రెండిటికీ చెడ్డ రేవణ్ణ
కాలువ దగ్గర రేవు లో చాకలి వారు బట్టలు ఉతకటం మనకు తెలుసు .పెద్దపెద్ద బానలు రాళ్ళ పొయ్యి మీద పెట్టి కట్టే అందులో మురికి బట్టలు వేసి, బట్టల సోడా, నీలిమందుకలిపి పోయ్యికిండా కట్టేపుల్లలతో మంటపెట్టి ,ఉడికించి ,బండకేసి బాది, ఆరేసి శుభ్రంగా ఇళ్ళకు తీసుకొచ్చి ఇవ్వటం చూసేఉంటాం .వీటిని చలువబట్టలు అంటారు .ఇలా ఉతకటాన్ని రేవు కెళ్లటం అనీ అంటారు. .’’మ౦గమ్మా నువ్వు ఉతుకు తుంటే అందం ‘’అని’’ అల్లు ‘’అల్లప్పుడేప్పుడో సినిమాలో పాడిన పాట గేపకం లేదాఏంటి? .ఒక తెలివి తక్కువ చాకలి అంటే రేవడి కి అంటే రేవు ఉన్న అన్న రేవన్నకు రెండు బానలున్నాయి .ఒక రోజు అకస్మాత్తుగా రేవుకు వరద వచ్చింది .ఎగువనున్న బాన కాపాడుకొందామని పరిగెత్తి దగ్గరున్న బానను వదిలేశాడు .తీరా అక్కడికి వెళ్ళే సరికి అదీ , ఇదీ రెండు బానలూ మునిగిపోయాయి .ఈ కధ ‘’రెంటికీ చెడ్డ రేవన్న(రేవడి )’’సామెతగా తెలుగు దేశం లో బాగా ప్రచారం గా ఉంది .
ఈ సామెత ఇప్పుడు కర్నాటకలోనూ రుజువైంది .’’నువ్వు మోకాలుకు బట్ట తలకూ ముడి పెడతావ్ ,యేదీసూటిగా చెప్పవు ‘’అంటారా !దేవే గౌడ పెద్దకొడుకు కుమారస్వామి అయితే చిన్న కొడుకు పేరు రేవణ్ణ అని తెలుసుగా .ఎన్నికలై రిజల్ట్స్ డిక్లేర్ చేయగానే’’ ఎడ్డీ ‘’’12 మంది శాసన సభ్యులబలం ఉన్న జెడిఎస్ నేత రేవణ్ణ’కు ఉపముఖ్యమంత్రి పదవి ఆశ చూపాడు .యెగిరి గంతేసి దూకేసేవాడే కాని అప్పటికి ట్యూబ్ లైట్ వెలిగిన తండ్రి దేవ గౌడ ముందరికాళ్ళకు బంధమేస్తూ తాను తనువు చాలించేలోపు పెద్ద కుమారుడు కుమారస్వామిని సి .ఏం. గా చూడాలన్న ఆఖరి కోరికను తన సభ్యులందరికీ కన్నీటి గాధగా చెప్పాడు .ఎవర్నీ పార్టీ విడిచి వెళ్ళవద్దు అని ప్రాధేయపడ్డాడు .రేవణ్ణ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది .మింగాలేడు,కక్కాలేడు.ఆశలన్నీ అణచుకుని అన్న పక్క మౌనంగా ఉండి పోయాడు .
ఇవాళ కుమారసామి గద్దె నెక్కుతాడు ముఖ్యమంత్రిగా .ఉపముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్ తన్నుకు పోయింది .ఇంకోటి ఉందని ఆశపెట్టినా అదీ కాన్గీకే హస్తగతం .కనుక రేవణ్ణ కు డిప్యుటీ సి ఏం అయ్యే అవకాశమే లేకుండా పోయింది .అన్నతో పాటు ప్రమాణం ఏసే చాన్సూ లేదు .ఇక అన్నదయగా ఇచ్చే మంత్రి పదవి మాత్రం ఖాయం .అందులో ముఖ్యమైన శాఖ ఇవ్వాలంటే సోనియమ్మ దయ కూడా ఉండాలి. ఏక పక్ష నిర్ణయం అన్న తీసుకోలేడు.అందుకనే ఆయన ‘’రెండిటికీ చెడ్డ రేవణ్ణ ‘’అయి తెలుగు సామెతను కర్నాటకలోనూ రుజువు చేశాడు పాపం .
అయితే లోపల ఆశ ఉండొచ్చు .ఇది మూన్నాళ్ళ ముచ్చటే .తండ్రి కోరిక తీరుతుంది కనుక ఒట్టు తీసి గట్టున పెట్టవచ్చు .ఆ తర్వాత యేడ్డీ పిలవకా మానడు,తాను చేరకా మానడు డిప్యుటీ ఆవకా మానడు.ఇక్కడ ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేవు కదా భాయీ .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-5-18 –ఉయ్యూరు

