గుడ్డి రాజు ”కు కూడా లేనంత పుత్ర ప్రేమ
చంద్ర బాబు ఎంపిక చేస్తే ప్రధాని అయిన దేవ గౌడ కు పుత్ర వాత్సల్యం మితి మీరి పోయిందట .మొన్న కర్ణాటక రిజల్ట్స్ రాగానే గెలిచిన జేడీఎస్ సభ్యులందరినీ పోగేసి కూర్చోబెట్టి ”నాకు 87యేళ్లు వచ్చాయి .ఇక ఎంతకాలం బతికి ఉంటానో తెలీదు .చనిపోయేలోగా మా అబ్బాయి కుమారస్వామిని ముఖ్యమంత్రిగా చూడాలని ఉంది .కనుక మీరందరూ సహకరించి నా కోరిక తీర్చి నామనసుకు శాంతి కలిగించండి ”అని బ్రతిమిలాడినట్లు ”ఆంద్ర జ్యోతి కధనం ”. . ఔరా పుత్రప్రేమ యెంత బలీయం ?అంతే ఈ విషయం సోనియాకు తెలియటం ,గద్దెనెక్కటానికి సిద్ధమైన సిద్ధరామయ్యకు రాజీనామా చేయించి కుమారస్వామికి ఆయన పార్టీ బేషరతుగా మద్దతు పలకటం క్షణాలమీద జరిగిపోయాయి .తర్వాత సీన్లు మనం మూడురోజులు తనివితీరా చూసినవే కదా .దటీజ్ పుత్ర ప్రేమ . ఈ మాత్రం ఇంగితం గుడ్డి రాజు ధృతరాష్ట్రుడికి కూడా ఉన్నట్లు ఎక్కడా బయట పడినట్లు లేదు మనసులోనే మధనపడ్డాడుపాపం .ఆయనకు తెలుసు ఎలాగూ తనకొడుకు దాన్ని సాధిస్తాడని అందుకే మౌనమేమో .ఇక్కడ సీను రివర్స్ .బలం లేదు .అందులో మూడు గ్రూపులు ఆపార్టీలోనే .అందుకే తండ్రి గౌడ చక్రం అడ్డం వేశాడు ,అనుకున్నది నిమిషాలమీద సాధించాడు . నెహ్రూ వంశం లోనూ ఈ రకం కోరిక ఉన్నట్లు ఎవరూ బయటపడినట్లు లేదు .ఎలాగో మెజార్టీ పార్టీ కనుక బయటినుంచి నొక్కి కావాల్సింది సాధించుకొని ఉండవచ్చు .
అయ్యో పాపం జగన్ తండ్రి బతికుండగానే ఇలాంటి ఫిట్టింగ్ పెట్టించి ఉంటె ,సి ఏం అయి ఉండేవాడు .చేతులు కాలాక ఆకులు పట్టుకుని దేశ ద్రిమ్మరిలాగా పదవికోసం పాట్లు పడుతున్నాడు ..అసహనం తో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు . అందుకే రాజకీయ నాయకులకు ముందు చూపు ఉండాలంటారు . బాబు చూడండి -తనమంత్రి వర్గం లోనే మంత్రి పదవి నిచ్చి సరసన చేర్చుకుని మురిసిపోతున్నాడు .ముసలాయన నల్లకళ్లద్దాలున్నాయన కొడుకు అధికారం హస్తగతం చేశాడు మేయర్ పదవి ఇప్పించాడు తమిళనాడు లో . అక్కడ కూడా చిన్నిల్లు ,పెద్దిల్లు గొడవలున్నా మేనల్లుడు ఒత్తిడి చేస్తున్నా చాకచక్యం తో బాలెన్స్ చేస్తున్నాడు .ఇక చెప్పేదేముంది ములాయం సంగతి కొడుకు నెక్కించి ,మళ్ళీ ఇద్దరికీ పడక పదవి కమలం చేతిలో పెట్టే శారు ఇద్దరూ తన్నుకుని .. కనుక నాయనలారా ”పుత్ర ప్రేమా జిందాబాద్ ‘దుర్గాప్రసాద్
—

