గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
91-శిక్షా దార్శనిక ప్రభా భూమి కర్త –రామ చంద్రుల బాలాజీ (19 63)
19 63 జులై 10 ప్రకాశం జిల్లా తిమ్మ సముద్రం లోపుట్టిన రామ చంద్రుల బాలాజీ తెలుగు ,దర్శన ,తత్వ శాస్త్రాలలో నిధి .ఎం ఎడ్ ,పిహెచ్ డి.శృంగేరి లోని ఆర్ ఎస్ కె ఎస్ రాజీవ్ గాంధి కాంపస్ లో అసిస్టంట్ ప్రొఫెసర్ .సారస్వతం ,శిక్షా దార్శనిక ప్రభాభూమి సంస్కృత రచనలు చేశాడు .
92 –అమృతానంద ఉపనిషత్ కర్త-కె.ఎస్. బాల సుబ్రహ్మణ్యం (1959 )
54 గ్రంధాలు రాసిన కె ఎస్ బాలసుబ్రహ్మణ్యం 16-2-19 59 చెన్నై లో జన్మించాడు .విద్యా వారిది ,పిహెచ్ డి.కుప్పుస్వామి శాస్త్రి రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ డిప్యూటీ డైరెక్టర్ .ఉపమన్యు వ్యాఖ్యానం తో నందికేశ్వర కాశిక ,అమృతానంద ఉపనిషత్ ,అద్వయ తర్క ఉపనిషత్ ,అనేకభాగాల తో దర్శన ఉపనిషత్ ,అనేక పరిశోధనా వ్యాసాలూ రాశాడు .రాజ యోగం పై ప్రత్యెక కృషి చేసి అంతర్జాతీయ కీర్తి పొందాడు .యోగ శాస్త్ర ప్రవీణ సాహిత్య విశారద ,యోగ కళా కలాప బిరుదులు పొందాడు .20 02 లో స్విట్జర్ లాండ్ ,20 03 లో ఫ్రాన్స్ ,20 08 లో సింగపూర్ ,మలేసియా ,2009 లో ఇటలీ వెళ్లి పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్ధులకు విద్య నేర్పాడు .25 ఏళ్ళలో అనేక దేశాలు పర్యటించి విద్యా బోధన చేశాడు .సంస్కృతం ఇండోలాజికల్ విషయాలపై యాభై పుస్తకాలు రాశాడు .చెన్నైసంస్కృత రంగ ,సంస్కృత అకాడెమి లలో క్రియా శీలక పాత్ర పోషించాడు .వేదాంత కేసరి ,సంస్కృత రంగ పత్రికలో విశేషమైన వ్యాసాలూ రాశాడు .
93-దశ మేష చరితం కర్త –బాలుని శ్రీధర్ ప్రసాద్ (1941 )
సాహిత్యాచార్య సాహిత్య రత్న బాలుని శ్రీధర్ ప్రసాద్ 1941 జనవరి 12 గడ్వాల్ లో పౌరిలో పుట్టాడు.ఢిల్లీ ప్రభుత్వ సంస్కృత కాలేజి వైస్ ప్రిన్సిపాల్ చేసి రిటైరయ్యాడు .దశమేష చరితం , శ్రీ బద్రీనాధ స్తోత్రం ,శ్రీ కేదారనాధ స్తోత్రం వగైరా 5 రాశాడు .రాజ్య శిక్షక్ ,ఢిల్లీ సంస్క్రుత అకాడెమి పురస్కార గ్రహీత .
94 –వేద మంధన కర్త –మనుదేవ బంధు (19 58 )
5-4-19 58 జార్ఖండ్ లోని పతర్గమ లో జన్మించిన మనుదేవ బంధు వేద ,దర్శన ,సంస్కృత ,హిందీ ఎం ఏ .హిందీ ,వ్యాకరణ ఆచార్య .వేద ,సంస్కృత పి హెచ్ డి.ఇంగ్లిష్ లో డిప్లొమా .హరిద్వార్ గురుకుల కంగాడి యూని వర్సిటి ప్రొఫెసర్ .గురు పరంపర –స్వామి ఓమనానంద్ సరస్వతి ,ఆచార్య వేద ప్రకాష్ శాస్త్రి లు .వేద మంధన ,బృహదారణ్యక ఉపనిషత్ –ఏక్ అధ్యయన ,చాన్దోగ్య్పనిషత్ ఏక్ అధ్యయన ,ఉపనిషత్ వాజ్మయమే యోగ విద్య ,,భాష్యకార దయానంద వంటి 5 గ్రంథాలు రాశాడు .వైదిక విద్వాన్, హిందీ సాహిత్య సేవి అవార్డ్ లు పొందాడు .
95 –మాధ్యమిక సాహిత్య సంభార కర్త –అనీతా బందో పాధ్యాయ (19 61 )
అనీతా బందోపాధ్యాయ కలకత్తా లో 19 61 మార్చి 31 పుట్టింది .సంస్కృత ఎం ఏ ఎం ఫిల్ ,పిహెచ్ డి.మాధ్యమిక సాహిత్య సంభార ఒక్కటే రాసింది .96-భాస కర్త –ప్రతాప్ బందోపాధ్యాయ (1939 )
కలకత్తాలో 1-5-19 39 జన్మించిన ప్రతాప్ బందోపాధ్యాయ ఎం ఏ పి హెచ్ డి .పశ్చిమ బెంగాల్ బర్ద్వాన్ యూని వర్సిటి అసిస్టంట్ ప్రోఫెర్ .భాస స్మైల్స్ ఇన్ నైషద చరిత్ర రాశాడు .
97-సంస్కృత అలంకార శాస్త్రే యమకం కర్త –అలకానంద బందోపాధ్యాయ (1942 )
ఎం ఏ పి హెచ్ డి అలకానంద బందోపాధ్యాయ పశ్చిమబెంగాల్ బీర్భం లో ని బోల్పూర్ లో పుట్టాడు .విశ్వ భారతి లో ప్రొఫెసర్ .సంస్కృత అలంకార శాస్త్రే యమకం సంస్కృత రచన చేశాడు
98 –మీమాంస పరిభాష కర్త –నవ నారాయణ బందోపాధ్యాయ (19 54 )
19 54 అక్టోబర్ 29 వెస్ట్ బెంగాల్ బర్ద్వాన్ లో పుట్టిన నవనారాయణ బందోపాధ్యాయ ఎం ఏ పిహెచ్ డి.కలకత్తా రవీంద్ర భారతి యూని వర్సిటి స్కూల్ ఆఫ్ వేదిక్ స్టడీస్ డైరెక్టర్, ప్రొఫెసర్ .11 పుస్తకాలు రాశాడు .వేదిక్ స్టడీస్ ,బెంగాల్స్ కాన్ ట్రి బ్యూషన్ టు వేదిక్ స్టడీస్ ,మీమాంస పరిభాష ,ఎన్శేంట్ ఇండియన్స్ వ్యూస్ ఆన్ ట్రూత్ అండ్ ఫాల్సిటి ముఖ్యమైనవి .బుడాపెస్ట్ హంగేరి ఫిన్లాండ్ పర్యటన చేశాడు .
99—నేపాల్ సంస్కృత శాసన పరిశోధకుడు –మాన వేందు బెనర్జీ (19 39 )
నేపాల్ సంస్కృత శాసనాలు ,హిస్టారికల్ అండ్ సోషల్ ఇంటర్ ప్రి టేషన్స్ ఆఫ్ ది గుప్తా ఇన్స్క్రిప్షన్స్ ,లుకింగ్ ఇంటు ఇండియాస్ పాస్ట్ త్రు ఎపిగ్రాఫిక్ లిటరేచర్, యాస్పెక్ట్స్ ఆఫ్ సాంస్క్రిట్ ఆర్కి టేక్చరల్ టెక్స్ట్స్,అభినయ దర్పణ ఆఫ్ నందికేశ్వర వంటిచారిత్రక పరిశోధన గ్రంధాలు రాసిన మాన వేందు బెనర్జీ 12-7-19 39 కలకత్తాలో జన్మించి ఎంఏ పిహెచ్ డి,శాస్త్రి డిగ్రీలు పొందాడు .కలకత్తా సంస్కృత సాహిత్య పరిషత్ గౌరవ కార్య దర్శి .ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గౌరవ పురస్కారం ,33, 34 ఆలిండియా ఓరియెంటల్ కాన్ఫ రెన్స్ లనిర్వహణ బాధ్యతచేబట్టాడు .
100-పంచ కన్య కర్త –పుణ్య బరిజా (19 8 3 )
అస్సాం లో జోర్హాట్ లో 2-1-19 8 3 పుట్టిన పుణ్య బారిజా గర్వాల్ యూని వర్సిటి రిసేర్చ్ స్కాలర్ .జోర్హాట్ గర్ల్స్ కాలేజి హెడ్ .రచనలు -జోగికోన ,పంచకన్య ,సాహిత్య సదని .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-1-18 –ఉయ్యూరు

