క్విజ్జో క్విజ్జు
1-మాటల్లోనే మరుగు దొడ్డి ?
2-బ్యాంక్ నోట్ల నూడ్చే చీపిరికట్ట ?
3 –ఎన్నికల ప్రచార సమయం లో తప్ప దేశం లో కనిపించని వాడు
4-గంగ కాలుష్యం శుద్ధి చేస్తున్నట్లు నటించే నట చక్రవర్తి ?
5-మెజార్టీ లేకపోయినా ముఖ్య మంత్రిని అందలం ఎక్కించే నేర్పున్నవాడు ?
6-చాయ్ వాలానని గుర్తు చేస్తూ ఫెళఫెళ ల డ్రస్ లో మెరిసే వాడు ?
7-తూత్తికూడి కాల్పుల్లో లో జనం చచ్చినా పట్టించుకోని దేశనేత ?
8-తమిళనాట , రాజకీయం చేయబోయి తలబొప్పికట్టినవాడు ?
9-కర్నాటక హై డ్రామా వెనుక కీలక హస్తం ?
10-శుష్కవాగ్దాన శూరుడు ?
11-సాయం అంటే’’ గుప్పెడు మట్టీ చెంబేడు జలం ‘’ అని రుజూ చేసిన మొనగాడు ?
12-ఇండియాలో ఎన్నికలైన వెంటనే నేపాల్ లో బేఫర్వాగా విహరించినవాడు ?
13- ప్రపంచం లో ఇక మిగిలిన దేశాలు చుట్టిరావటానికి కాలం చాలని ముఖ్యుడు ?
14 –దైవ సాక్షిగా పార్టీ పెద్దలను అవమానపరచి ,కులం ,మత౦ పెద్దల ఆశీస్సులకు అర్రులు చాచే ఆయన ?
15-పార్లమెంట్ అంటే బే ఫర్వా,కమిట్ మెంట్ అంటే ‘’తూనా బొడ్డు’’అంటున్న గుజరాతీ ?
16-అచ్చే దిన్ మాట ఏమోకాని ప్రజలకు ‘’చచ్చేదిన్ ‘’చూపిస్తున్న మాటలమాయగాడు ?
17- దేశం అంటే గుజరాత్ మాత్రమే నని పచ్చ కళ్ళద్దాలతో చూసే వాడు?
18-ఆధునిక కరటక దమనకులు ?
19-పార్టీ విలువకు,ప్రజాస్వామ్యానికీ అందమైన సమాధికట్టిన నేర్పరి ?
20-అవినీతి పరుడినీ ,తనలాగే మాటల మరోమాంత్రికుడినీ అక్కున చేర్చినవాడు ?
21-దిగజారుడు మాటలకు దివ్య స్వప్నమైనవాడు ?
22-వేలాది కోట్లు దేశం దాటిపోతున్నా ఫర్లేదని ఎప్పటికప్పుడు కొత్త కోటు మోజు తీర్చుకునేవాడు
23-చాయ్ వాలా ఎదగటం జీర్ణించు కోలేక పోతున్నారని ఈసడించి ,దేశ ద్రవ్యాన్ని చాయ్ లాగా తాగేస్తున్నా పట్టించుకోని కాపరి
24-గంగ శుద్ధి మాటేమో కాని అంతశ్శుద్ధి లేనివాడు అనిపించుకున్న మాటల గారడీ మనిషి ?
25- అతి వినయం ప్రకటిస్తూ అహంకారానికి ప్రతిరూపమైన వాడు ?
ఈ క్విజ్ కు అన్నీసరైన జవాబులు చెప్పినవారికి ప్రధానితో చాయ్ తాగే వీలు ,.సగం మాత్రమె రైట్ గా చెబితే అమిత్ షా తో భేటి .నాలుగోవంతు కరెక్ట్ అయితే సోము వీర్రాజుతో ’’ — పంచాంగ శ్రవణం’’ .పదోవంతు రైట్ అయితే ‘’కన్నా ‘’తో వెన్నారగింపు .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -30-5-18 –ఉయ్యూరు


తమరి బ్లాగుని చాలా సంతోషంగా చదువుతూ వస్తున్నాను. కొన్ని రాజకీయ విషయాలలో తమరి దృష్టికోణంతో నేను ఏకీభవించకపోయినా, బ్లాగులోని అనేక ఇతరవిషయాలను ఆస్వాదిస్తూ వచ్చాను.
ఈరోజు మీ “క్విజ్” పోస్టు చాలా హద్దులు దాటిపోయింది. ఒక చాయ్ వాలా పనిచేసినవాడు జీవితాంతం అదే చొక్కా భద్రం చేసి, అదే వేసుకోవాలన్నమాట! అలాగే మిగతా క్విజ్ ప్రశ్నలున్నూ.
చాలా నేలబారు/చౌకబారు/వికృత ఆలోచన ప్రతిబింబిస్తున్న పోస్టు ఇది.
తమ వయస్సుకీ, తమరు అనేక ఇతర పోస్టులలో చూపిన విశ్లేషణాత్మక సామర్ధ్యానికీ విపర్యయంగా ఉన్నదీపోస్ట్.
తమరి బ్లాగు. తమరి ఇష్టం. బ్లాగులో వ్యాఖ్య వ్రాసే అవకాశం ఉన్నదిగనుక వ్రాయగలుగుతున్నాను.
చిత్తగించగలరు.
నమస్కారములతో,
గుంటూరు శ్రీనివాస రామకృష్ణ (శర్మ)..
LikeLike
నేను రాసినదంతా బాగు బాగు అని తోకాడించే వాళ్ళకోసమే కాదు సద్విమర్శకూ స్థానం
ఉంది అందరూ అన్నీ ఆమోదించలేం .జిహ్వకో రుచి .రాజకీయాన్ని అదే దృష్టితో చూడాలి
తప్ప వేరే కోణం తొ కాదని మనవి -మీ స్పందనకు ధన్యవాదాలు -దుర్గాప్రసాద్
2018-05-30 16:56 GMT+05:30 సరసభారతి ఉయ్యూరు :
>
LikeLike