ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్ళు
మాఘ శుద్ధ ఏకాదశి 27-1-18 శనివారం నుండి మాఘ బహుళ ఏకాదశి 10-2 18 శనివారం వరకు ఉయ్యూరులో 15 రోజులపాటు శ్రీ వీరమ్మతల్లి తిరునాళ మహా వైభవంగా జరుగుతుంది .27 వతేదీ రావి చెట్టు బజారు లోనిఅత్తవారింటి నుంచి బయల్దేరి 28 సాయంత్రానికి విజయవాడ రోడ్డు చెరువు ప్రక్కనున్నహోమ గుండం లో ప్రవేశించిన ఆలయ ప్రవేశం చేస్తుంది ఈ పదిహేను రోజులూ పెద్దఎత్తున జరిగే జాతర లో హిందూ ముస్లిం క్రైస్తవ భేదం లేకుండా సకల జనులు అమ్మవారిని భక్తితో సందర్శించు కుంటారు . గండ దీపాలతో స్త్రీలు,పురుషులు ఆబాల వృద్ధులు ఆలయానికి వెళ్ళే అమ్మవారి వెంట కాళ్ళకు చెప్పులు లేకుండా నడిచి తమ విశ్వాసాన్ని ప్రకటిస్తారు వారిని చూస్తె నడిచి వచ్చే అమ్మవారి ప్రతి రూపంగా కనిపిస్తారు ఉయ్యూరు తిరుణాల వైభోగం మాటలతో చెప్పలేనిది ప్రత్యక్షంగా చూసి అనుభవించాల్సిందే. సంతానం కోసం తడి బట్టలతో అమ్మవారి గుడి చుట్టూ భక్తితో నిద్రించే వారి కల లు ఫలించి సత్సంతానం కలుగుతుందనేది తిరుగు లేని నిదర్శనం . 11 వ రోజు సిడి బండీ ఉత్సవం లో కూడా వేలాది జనులు పాల్గొంటారు. ఈ15 రోజులూ తప్పెట్లు తాళాలు నగారాలు రాం డోళ్ళు,దశ్శరభలు వేటపోతుల కోళ్ల బలిదానాలు ,ఇళ్ళల్లో బంధు మిత్రులతో భోజన సంబరాలు రోజూ తెల్లవారు జామునదాకా గుడి ప్రాంగణం లో హరికదా, బుర్రకథ నాటకాలు అమ్మవారి చరిత్ర గానం మహావైభవం గా ఉంటాయి .. మీ-గబ్బిట దుర్గాప్రసాద్


