గీర్వాణ కవుల కితా గీర్వాణం -4
156-ఆగమ కోశ ప్రాజెక్ట్ లో పని చేసిన –లక్ష్మీ నరసింహ భట్ (19 39 )
వేద ,అలంకార ,పాంచరాత్ర ఆగమ విద్వాన్ లక్ష్మీ నరసింహ భట్ 19 39 ఆగస్ట్ 8 జన్మించాడు .తిరుపతి సంస్కృత విద్యాపీఠం రిటైర్డ్ ప్రొఫెసర్ .సంస్కృత ప్రతిభ సంపాదకుడు .న్యు ఢిల్లీ సాహిత్య అకాడెమీ రిసెర్చ్ జెనరల్ . తిరుపతి సంస్కృత విద్యాపీఠం.ఆగమ ప్రాజెక్ట్ లో పని చేశాడు .రాష్ట్ర పతి పురస్కార గ్రహీత .
156 కు ఆధారం –Inventory Of Sanskrit Scholors .
15 7-ద్వారకా –పట్టాల కర్త –బీనా బాయి (15 వ శతాబ్దం )
రామానుజ ధోరణికి చెందిన బీనాబాయి రామానుజులవారి తర్వాత జన్మించి 1518 లోపు మరణించి ఉంటుంది .యదు వంశానికి చెందిన రాజు మా౦డలికుడు తన తండ్రి అని తన ‘’ద్వారకా –పట్టాల ‘’రచనలో చెప్పుకున్నది .ఈ రాజు కధియవార్ కు చెందిన గిర్నార్ రాజు గా ఊహిస్తున్నారు .మొదటి మందాకుడు 11 వ శతాబ్ది వాడు . రెండవ మా౦డలికుడు ఈమె తండ్రికాదు .కాని బీనాబాయి హన్సి సింధు భార్య పట్టపు రాణి .రాణి గా ఆమె అత్యంత ప్రభావ శీలి ,గొప్ప పాలనానుభవమున్న రాణి గా గుర్తింపు పొందింది .తానేమీ విద్యావంతురాలిని కాదని ఆమె చెప్పుకున్నది .కాని ఆమె రచన చదివితే సకల శాస్త్ర పార౦గతురాలు అని అర్ధమవుతుంది .తాను శ్రీ కృష్ణ భక్తురాలినని ,తన జీవితం ఆయన సేవకే అంకితమని చెప్పింది .స్కాంద పురాణం లోని ప్రభాస ఖండం లో ఉన్న ద్వారకా మహాత్మ్యాన్ని చదివి తాను మైమరచి పోయి అత్యంత భక్తి శ్రద్ధలతో దీన్ని రాశానని అన్నది .
బీనాబాయి భారత దేశం అంతటా విస్తృతంగా పర్యటించింది .అనేక పుణ్య క్షేత్ర దర్శనం చేసి అక్కడ ఇతోధికంగా దానధర్మాలు చేసినట్లు పేర్కొన్నది.. ప్రజలందరితో సన్నిహిత సంబంధాలు కలిగి వారికి కన్నతల్లిలాగా అన్ని రకాల సదుపాయాలూ అందించింది .అందుకే ప్రజలు ఆమెను తమపాలిటి ‘’కల్పతరువు ‘’ గా ఆరాధించారు .ఆమె జీవితం స్వచ్చ గంగానది అంత పవిత్రమైనదిగా కీర్తించారు .
బీనాదేవి కవితా గీర్వాణం
‘’ద్వారకా-పట్టాల ‘’రచన లో నాలుగు భాగాలున్నాయి .మొదట్లో తనగురించి కొంత చెప్పుకున్నది బీనాదేవి .మొదటి అధ్యాయం లో స్కాంద పురాణం లో ద్వారకా పట్టణ విభాగాన్ని వర్ణించిన శ్లోకాలు చేర్చింది .ద్వారకానగర దర్శనం తో లభించే స్వర్గాన్ని వివరించింది రెండవ అధ్యాయం లో ద్వారక దేవతలైన గణేశ బలరామ ,కృష్ణ లను వర్ణించింది .అక్కడి ద్వారకగంగ గా పిలువబడే గోమతీ నది ,చక్రతీర్ధాలను గూర్చి చెప్పింది .మూడవదానిలో అక్కడి స్నాన విధులు ,ప్రసాదాలు ,గరిక తో పూజ చెప్పి నాలుగవ ధ్యాయం లో శ్రీ కృష్ణ పూజా విధానం తెలియ జేసింది .
మొదటి అధ్యాయం లో కొన్ని శ్లోకాలు –
1- ఏవం సంపూజితస్తేన హరిణా బ్రాహ్మణోత్తమః-ఉవాచ హరి సంతుస్టౌవరం బ్రూహీతి కేశవం .
158-గంగా వాక్యావళి కర్త –విశ్వాస దేవి (15 వ శతాబ్దం)
మిధిల రాజు పద్మ సింహ భార్య విశ్వాస దేవి .చిన్నతమ్ముడు శివ సింహ చనిపోయాక పద్మ సింహుడు రాజయ్యాడు .భర్త మరణానంతరం విశ్వాసదేవి రాజ్య పాలన చేబట్టింది .విశ్వాస దేవి ,శివ సింహ భార్య లక్ష్మా దేవి గొప్ప విదుషీమణులు .ఈ తోడికోడళ్ళువిద్యాపతి వంటి కవి పండితులను అపూర్వంగా ఆదరించి పోషించారు .కనుకకాలం 15 వ శతాబ్ది .
విశ్వాస దేవి రచించిన గంగా వాక్యావళి స్మృతి .గంగా నది పూజా విశేషాలను తెలియే జేసేది .స్మ్రుతి ,పురాణ ఇతిహాసాలలో గంగను గూర్చి చెప్పబడినవన్నీ ఇందులో చూపింది రచయిత్రి .ఇందులో ఇరవై తొమ్మిది అధ్యాయాలున్నాయి .వాటికి స్మరణ ,కీర్తన ,యాత్ర ,గతి ,వీక్షణ ,నమస్కార ,స్పర్శన ,అభయ ,క్షేత్ర ,అవగాహన ,స్నాన ,తర్పణ ,మృత్తిక ,జప, దాన ,పిండ ,జల ,పాన ,ఆశ్రయ ,,ప్రాయశ్చిత్త ,కృత కృత్య ,మృత్యు ,విఘ్న ,ప్రతి సిద్ధ అని సార్ధక నామాలు పెట్టింది .
మొదటి అధ్యాయం లో గంగ గొప్పతనం ,రెండవదానిలో గంగ స్మరణ ,తర్వాత గంగాయాత్ర వగైరాలను వర్ణించింది .
మొదటి శ్లోకం –
‘’స్వస్తాస్తు వస్తుహ్నిన రశ్మి భ్రుతః ప్రసాదా –దేకం వపుః శ్రిత వతో ద్వరిఘా సమేత్య –తన్నాభ పంకజ సాహోత్య మృణాళ లీలా –మావిష్కరోతు హృది యస్య భుజంగ రాజః ‘’
భావం –హరిహర అద్వైత స్వరూపాన్ని కవయిత్రి వర్ణిస్తోంది .శివుని కంఠాభరణమైన శేషుడు హరి నాభి నుండి వెలువడుతున్న పద్మ౦ శోభను ఆసక్తిగా గమనిస్తున్నాడు .
2- ‘’యావత్ పాతాళ మూలం స్పురదమల రుచిః శేష నిర్మోక వల్లీ-తా వహ్నిశ్వాస దేవ్య జగతి గంగా వాక్యావళీయం’’
ఇందులో భూమి ,స్వర్గం లలో ఉన్న ,ఎక్కడా కనిపించకుండా ఉన్న గంగను గురించి చెప్పింది .అంటే త్రిపధ గామి అయిన గంగ వలె తన కావ్యం చిరకాలం శోభిల్లుతుంది అని భావం .స్రగ్ధరా వృత్త శ్లోకం ఇది .
157 ,158 లకు ఆధారం –contribution of women to Sanskrit ‘’
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-1-18 –ఉయ్యూరు

