గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
191-సమాశక్తి నిర్ణయ కర్త –వనమాలీ బిస్వాల్ (19 61 )
4-5-1961 ఒరిస్సా యజిపూర్ జిల్లా తెలియాలో పుట్టిన వనమాలీ బిస్వాల్ ఎం ఫిల్,పిహెచ్ డి.అలహాబాద్ ఝా కాంప్లెక్స్ అసిస్టంట్ ప్రొఫెసర్ . సమాశక్తి నిర్ణయ,దికాన్సెప్ట్ ఆఫ్ ఉపదేశ ఇన్ సాంస్క్రిట్ గ్రామర్ ,సంగామేనాభిరామ ,వ్యాత ,నిర్ణయ స్వనః మొదలైన 40 పుస్తకాలు రాశాడు .విద్యావేత్త ,కవి ,20 ప్రైజులు పొందాడు .యుపి సంస్కృత సంస్థాన్ ,ఢిల్లీ సంస్కృత అకాడెమీ ,హిందీ సాహిత్య సమ్మేలన్,సంస్కృత అకాడెమి ల నుంచి పురస్కారాలు పొందాడు .
192-సాహిత్య దర్పణ కర్త –భాగీరధీ బిస్వాస్ (1958 )
నాదియాలో 1-2-19 58 పుట్టిన భాగీరధి బిశ్వాస్ అస్సాం యూని వర్సిటి సంస్కృత ప్రొఫెసర్ .సాహిత్య దర్పణం ,సోషియాలజీ ఆఫ్ సాంస్క్రిట్ డ్రామా రాసాడు .
193- నారదీయ శిక్ష కర్త –దీహిత్ బిశ్వాస్ (చక్రవర్తి )-1955
1955 సెప్టెంబర్ 29 కలకత్తాలో పుట్టిన దీహిత్ బిశ్వాస్ కలకత్తా యూని వర్సిటి ప్రొఫెసర్ .సంస్కృత -నారదీయ శిక్ష రాశాడు
194 –పంచలింగ ప్రకరణకర్త –హేమలతా బోలియ (19 52 )
హేమలతా బోలియా 19 52 ఏప్రిల్ 22 ఉదయపూర్ లో పుట్టి ,అక్కడే మానవికి సంస్కృత మహా విద్యాలయం లో సంస్కృత ప్రొఫసర్ .రామ చంద్ర ద్వివేది ,ప్రొఫెసర్ విష్ణు రాం నగర్ , ప్రొఫెసర్ రాధా వల్లభ త్రిపాఠీ ,గిరిధర్ లాల్ శాస్త్రి వంటి ఉద్దనదుల వద్ద విద్య నేర్చాడు .ఎంఏ పిహెచ్ డి.శ్యామానంద మిశ్ర ,హేమంత దుగార్వాల్ ముఖ్య శిష్యులు .రాసిన నాలుగు పుస్తకాలలో మహారధ మంజరి ఏక అధ్యయన ,కారకప్రబోధ ,పంచలింగ ప్రకరణ ,భాక్తామర స్తోత్రం ఉన్నాయి
195 –బృహత్ సంహిత కర్త –సాయికళ ఇందిరా బోరా (1957 )
సాయికళ ఇందిరాబోరా 19-9-1957 అస్సాం నవగావ్ లో పుట్టి ఎంఏ పిహెచ్ డిచేసి ,గౌహతి ప్రాగ్జోతిష కాలేజి ప్రొఫెసర్ చేసింది రచించిన 5 పుస్తకాలలో రామాయణం ,భాగవత పురాణం ,బృహత్ సంహిత ,అభిజ్ఞాన శాకుంతలం ,కారక సంహిత ఉన్నాయి
196- భక్తి రస విమర్శ కర్త –కపిల్ దేవ బ్రహ్మ చారి (1943 )
కపిల్దేవ బ్రహ్మచారి సీతామధి లో 13-8-1943 జన్మించాడు .రిటైర్డ్ ఉపాచార్య .శాస్త్ర చూడామణి .భక్తి రస విమర్శ రాశాడు .యుపి ప్రభుత్వ పురస్కార గ్రహీత .
197-ఆంద్ర ప్రదేశ పర్యటనం కర్త –గౌరీ కుమార్ బ్రహ్మ (1919 )
ఎంఏ ,డిఎడ్ గౌరీ కుమార్ బ్రహ్మ 1919 సెప్టెంబర్ 5 ఒరిస్సాలో పుట్టి ,ఒరిస్సాప్రబుత్వ టూరిస్ట్ డైరెక్టర్ చేశాడు .ఆంద్ర ప్రదేశ పర్యటనం ,భారత సంహిత ,భంజా పంచాశిక రాశాడు .ఉత్కళ వాచస్పతి ,పురుష సరస్వతి ,వాగ్మి ప్రవర ,భారత ప్రదీప బిరుదులతో అలరారిన పండిత కవి
198- -సంస్కృత వాక్యనిర్మాణం పై పరిశోధించిన –సురేంద్ర కుమార్ బ్రహ్మచారి(1933 )
1933 డిసెంబర్ 20 బీహార్ చాప్రాలో పుట్టిన సురేంద్ర కుమార్ బ్రహ్మచారి కెఎస్ డి సంస్క్రుతయూనివర్సిటి ప్రొఫెసర్ వైస్ చాన్సలర్ .సాంస్క్రిట్ సింటాక్స్ అండ్ ది గ్రామర్ ఆఫ్ కేస్ ,కొ ఆర్డినేషన్ ఇన్ సాంస్క్రిట్ రాశాడు.ప్రెసిడెంట్ అవార్డీ .
199—అద్భుత పంచతాకావ్యం కర్త –బ్రహ్మదత్త వాగ్మి (1925 )
బ్రహ్మ దత్త వాగ్మి 1925 మార్చి 19 హర్యానా గుర్గాం లో పుట్టాడు . అద్భుత పంచతాకావ్యం సంస్కృతం లో ,కావ్యావతరణంహిందీలో రాశాడు జ్యోతిష సాహిత్య వ్యాకరణ ఆచార్య .
200-మహాభారత సంశోధన ప్రతిస్టాన్ స్థాపన చేసిన –రామ చంద్ర బుదీహాల్ (1971 )
రామ చంద్ర బుదీహాల్ ఎంఎస్సి పిహెచ్ డి.13-12- 19 71 బెంగుళూర్ లో పుట్టాడు .ఏయిరో స్పేస్ ,డిఫెన్స్ ,శాటిలైట్ సిస్టం ల సొల్యూషన్ ఆర్కిటెక్ట్ –బెంగుళూర్ విప్రో టెక్నాలజీస్ .భారతీయ సంస్కృతీ వారసత్వ పరిరక్షణకు దీక్ష పూని మహాభారత సంశోధన ప్రతిస్టాన్.స్థాపించాడు .’’వ్యాస ‘’అనే ప్రత్యెక పరికరం తో ప్రాచీన గ్రంధాలను డిజిటలైజ్ చేస్తున్నాడు . ‘’సంస్కృత మొబైల్ లాబరేటరి’’ కి ఆద్యుడు ..మహా భారతానికి సంపూర్ణ విజ్ఞాన సర్వస్వం తయారు చేసే కృషిలో నిమగ్నమయ్యాడు .భారత రాష్ట్ర పతి చేత మహర్షి బాదరాయణ పురస్కారం ప్రదానం చేయబడ్డాడు .
191- నుండి 200 వరకు ఆధారం — Inventory Of Sanskrit Scholors
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-1-18- ఉయ్యూరు
.
—

