గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
159-విరక్తి విధిక ,భక్తి విధిక కర్త –ముగ్గేరి మంజునాథ భట్ –(1916 )
కర్నాటక ఉడిపి లోని ముగ్గేరిలో 6-9-1916 జన్మించిన ముగ్గేరి మంజునాధ భట్ –సంస్కృత ఎం ఏ ,సాహిత్య విద్వాన్ .గోదావర్మ ,రామస్వామి శాస్త్రి లశిష్యుడు .విరక్తి విధిక ,భక్తీ విధిక అనే రెండు రచనలు చేశాడు .ఋగ్వేద ,అద్వైత ,సాహిత్యాలలో గొప్ప కృషి చేశాడు .
160 –మధురవాణి కర్త –నారాయణ భట్ (19 24 )
19 24 జూన్ 16 కేరళ కాసర్ గోడ్ జిల్లా ముగు లో పుట్టిన నారాయనభట్ మధురవాణి ,ఉదయన పత్రిక గ్రంధాలు రాశాడు .
161 –రామాయణ నవనీతం కర్త –సవితాభాట్ (1958 )
డి.ఫిల్.చేసిన సవితాభాట్ 1958 జులై 1 ముస్సోరీ లో పుట్టింది .అసోసియేట్ ప్రోఫెసార్ .రామాయణ నవనీతం ,వాల్మీకి కె వన ఔర్ వృక్ష రాసింది .
162-ద్రాహ్యాయన సూత్ర కర్త –శివరాం శంభు భట్ (1928 )
2-10-19 28 కర్నాటక హోసకుల్లి లో పుట్టిన శివరాం శంభు భట్ –సామవేద ,శ్రౌత ,తాండ్య మహా బ్రాహ్మణ లలో విద్వాన్ ఉపాధి .అధ్యాపకుడు ,భాస్కరిలోని ఆర్ బి ఎస్ ఎస్ మహా పాఠ శాల అధ్యక్షుడు . ద్రాహ్యాన సూత్ర-,త్రికాల సంధ్యావందన రచయిత.తిరుపతి దేవస్థానానికి సామవేద సంహిత రికార్డ్ చేశాడు అనేక జాతీయ ,అంతర్జాతీయ సంస్కృత సంమేలనాలలో పాల్గొన్నాడు .ఊహా రహస్యాంత ప్రకృతి ,వికృతి ప్రాజెక్ట్ లో ఉన్నాడు ప్రెసిడెంట్ అవార్డీ .
163-సంస్కృత వాక్య సంరచన కర్త –వసంత కుమారం భట్ (1953 )
19 53 ఫిబ్రవరి 21 గుజరాత్ లోని అహ్మదాబాద్ లో పుట్టిన వసంత కుమారం భట్ –స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్ డైరెక్టర్ ,గుజరాత్ సంస్కృత యూని వర్సిటి ప్రొఫెసర్ ,హెడ్ .గురువు బాలకృష్ణ పంచోలి .శిష్యుడు కాళిందీ పాథక్ .36 పుస్తకాలు రాశాడు ముఖ్యమైనవి –సంస్కృత వాక్య సంరచన ,పాణినీయ వ్యాకరణ విమర్శ ,పాణినీయ వ్యాకరణ అర్ధ .
164-త్రయి కర్త –కె. నారాయణ భట్ట (1959 )
ఎం ఏ ,పిహెచ్ డి,శాస్త్ర ప్రౌఢి-కె నారాయణ భట్ 5-2-19 5 9 కర్నాటక కార్వార్ జిల్లా సాల్కోట లో పుట్టాడు .మైసూర్ సంస్కృత యూని వర్సిటి ప్రొఫెసర్ .త్రయి ,యాస్క నిరుక్తం ,ఋతు సంహారం రచించాడు
165 –శ్లోక బద్ధ సిద్ధాంత కౌముది కర్త –నారాయణ భట్ట (1855 )
1855 లో గ్వాలియర్ లో పుట్టిన నారాయణ భట్ట –శ్లోక బద్ధ సిద్ధాంత కౌఉది ,పంచ పంచాశిక ,ప్రతిభా సప్రతి చవి ,సంస్కృత శ్లోక శత సంగ్రహః స్వమిత్ర శ్లోక సంగ్రహః అనే 5 సంస్కృత రచనలు చేశాడు .
166-పరమ దైవతాః పతి కర్త –రాజేశ్వరి భట్ట (1964 )
జైపూర్ ఎల్ బి ఎస్ పిజి కాలేజి హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ రాజేశ్వరి భట్ట 1964 లో పుట్టింది .అనేక సంస్కృత వ్యాసాలూ అనేకానేక సంస్కృత కధలు రాసి ప్రసిద్ధి చెందింది .చాలా పురస్కారాలు అందుకున్నది .ఈమె రాసిన ‘’పరమ దైవతాః పతి ‘’అనే కథ రాజస్థాన కథా కుంజం లో చోటు చేసు కున్నది అంటే ఆమె ప్రతిభ ఏమిటో మనకు తెలుస్తుంది.
167-మీమాంస శాస్త్రార్ద వల్లరి కర్త –వి.సుబ్రాయ భట్ట (1964 )
1-6-19 64 కర్నాటక సిద్దాపూర్ లో పుట్టిన వి సుబ్రాయ్ భట్ట ఎం ఏ పిహెచ్ డి..శృంగేరి రాజీవ్ గాంధీ రాష్ట్రీయ సంస్కృత కాంపస్ లో ప్రొఫెసర్ .రచనలు -.జైమిని న్యాయమాల ,మీమాంస శాస్త్రార్ద వల్లరి ,ఆపస్త౦భ పరిభాషా సూత్రం ,కూష్మాండ మంత్రార్ధ దీపిక .
168-న్యాయ ప్రమాణ పరిక్రమ కర్త –అభేదానంద భట్టాచార్య (1937 )
19 37 ఏప్రిల్ 10 అస్సాం కామరూప జిల్లా కామాఖ్య నగర్ లో పుట్టిన అభేదానంద భట్టాచార్య వేదాంత ఆచార్య ,దర్శన ఎంఏ .,పిహెచ్ డి.డిలిట్ .సంస్క్రుతకాలేజి ప్రిన్సిపాల్ .పండిట్ రఘునాధ శాస్త్రి ,పండిట్ కమలాకాంత ,పండిట్ త్రిలోకాదార ద్వివేదీ ,విశ్వనాధ భట్టా చార్యాలు గురుపరంపర . న్యాయ ప్రమాణ పరిక్రమ,వేదాంత సూత్రా ,ప్రతిపాద్య విమర్శ రాశాడు .
169-మూలమాధ్యమిక మత ప్రకాశిక కర్త –ఆదిత్యానాద్ భట్టాచార్య (1937 )
నాడియా లో 1-8-1947పుట్టిన ఆదిత్యానాద్ భట్టాచార్య ఎం ఏ పిహెచ్ డి.బర్ద్వాన్ యూని వర్సిటి ప్రొఫెసర్ .14 గ్రంధాలు రాశాడు . మూలమాధ్యమిక మత ప్రకాశిక,బ్రహ్మ విచార్యత్వ సమీక్షా ,ఆన్ ఎనలిటికల్ ఎక్స్పోజర్ ఆఫ్ కేనోపనిషత్ ముఖ్యమైనవి .జీవన సాఫల్య పురస్కారం ‘’విద్యాలంకార్ ‘’,పొందాడు .20 04 లో ‘’మాన్ ఆఫ్ ది యియర్ ‘’అవార్డ్ అందుకున్నాడు .ఏ బి ఐ రిసెర్చ్ బోర్డ్ గౌరవ సభ్యుడు అనేక అంతర్జాతీయ సెమినార్లకు మెంబర్ గా జనరల సెక్రెటరి గా ఉన్నాడు .
170-స్తోత్ర పుష్పాంజలి కర్త –అమర ప్రసాద భట్టాచార్య (19 25 )
19 25 బెంగాల్ లోపుట్టిన అమర ప్రసాద భట్టా చార్య వేదాంత ,కావ్య తీర్ధ .వేదాంత శాస్త్రి .ఎం ఏ పిహెచ్ డికలకత్తా దీనబంధు ఆండ్రూస్ కాలేజి సంస్కృత ప్రొఫెసర్ .ఉపనిషత్ప్రదీపం ,స్తోత్ర పుష్పాంజలి సంస్కృతం లోను ,నిమ్బార్కర ద్వైతాద్వైత దర్శన ,సమీక్షా పంచక బెంగాలీలోనూ రాశాడు .
171-కళాసిద్ధాంత దర్శిని కర్త –హరన్ చంద్ర భట్టాచార్య (1889 )
18 8 9 పశ్చిమబెంగాల్ రాజ సాహి జిల్లా బలుభార లో పుట్టిన హరన్ చంద్ర భట్టాచార్య షెఖావతి సంస్కృత కాలేజి హెడ్ .గురువు శివకుమార శాస్త్రి .కళా సిద్ధాంత దర్శిని రాశాడు .19 42 లో బ్రిటిష్ ప్రభుత్వం చే మహా మహోపాధ్యాయ బిరుదు పొందాడు .
172-క్రోడ పత్రకారుడు –కాళీ శంకర భట్టాచార్య
అనేక క్రోడపత్ర రచయితగా పేరు పొందిన కాళీ శంకర భట్టా చార్య పశ్చిమ బెంగాల్ వాసి .కాలం తెలియదు .’’క్రోడపత్రకార్ ‘’గా సుప్రసిద్ధుడు .
173- విశుద్ధ వైభవ మహాకావ్య కర్త –మనుదేవ భట్టాచార్య (1946 )
1946 జూన్ 28 బంగాల్ లో పుట్టిన మనుదేవ భట్టాచార్య వారణాసి సంపూర్ణానంద సంస్కృత విశ్వ విద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ .గోపీనాధ ,రాజేశ్వరశాస్త్రి లు గురువులు .విశుద్ధ వైభవ మహా కావ్యం ,రామ కృష్ణ చరితామృతం ,పండిత రాజ వైభవం రాశాడు .వ్యాకరణ భూషణ బిరుదు .
174-కార్య కారణ రహస్య కర్త –మోహన భట్టాచార్య (1912 )
5-2-1912 వెస్ట్ బెంగాల్ లోపుట్టిన మోహన భట్టాచార్య తర్క ,వ్యాకరణ ,వేదాంత తీర్ధ .అసిస్టెంట్ ప్రొఫెసర్ .మహా మహోపాధ్యాయ శ్రీ కృష్ణ చరణ్ ,మహామహోపాధ్యాయ చండీ దాస్ ల శిష్యుడు.కార్య కారణ రహస్యం ,అద్వైత మత సమీక్ష రచించాడు .
175-అవచ్చేదకత్వ నివృత్తి కర్త –పండిట్ వామచరణ్ భట్టాచార్య(18 80 )
18 80 లో కాశీ లో పుట్టిన పండిట్ వామ చరణ్ భట్టాచార్య న్యాయ ,వైశేషిక ఆచార్యుడు .కాశీ సంస్క్రుతకాలేజి హెడ్ .గురుపరంపర –పండిట్ గదాధర్ శిరోమణి ,పండిట్ సురేంద్ర మోహన్ ,తర్కతీర్ధ కైలాస చంద్ర శిరోమణి .ముఖ్య శిష్యులు –రాజేశ్వర శాస్త్రి ద్రావిడ్ ,పండిట్ శివదత్త మిశ్ర ,ఖగేన్ద్రనాద్ పాండే ,మహామహోపాధ్యాయ కుంజ విహారీతర్క తీర్ధ ,మహామహోపాధ్యాయ పండిట్ రమేష్ చంద్ర తర్కతీర్ధ . అవచ్చేదకత్వ నివృత్తి ,జగదీషి మనోరమా టీకా రాశాడు .19 25 లో బ్రిటిష్ ప్రభుత్వం మహా మహోపాధ్యాయబిరుదునిచ్చింది .
15 9నుంచి 175 వరకు ఆధారం – Inventory Of Sanskrit Scholors
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -2-1-18- ఉయ్యూరు

