గీర్వాణకవుల కవితా గీర్వాణం -4
126-సుప్రియ సార్ధ వాహ కర్త –సోమబసు సిక్దార్ (19 61 )
19 61 మే 1 బెంగాల్ చిన్సురా లో పుట్టిన సోమబసు సిక్దార్ సంస్కృత ఎం ఏ పి హెచ్ డి. రవీంద్ర భారతి వేదిక్ స్కూల్ ,రీడర్ ,.సుప్రియ సార్ధవాహ ,జాతకా ఆఫ్ భద్ర కల్ప వాదన రాశాడు .
127- దాంపత్యం కర్త –నరేష్ బాత్రా (19 5 6 )
వ్యాకరణ ,సాహిత్యాచార్య నరేష్ బాత్రా హర్యానా పానిపట్ లో 28-12- 19 5 6 జన్మించాడు .అంబాలా ఆదర్శ సంస్కృత విద్యాలయ ప్రిన్సిపాల్ .దా౦పత్యమ్ కావ్యం రాశాడు .
128-శబ్ద బ్రహ్మ సమీక్షణం కర్త –జైదేవన్ బావ (19 36 )
కేరళలో 29-11-19 36 అలప్పూజ జిల్లా చేరువనం లో పుట్టిన జై దేవన్ బావ సంస్కృత ఎం ఏ పి హెచ్ డి చేసి ,కాల్పేట్టా ప్లాటినం జూబిలీ సంస్కృత కళాశాల వ్యాకరణ హెడ్ గా పని చేశాడు .శబ్ద బ్రహ్మ సమీక్షణం మాత్రమె రాశాడు .వ్యాకరణ ,దర్శన ,వేదాంతాలలో లబ్ధ ప్రతిష్ట ఉన్నవాడు .
129-ఖండన ఖండ ఖాద్య సంపాదన కర్త –శ్రీ రామ శాస్త్రి భాగవతాచార్య (18 5 9-1913 )
18 59 ఫరూకా బాద్ కాశీ బదౌసి లో జన్మించిన భాగవతాచార్య శ్రీ రామ శాస్త్రి –సాహిత్య ,వ్యాకరణ ,న్యాయ ,వేదాంత ,సాంఖ్య యోగ ,న్యాయ వైశేషిక లలో ఆచార్యుడు .కాశీ సంస్కృత కళాశాల సంస్కృత లెక్చరర్ .బాలక్రిష్ణాచార్య ,రామకృష్ణ శాస్త్రి ,పండిట్ మహాదేవ శాస్త్రి గురువులు .బైబిల్ ను సంస్క్రుతీకరించిన జాన్సన్ ఈయన శిష్యుడే .15 గ్రంథాలు రచించాడు వాటిలో ఖండన ఖండ ఖాద్య సంపాదన ,శ్రీ భాష్య టీకా ,నయకమలాకర ,కావ్య ప్రకాశాస్య ,దోషోద్ధార ముఖ్యమైనవి .54 ఏళ్ళు జీవించి 1913 లో మరణించాడు .మహామహోపాద్యాయ బిరుదు పొందాడు .
130-సంస్కృత విద్యా వ్యాప్తి కర్త –వామన బాలకృష్ణ భగవత్ (1918 )
24-1-1918 మధ్యప్రదేశ్ సతారా లో జన్మించిన వామన బాల కృష్ణ భగవత్ –కావ్య తీర్ధ ,వ్యాకరణ రత్న ,వ్యాకరణ పార౦గతుడు.బాలముకుంద మహా విద్యాలయ ప్రిన్సిపాల్ .సంస్కృత టీచర్స్ ట్రెయింగ్ ప్రోగ్రాములు నిర్వహించి భాషా వ్యాప్తికి విశేష కృషి చేశాడు .భండార్కర్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ ఫెలో .చాలా గ్రంధాలు రాశాడు .వేదిక్ సంశోధన మండల్ లో సేవ లందించాడు .రాష్ట్ర పతి పురస్కార గ్రహీత భగవత్ సంస్కృత పాఠాలను రికార్డ్ చేసి రికార్డ్ సృష్టించాడు .
131-రామ చంద్ర వాగ్విలాస కర్త –గంగాధర భల్లా (19 27 )
సంస్కృత ,హిందీ పి హెచ్ డి గంగాధర భల్లా 1-1- 19 27 రాజస్థాన్ ఆల్వార్ లో పుట్టి రాజకీయ మహా విద్యాలయ ,రాజస్థాన్ యూని వర్సిటీలలో బోధన చేశాడు .భగవాన్ అమృతా నాద వైభవం ,రామచంద్ర భగవాన్ వాగ్విలాసం రాశాడు .స్వరమంగళ సంస్కృత పత్రిక సంపాదకుడు .సంస్కృత అకాడెమీ ,అఖిలభారత విద్వత్ సమ్మాన్ అందుకున్న విదుషి .మహారాణా మేవార్ ఫౌండేషన్ వారి హరిత రుషి పురస్కార గ్రహీత .
132-ఉత్తరాంచల సందేశ కర్త –గోవింద సింగ్ భండారి (1955 )
1955 జూన్ 4 బాగేశ్వర్ లో పుట్టిన గోవింద సింగ్ భండారి ఎం ఏ ఎల్ ఎల్ బి .బాగేశ్వార్ జిల్లాకోర్ట్ అడ్వొకేట్ .ఉత్తరాంచల్ సందేశ ,మాతృభూమి రాశాడు .
133- ఆత్మ చరితం కర్త –త్రయంబక ఆత్మారాం భండార్కర్ (1897 )
1897 లో వారణాసి లో పుట్టిన త్రయంబక ఆత్మారాం ఆచార్య ఎం ఏ ,ఆచార్య ..వారణాసి వసంత కాలేజి ప్రాచార్యుడు .ఆత్మ చరితం ,శ్రీ వివేకానంద చరితం ,రాశాడు .ఢిల్లీ యూని వర్సిటి సంస్కృత పి జి క్లాసులలు వివేక చరితం పాఠ్య గ్రంధం .
134-శిక్షణే మాతృభాష ప్రభావ కర్త –భాను మూర్తి జె . (1957 )
విద్యా ప్రవీణ ,ఎం ఏ ఎం ఎడ్ ,పిహెచ్ డి –జె.భాను మూర్తి 15-3-19 57 ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలిలో పుట్టాడు .భోపాల్ కాంపస్ ఆర్ఎస్ కె ఎస్ అసోసియేటెడ్ ప్రొఫెసర్ . రాసిన 5 గ్రంధాలలో శిక్షణే మాతృ భాష ప్రభావ, అధిగమస్య మనో వైజ్ఞానిక ధారా ,క్షేమేంద్ర కవేహ్ చారు చర్య ,జగన్నాధస్య చిత్ర మీమాంసా ఖండనం ,చిత్ర బంధ రామాయణం ,కాక శివ సూత్రాణి కి సంపాదకత్వం వహించాడు .
135 –త్వం కధం విస్మ రామి –కర్త –రాజేష్ భరద్వాజ (1956 )
ఎం ఏ పి హెచ్ డిరాజేష్ భరద్వాజ 19 5 6 అక్టోబర్ 5 ఉత్తరప్రదేశ్ హాపూర్ లో పుట్టాడు .బరేలికాలేజి యూని వర్సిటీలలో ప్రొఫెసర్ .త్వం కధం విస్మరామి,మాలినీ శతకం ,బాల్య కదా సప్తకం రాశాడు .
-12 6 నుండి ౧౩౫వరకు ఆధారం –Inventory Of Sanskrit Scholors .
సశేషం
రిపబ్లిక్ దినోత్సవ శుభా కాంక్షలతో
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -25-1-18 –ఉయ్యూరు

