది రికార్డ్ సాధించింది . సుల్తానా చేసిన ఈ సాహసానికి ,సాధనకు తోడ్పడిన వాడు హర్యానా ,యమునానగర్ కు చెందిన ప్రోఫెసర్ సత్య దేవ వర్మ .
ప్రధమపారా
‘’సురే బకర్ కా అవసర రగ్ మదీనే మే హువా –ఇస్మేశబ్ద జ్ఞాన వాక్య శౌర్ 40 రుక్కూ హై .
84-శ్రీ చండీ సిద్ది రహస్యం కర్త –చండీ ప్రసాద్ బహుగుణ (19 26 )
న్యాయ వ్యాకరణ ఆచార్య ,హిందీ సాహిత్య రత్న ,శిక్షాశాస్త్రి చండీ ప్రసాద్ బహుగుణ 19 26 ఏప్రిల్ 15 పంజాబ్ లో జన్మించాడు .పంజాబ్ సింద్ క్షేత్ర మహావిద్యాలయ –ఋషీకేశ్ ఆచార్యుడు .శ్రీ చండీ సిద్ధి రహస్యం ,భారత దర్శనం ,స్వతంత్రతా విజయం రచించాడు .పురాణ ప్రవచన ప్రసిద్ధుడు .శాస్త్ర చూడామణి బిరుదాంకితుడు .ప్రెసిడెంట్ పురస్కార గ్రహీత .
85-ముక్తక మంజూష కర్త –దిగంబర దత్తాత్రేయ బహులికర్ (1916 )
11-3-1916 జన్మించిన దిగంబర దత్తాత్రేయ బహులికర్ సంస్కృత ఉపాధ్యాయుడు .కల్లోలిని ,త్రిశంకు ,ముక్త మంజూష ,ముక్తకాంజలి రచించాడు.
8 6-శ్రీ కృ ష్ణ చరితామృత కర్త –గోపాల నారాయణ బాహురా (1911 )
సంస్కృత సైన్స్ హిందీలలో నిష్ణాతుడు గోపాల నారాయణ బాహురా 14-5-1911 జైపూర్ వాసి .భట్ట మధురానాద శాస్త్రి గురువు .39 పుస్తకాలు రాసిన మహా రచయిత.మహాకవి సూరదాస ,శ్రీకృష్ణ చరితా మృతం ,భువనేశ్వరి మహా స్తోత్రం ,రస దీర్ఘిక ,లిటరరీ రూలర్స్ ఆఫ్ అమెర్ అండ్ జైపూర్ ,మొదలైనవి . 19 51 ప్రాచ్య ప్రతిస్టాన్ విద్యాలయం స్థాపించాడు .ప్రెసిడెంట్ అవార్డీ .
87-గంగా శతక కర్త –సుధా బాజ్ పాయ్ (1953 )
9-11-19 53 వారణాసి లో జన్మించిన సుధా బాజ్ పాయ్ హిస్టరీ సైకాలజీ ఇంగ్లిష్ లలో పిహెచ్ డి. .లక్నో యూని వర్సిటిసీనియర్ రీడర్ .విశ్వనాధ భట్టాచార్య ,ప్రొఫెసర్ కె యెన్ చటర్జీలు గురువులు.రచనలు -గంగా శతకం ,మహా కవి మాఘ ,సంస్కృత ప్రాకృత కావ్య ధారా కె అను చింతన వగైరా 6 పుస్తకాలు.సాంఖ్య యోగ దర్శన నిధి ,గ్రామీణ మహిళా సంస్థాన్ వైస్ ప్రెసిడెంట్ .
8 8-అవంతి సింఘాస్టక కావ్య కర్త –దయా శంకర్ వాజ్ పాయి (19 18 -1987 )
1918 యు.పి .ఉన్నా లో పుట్టిన దయా శంకర వాజ్ పాయి వ్యాకరణ ,సాహిత్యాలలో ఆచార్య .ఉజ్జైన్ లో రిటైర్డ్ ప్రిన్సిపాల్ . అవంతి సింఘాస్టక కావ్య౦,కాళి కౌతుకం,అనేహసాహ్వానం ,రచనలు . 69 ఏళ్ళ జీవనం .ఆశుకవి ,ప్రెసిడెంట్ అవార్డీ .మద్యప్రదేశ ప్రభుత్వ పురస్కార గ్రహీత .
89-సంపూర్ణ మహాభాష్య ప్రచురణకర్త –బాల శాస్త్రి (19 54 )
వ్యాకరణ సాహిత్యాచార్య ,సాహిత్య రత్న ,పిహెచ్ డి బాలశాస్త్రి 19 54 అక్టోబర్ 16 వారణాసిలో పుట్టాడు ..గురువులు సీతారామ శాస్త్రి ,రాం ప్రసాద్ త్రిపాఠీ,విశ్వనాధ భట్టాచార్య ,నారాయణ మిశ్ర లు .వ్యాకరణ సాహిత్య నిధి .బనారస్ సంస్కృత విశ్వ విద్యాలయ ప్రొఫెసర్ . మహా భాష్యం సంపూర్ణంగా ప్రచురించాడు .
90-జాతక ఫల వ్యాఖ్య కర్త –అంజు బాల (1971 )
16-9-1971 ఢిల్లీ లో జన్మించిన అంజు బాల సంస్కృత టీచర్ .రచన -జాతక ఫలం ,జాతక మాల ,-ఏ కంపారటివ్ అప్రైజల్ .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-1-18-ఉయ్యూరు
.
—

