గణ తంత్ర లో తంత్రమే మిగిలింది
ఇన్నేళ్ల గణ తంత్రం లో మిగిలింది అన్నిటా తంత్రమే
అదీ దుస్తంత్రమే మనపాలిటి దౌర్భాగ్యమే
మర్చిపోయింది జన గణమన్సులనే
జనగణన ”తలల లెక్కింపు ” ప్రతి ఎన్నిక ముందూ తప్పని సరే
ఓట్లు రాల్చుకోటానికి నోట్లు పంచుకోటానికే
గణతంత్ర వేడుక రాష్ట్ర పతి ముందు రోజు తీపి కబుర్లతో
ఆ రోజు కవాతు దృశ్యాల మురిపాలతో సరి
ఇష్టమొచ్చినట్లు ప్రకటించే ”పద్మాల ”తోసరే సరి
పొందిన వాళ్లకు ఘన పొగడ్తల తంత్రాలైతే
రానివాళ్ళ కుతంత్రాలనే నిష్ఠూరప్పలుకుల మంత్రాలే
ఒకరికొకరు పంపుకునే శుభా కాంక్షల హోరే
బడిలో ,ప్రభుత్వ ఆఫీసులలో వేడుకలే కానీ
ప్రజా స్పందన లేని ఉత్తుత్తి వేడుకలే మిఠాయి పంపకాలే
రేడియో టీవీలలో ముందు రోజు అఖిలభారత కవి సమ్మేళనాలే
వాటికి ప్రాంతీయభాషా నాదస్వరాలే
సాధించిన ప్రగతికి ,అధిగమించాల్సిన అధోగతి కీ
అంతరాలు తీరే రోజే నిజమైన జన ఘన గణ తంత్ర వేడుక.
జన ఘన గణ తంత్ర వేడుకలను ఆహ్వానిస్తూ
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్-26-1-18 -ఉయ్యూరు

