గీర్వాణ కవుల కవిత గీర్వాణం -4
201-ముదిత మదాలస నాటక కర్త –గోపీనాధ ఉపాధ్యాయ (17 09-1740 )
మిదిలలో అత్యంత సర్వ శ్రేస్టకవి పండితుడుగా గుర్తింపబడిన గోపీ నాథ ఉపాధ్యాయ 1709 కాలం వాడు .మహామహోపాధ్యాయ పీతాంబరవిద్యానిధి ,ఉమల కుమారుడు .ఇతని సోదరులు రఘునాధ ,లక్ష్మీ నాథలు కూడా గొప్ప పండితులు మహా మహోపాధ్యాయులే .తండ్రి వద్దనే అనేక శాస్త్రాలు నేర్చాడు .’’సాకల సారస్వత సంసార సార నీవీ భగవిత ,వాణీ విలస కవి ‘’అని గోపీనాధ తండ్రి గురించి చెప్పాడు .’’మిధిలలో గత 40 0 ఏళ్ళలో మహామహోపాధ్యాయ గోకులనాధ వంటి ఉత్తమోత్తమ కవి శాస్త్ర పండితుడు పుట్టనే లేదు ‘’అని డిసి భట్టాచార్య అనే చారిత్రిక పరిశోధకుడు అన్నాడు .కానిగోపీనాద కవి గురించి సమగ్ర సమాచారం లభించకపోవటం దురదృష్టం .
తాను స్పృశించి ,ప్రభావితం చేసి వదిలి పెట్టని సంస్కృత ప్రక్రియ ఏదీ లేదు .స్వీయ రచనలోనైనా వ్యాఖ్యానాలలోనైనా అయన ముద్ర అమోఘం ,శాశ్వతం .మహా మేధావిగా గణన కెక్కాడు .ఇతని శిష్యుడు ,’’ప్రేత వివాహ పధ్ధతి ‘’కర్త రామేశ్వరుడు గురువు గూర్చి ఎన్నో ప్రశంసా వాక్యాలు రాశాడు .ఘర్వాల్ రాజు ఫతేషా ఆస్థాన కవి గోకుల నాధుడు .దీని రాజధాని శ్రీనగరం .తాను రాసిన ‘’ఏకావలి ‘’అలంకార గ్రంధం రాజుకు అంకితమిచ్చాడు .సూక్తిముక్తావలి అనే మరో రచనలో నరేంద్ర సింహ యువరాజు గోపాలసింహ శోర్య పరాక్రమ వర్ణన చేశాడు .ఎందరు రాజులు ఆహ్వానించినా వెళ్ళని గోకుల నాధుడు ,ఏముస్లిం పాలకుడు ,సమీ పించటానికి సాహసం చేయని పరాక్రమశాలి ఫతేషా ఆస్థానకవి అయ్యాడు .90 ఏళ్ళ సంపూర్తి జీవితం అనుభవించి గోపీనాధుడు కాశీలో1740 లో మరణించాడు .100 కు పైగా గ్రంధాలు రచించినా ,అందులో వెలుగు చూడనివి ఎన్నో ఉన్నాయి .తన ‘’కావ్యప్రకాశక వివరణ ‘’లో 30 రచనలను పేర్కొన్నాడు .అందులో శివ స్తుతి లేక శివ శతకం ,కాదంబరి కృతి శ్లోక మాత్రమె లభ్యం.
202- కేదార శతకకర్త –త్రిలోచన ఉపాధ్యాయ (18 వశతాబ్దం )
మహామహోపాధ్యాయ త్రిలోచన ఉపాధ్యాయ గోకులనాధుని పెద్దన్నగారు .శివునిపై ‘’కేదారనాధ శతకం ‘’రాశాడు .
203 –మాలవిజయ కావ్య కర్త –కవి శేఖర(18 వశతాబ్దం )
మాలవిజయ కావ్య కర్త కవి శేఖరుని కావ్య వ్రాతప్రతి దర్భంగా లో భద్రం గా ఉంది.గోకులనాధ కంటే చిన్నవాడు .గోకులనాధుని కోరికపై రాశాడు .ఇందులో కవి గోకులనాథు డిని ‘’సత్యయుగ పురుషుడు ‘’గా కీర్తించాడు .కావ్యం నాలుగు భాగాలు . వీటికి విరించి సభా వర్ణనం ,సత్య కాళి ప్రస్తావన ,కాళీ మర్త్యావతారం ,శ్రీమద్గోకులనాద మహాశయా విజయ విలాసం ‘.వైష్ణవ ఆరాధనకంటే ,తాంత్రిక ఆరాధన శ్రేష్టం అని ఇందులో తెలియ జేశాడు .దీని వ్రాతప్రతి పైకాలం 17 01 అని ఉన్నది
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-1-18 –ఉయ్యూరు

