గీర్వాణకవుల కవితా గీర్వాణం -4
176 –నైమిశారణ్య తీర్ధ కర్త –రవీంద్ర నాద శాస్త్రి భట్టాచార్య (19 64 )
1-3-19 64 కలకత్తా లో పుట్టిన రవీంద్ర నాద శాస్త్రి భట్టాచార్యఎం ఏ పిహెచ్ డి. కలకత్తా యూని వర్సిటి సంస్కృత ప్రొఫెసర్.నైమిశారణ్య మహా తీర్ధం ,శివరూప బ్రహ్మచారి ,శబ్ద స్వరూప విమర్శ రాశాడు.
177-రాధా తంత్ర కర్త – సత్యపాద భట్టాచార్య (19 4 4 )
194 4 జులై 4 ఒరిస్సా నిసాన్ పూర్ జిల్లా అనాలియా లో పుట్టిన సత్యపాద భట్టాచార్య సాహిత్య ,న్యాయ ,అద్వైత ,సాంఖ్య ఆచార్య .వ్యాకరణ తీర్ధ .కలకత్తా ప్రభుత్వ సంస్కృత కాలేజి ప్రొఫెసర్ .జోగేన్ద్రనాద్ బగాచి ,శ్రీమాన్ తర్క వేదార్ధతీర్ధ లశిష్యుడు .యాన్ భట్టాచార్య ,సత్యవ్రత పహరి ,దేవవ్రత పహరి ,రమా బెనర్జీ భవానీ గంగూలీలకు గురువు .వేదాంత పరిభాష ,రాధా తంత్రం , తర్క సంగ్రహం రచించాడు .నిఖిలలోక మహా మండలి సభ్యుడు .పూర్వాంచల్ సంస్కృత ప్రచార పరిషత్ ఫౌండర్ సెక్రెటరి .వంగీయ సంస్కృత స్నిఖార సమితి ప్రెసిడెంట్ .
178-నిగామానంద చరితం కర్త –శ్రీ జీవ భట్టా చార్య (18 88 )
1888 పశ్చిమబెంగాల్ 24 పరగణాల భట్ పాద లో పుట్టిన శ్రీ జీవ భట్టాచార్య కావ్య ,వ్యాకరణ ,న్యాయ తీర్ధ .14 గ్రంథాల రచయిత .నిగమానంద చరితం ,సారస్వత శతకం ,పాండవ విక్రమం ,మహాకవి కాళిదాసం ముఖ్యమైనవి .
179-సప్త శాస్త్ర పారంగత –సుఖమయ భట్టాచార్య (1909 )
8-1-1909 ఇప్పటి బంగ్లాదేశ్ లోని సిల్హాట్ లో పుట్టిన సుఖమయ భట్టాచార్య విశ్వభారతి సంస్కృత ఉపన్యాసకుడు .అపురూప సంస్కృత వ్రాత ప్రతుల పరిశీలన చేశాడు. సప్త శాస్త్ర పార౦గతుడు.అత్యుత్తమ దేశికోత్తమ బిరుదు పొందాడు .రవీంద్ర ,శిశిర పురస్కారాలతోపాటు రాష్ట్రపతి ప్రశంసా పురస్కారం అందుకున్నాడు .11 సంస్కృత రచనలు చేశాడు .వివరాలు అలభ్యం .
180—దేవ భాష ప్రవేశ కర్త –తన్మయ కుమార్ భట్టాచార్య (1971 )
కలకత్తా లో 7-3-1971 జన్మించి కావ్య ,వ్యాకరణ తీర్ధ ,సాహిత్య ఆచార్య తన్మయ కుమార్ భట్టాచార్య కలకత్తా రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ లో ప్రొఫెసర్ .సిద్దేశ్వర పంచ తీర్ధ ,పండిట్ నారాయణ మిశ్ర ,పండిట్ పద్మనవ పాణిగ్రాహి ,ఆచార్య రామ రంజన ముఖర్జీలవద్ద చదివాడు .దేవ భాషా ప్రవేశిక రెండుభాగాలలో ,స్తోత్ర సంగ్రహం ,కథా కల్లోలిని ,విశ్వ సభ్యతాయాం వివేకాన౦దస్య అవదానం ,వ్యావహారిక సంస్కృత దర్పణం రాశాడు .రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ కో ఆర్డినేటర్ .
181-వేష అనావ్యాయోగ కర్త –వీరేంద్ర కుమార్ భట్టాచార్య (1917 )
వీరేంద్ర కుమార్ భట్టాచార్య 1917 కలకత్తాలో పుట్టి సంస్కృత లెక్చరర్ గా పని చేశాడు .11 పుస్తకాలు రాశాడు .అందులో కాళిదాస చరితం గీతా గౌరాంగం ,సూర్పణఖాభిసార ,శార్దూల శతకం , వేష అనావ్యాయోగ ముఖ్యమైనవి .ఆంగ్ల బెంగాలీ సంస్కృతాలలో అద్వితీయుడు.
182-శ్రీ ప్రత్యయ ప్రకరణ కర్త –తపన్ శంకర భట్టాచార్య (195 9 )
కావ్య ,వ్యాకర ,తర్క తీర్ధ ,న్యాయ వ్యాకరణ ఆచార్య తపన్ శంకర భట్టాచార్య 17-1-1959 మిడ్నపూర్ లో జననం .జాదవ్ పూర్ యూనివర్సిటి సంస్కృత అసోసియేట్ ప్రొఫెసర్ .పండితవాద్ బిహారీ త్రిపాఠీ ,పండిట్ ఆశుతోష్ న్యాయాచార్య ,పండిట్ మృణాల్ కాంతి బందోపాధ్యాల శిష్యుడు .చంద్ర భట్టాచార్య ,విశ్వరంజన పండాలకు గురువు .రచించిన 7 గ్రంధాలలో వైదిక వ్యాకరణ ,లఘు సిద్ధాంత కౌముది ,లకారార్ధ విషయే శాబ్దిక న్యాయికామిత సమీక్ష ,సిద్ధాంత కౌముది , శ్రీ ప్రత్యయ ప్రకరణ ఉన్నాయి .బర్ద్వాన్ యూని వర్సిటి గెస్ట్ లెక్చరర్ .యూని వర్సిటి ఆఫ్ బర్ద్వాన్ విజిటింగ్ ఫెలో .
183-వీర మిత్రోదయ కర్త –పద్మప్రసాద్ భారత్ రాయ్ (1896 )
1896 నేపాల్ రామేచ్చప్ జిల్లా శాలసుమాలి లో జన్మించిన పద్మప్రసాద్ భారత్ రాయ్ ,కాశీ సన్యాసి పాఠశాలప్రిన్సిపాల్ .గురుపరంపర –పండిట్ దీనా నాథ భట్టా రాయ్,మహామహోపాధ్యాయ లక్ష్మణ శాస్త్రి ద్రావిడ్ ,పండిట్ నిత్యానంద పర్వతీయ ,మహా మహోపాధ్యాయ వృద్ధ వామచరణ్. .శంకరానంద ,సరస్వతి ,చేతనానంద స్వామి శిష్యులు వాత్సాయన భాష్యం ,వీర మిత్రోదయ ,న్యాయ కుసుమాంజలి మొదలైన 4 రాశాడు .న్యాయరత్న ఉపాధి అవార్డీ .1984 లో పద్మ స్మృతిగ్రంథం ప్రచురింపబడింది .
184 –వైదిక భేషద్య కర్త –దేవ దత్త భట్టి (1939 )
సంస్కృత శాస్త్రి ,ఆనర్స్ డిగ్రీ ఉన్న దేవ దత్త భట్టి 3-6-1939 పాటియాలాలోజననం. అగర్నగర్ మలేర్కోట వేదిక్ రిసెర్చ్ హౌస్ డైరెక్టర్ .16 గ్రంథాలు రచించాడు .అవి – వైదిక భేషద్య,చికిత్సా కె ఆది శ్రోత ,వేద ,సంపా మొదలైనవి .2003 లో ప్రెసిడెంట్ పురస్కారం .అమెరికా ఇంగ్లాండ్ నేపాల్ వగైరా సందర్శనం .సంస్కృత కవిత్వ శైలి లో ప్రయోగ శీలి .
185-నూత నాంగ నాకం కర్త –భగవతీ భావదేవ (1902 )
పురాణ ,వ్యాకరణ ,వేదాంత తీర్ధ ,వేదాంత వాగీశ భగవతీ భావదేవ 1902 జనవరి 27 అస్సాం నాల్బరిజిల్లా కైతల కూచి జననం .రచనలు –సతి జయమతి ,శ్లోకమాల , నూత నాంగ నాకం.
186-రామవనగమనం సంగీత నాటకకర్త –వనమాలా భావల్కర్ (1940 )
చరిత్ర సంస్కృత పిహెచ్ డి వనమాలా భావల్కర్ సాగర్ యూని వర్సిటి సంస్కృత ప్రొఫెసర్ .రామ వనగమనం,పార్వతీ పరమేశ్వరీయం సంస్కృత సంగీత నాటక రచన .చైనా యుద్ధం నేపధ్యంగా’’ పాప్దండ ‘’ఏకాంకిక రాశాడు .
187-ముని శతకకర్త –మహాకవి భూరమాల్ (197 3 )
1973 లో మరణించిన మహాకవి భూరమాల్ రాజస్థాన్ సికార్ లో పుట్టాడు .శాస్త్రి .7 పుస్తకాలు రాశాడు –జయోదయ మహాకావ్యం ,వీరోదయ మహాకావ్యం ,సుదర్శనోదయ మహా కావ్యం ,ముని శతకం రచించాడు .’’ ముని జ్ఞాన సాగర్ ‘’అనే జైనాచార్యుడుగా లబ్ధ ప్రతిస్టు డు.కవిపుంగవ బిరుదున్నవాడు .దర్శన సాహిత్యాలనిది .
188-అద్భుద్దూతం కర్త –బిజే ఏ భూషణ అయ్యంగార్ (19 70 )
సాహిత్య వేదాంత విద్వాన్ భూషణ అయ్యంగార్ కర్నాటక మెల్కోటే లో పుట్టి .మైసూర్ మహారాజా సంస్కృత విశ్వవిద్యాలయ విశిష్టాద్వైత ప్రొఫెసర్ గా ఉన్నాడు. అద్భుద్దూతం తోపాటు అనేక నాటకాలు ,చంపు ,గద్యకావ్యాలు ,మహాకావ్యాలు స్తోత్రాలు సంస్కృతంలో రచించాడు . సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత .
18 9-త్రికాల సంధ్యా దేవతార్చనకర్త –బిదిరేపల్లి గోవిందాచార్య జయరామాచార్య (1933 )
బిదిరేపల్లి గోవిందాచార్య జయరామాచార్య14-10-1933 బెంగుళూర్ దగ్గర బిదిరేపల్లిలో జన్మించాడు .శ్రౌత త ,స్మార్త విద్వాన్ .శుక్లయజుర్వేద ప్రొఫెసర్ .నారాయణ భట్ట ,రంగాచార్య గురువులు .త్రికాల సంధ్యా దేవతార్చనం రాశాడు
190-ముస్లిమానాం సంస్కృత అభ్యాసః –కర్త –జి .డి . బీరజ్దార్ (అబ్బాస్ ఆలీ )-1935
మహారాష్ట్ర షోలాపూర్ లో 24-8-1935 జన్మించిన బీరజ్దార్ బొంబాయి సోమయసంస్క్రుత కేంద్ర జాయంట్ కన్వీనర్ .విశ్వభాష పత్రిక సంపాదకుడు .వారణాసి విశ్వ సంస్కృత ప్రతిస్టాన్ జనరల్ సెక్రెటరి . . ముస్లిమానాం సంస్కృత అభ్యాసః,ప్రాచీన భారతీయ భౌతిక వాజ్మయం మొదలైన 5 గ్రంధాలు సంస్కృతంలో రాశాడు .మహా పండిత ,పండితేంద్ర ,సంస్కృత రత్న ,పరశురామ శ్రీ ,విద్యాపారంగత బిరుదాంకితుడు .రాష్ట్ర పతి పురస్కార గ్రహీత .
176 నుండి 190వరకు ఆధారం — Inventory Of Sanskrit Scholors
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-1-18 –ఉయ్యూరు

