ఫ్రస్త్రేటేడ్ ఉమన్ శాడిజం గా మారిందా ?
బాలనటి గా తన సహజ నటనను ప్రదర్శించి సుమారు రెండేళ్లనుంచి ”ఫ్రేస్ట్రేటెడ్ వుమన్ ”సీరియల్ ను ఎంతో ఆకర్షణీయంగా నటించి తీస్తూ ప్రజలకు మరింత దగ్గరయింది .ఆహావభావాలు, డైలాగ్ డెలివరీ అనితర సాధ్యం అనిపిస్తాయి .తీసుకున్న సమస్యలన్నీ అర్ధవంతమై వాటిని తీసిన విధానమూ ఉత్కృష్టంగా నే ఉన్నాయి . నేను ఆమె ఫాన్ అయిపోయాను . ఎపిసోడ్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవాడిని .కానీ –
ఇటీవల అయిదారు ఎపిసోడ్ లనుండి ఆమె తన అసిస్టెంట్ ను,అడిగిన వాళ్ళనూ చావగొడుతూ భీభత్సం సృష్టిస్తోంది .చొక్కాపట్టుకోవటం ఏరా వెధవా అంటూ నీచంగా మాట్లాడుతుంటే నీచంగా జుగుప్సకలిగించేవిగా ఉండటం తో చూడాలంటేనే భయమేస్తోంది .ఒకరకంగా సాడిస్ట్ గా మారిపోయిందేమో ననిపిస్తోంది .కనుక వీక్షకుల మనోభావాలకు దెబ్బతగలకుండా ,మరింత మంచి సమస్యలపై దృష్టిపెట్టి ఆహ్లాదంగా హాయిగా నవ్వు కొనేట్లు తీయమని ఆమెను కోరుతున్నాను .గ్రాఫ్ పడిపోతే మళ్ళీ పైకి ఎక్కటం చాలాకష్టం .సమస్యలను ఎంతో బాగా తీసే సునయన మళ్ళీ మా అందరి అభిమానం సంపాదిస్తుందని కోరుతూ ఆశిస్తున్నాను -దుర్గాప్రసాద్ .
—

