8-7-18 సాహిత్యాదివారం
హైదరాబాద్ లో 8-7-18 ఆదివారం చక్కని సాహిత్యాదివారం గా గడిచింది . బహుశా కిందటి మంగళవారంఅనుకొంటా నేను ఉయ్యూరులో ఉన్నప్పుడు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుండి శ్రీమతి వాణీ కుమారి గారు ఫోన్ చేసి తాను సరసభారతి బ్లాగు ను నిత్యం చదువుతానని , అమెరికాలో షార్లెట్ లో ఉన్న మామనవాళ్లు అంటే మా అమ్మాయి చి సౌ విజ్జి అనే కోమలి విజయ లక్ష్మి సాంబావదాని కుమారులు చి ఆశుతోష్ ,పీయూష్ లకు సంగీతం నేర్పుతున్నగురువు శ్రీమతి పోతుకూచి పద్మశ్రీతలిదండ్రులు తనకు మంచి సాహితీ మిత్రులని ఎన్నో సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు కలసి హైదరాబాద్ లో నిర్వహిస్తామని తాను గుడివాడ మాంటిస్సోరి హై స్కూల్ లో పదేళ్లు పని చేసి వచ్చానని తన అమ్మమ్మగారి ఊరు అడ్డాడ దగ్గరున్న ఐనంపూడి అనీ ,తాతగారు అక్కడ కరణం అనీ ,తనభర్త శ్రీ వెంకట రమణ బందరు హిందూ హై స్కూల్ లెక్కలమాస్టారు ,భారతీయ సాహిత్య పరిషత్ మాజీ అధ్యక్షులు స్వర్గీయ రాజనాల శివరామ కృష్ణమూర్తి (ఆర్ ఎస్ కె )గారి రెండవ కుమారులని ,ఇక్కడ విద్యానగర్ లో ఉంటున్నామని ఈ నెల 28 గుడివాడలో మాంటిస్సోరి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి తనను ఆహ్వానించారని, తాను అక్కడికి వచ్చేటప్పుడు ఉయ్యూరు కూడా రావాలని అనుకొంటున్నానని రావచ్చా అనీ అడిగారు .సంతోషంగా రమ్మని ఆహ్వానం పలికాను . నేను గురువారం హైదరాబాద్అ బయల్దేరి వస్తున్నాను అంటే తమ ఇంటికి రమ్మని కోరారు నేను 5 వతేదీ రాత్రికి ఉయ్యూరులో బయల్దేరి 6 ఉదయం బాచుపల్లి మా రెండవ అబ్బాయి శర్మ ఇంటికి వెళ్లి ,7శనివారం శర్మా నేను మామనవుడు హర్ష కారులో బోయినపల్లి మా అక్కయ్యగారింటికి వెళ్లి అక్కడినుంచి ,యశోదా హాస్పిటల్ లో ఉన్న మా పెద్ద తోడల్లుడు శ్రీమూర్తిగారిని పరామర్శించి తర్వాత మల్లాపూర్ మా పెద్దబ్బాయి శాస్త్రి వాళ్ళ ఇంటికి చేరాం మధ్యాహ్నం 1-30 కి అందరం భోజనం చేసాం మా వాళ్లిద్దరూ కాసేపు విశ్రాంతి తీసుకుని బాచుపల్లి వెళ్లారు . ఇవాళ ఆదివారం నేనూ మా అబ్బాయి శాస్త్రి , కోడలు సమత విద్యానగర్ సొనాటా అపార్ట్ మెంట్ లో ఉంటున్న శ్రీమతి వీణాకుమారి గారింటికి వెళ్లాం ,. చాలా సాదరంగా ఆహ్వానించారు దంపతులు .అక్కడ ఆర్ ఎస్ కె గారి ఫోటో చూసి మహదానందపడ్డాను .ఫోటో తీశాను కెమెరాతో . మూర్తిగారి గురించి ఎన్నో ముచ్చట్లు అందరం చెప్పుకున్నాం ఆయన దగ్గర మా పెద్దమేనల్లుడు అశోక్ ,చిన్నవాడు శాస్త్రి ,మా అన్నయ్యగారి అబ్బాయి రామనాధ్ బందరులో ట్యూషన్ చదివారు .ఆయననాకు సాహితీబంధు .తాము రాసినవన్నీ నాకు చదవటానికి పంపేవారు వారు నిర్వహిస్తున్న సాందీపనిలో నాకవితాలు వేసేవారు .వారి సినీ విశ్లేషణ పరమాద్భుతంగా ,హాస్యం అండర్ కరెంట్ గా ఉండేది జాగృతి వారపత్రికలో అదే హై లైట్ . ఆర్ ఎస్ ఎస్ లో బౌద్ధిక్ గా సుప్రసిద్ధులు . జనసంఘ్ తర్వాత భారతీయ జనసంఘ్ పార్టీలకు క్రియా శీలక మార్గదర్శి . ఆయన భారతీయ సాహిత్య పరిషత్ కు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు రాజమండ్రి లో 19 94 ఫిబ్రవరిలో మూడు రోజుల సభలు రంగరంగ అవైభవంగా జరిగాయి నన్నూ మా బావమరిది ఆనంద్ నూ ఆయనే రమ్మని ఆహ్వానించారు .కప్పగంతుల మల్లికార్జునరావు గారు అనే ప్రసిద్ధ కథానికా రచయిత నిర్వహణ చేశారు .కాఫీ టిఫిన్లు భోజనాలు సౌకర్యాలు అన్నీ పెళ్లి వైభవాన్ని మించి జరిపారు అక్కడి స్థానిక కార్యకర్తలు. .డా .జివి సుబ్రహ్మణ్యం కసిరెడ్డి ,,సదాశివరావు ,తనికెళ్ళ భరణి వాకాటి పాండురంగారావు ,జానకీ జానీ గారు వంటి లబ్ధ ప్రతిష్టులను చూడగలిగే భాగ్యం కలిగింది. కవిసమ్మేళనాలు జరిగాయి కవితలకు బహుమతులు ఎంపిక చేసే బాధ్యత నాకూ మా బావమఱఁదికి అప్పగించారు మూర్తిగారు .ఎందరెందరో యువకవులు పరిచయమయ్యారు .విశ్వనాధ పై రీసెర్చ్ చేసిన శ్రీ నటరాజన్ ,శ్రీ టి రంగస్వామి లు దగ్గరయ్యారు మాకు అంతకంటే శ్రీజానకీ జానిగారు మా ఇద్దరికీ బహు దగ్గరై సభలు అయ్యాక మాతో అర్ధరాత్రిదాకా కూర్చుని సాహితీ కబుర్లు చెబుతూ విశ్వనాథవారి రామాయణ వాల్మీకి రామాయణ రహస్యాలెన్నో తెలియ జేశారు .ఈ బంధం బలవత్తరమై వారిని ఉయ్యూరు ఆహ్వానించి మా ఇంట్లోనే అప్పటికప్పుడు ఆహ్వానింపబడిన యాభై మందికి పైగా సాహిత్యాభిమానులు ఉన్న సభలో జానకీజానిగారు రెండుగంటలు వాల్మీకి, కల్పవృక్షాలపై అనర్గళంగా ప్రసంగించి మమ్మల్ని రసడోలికలో ఊగేట్లు చేశారు .మాపుస్తకాలు కాకినాడలో ఉన్న వారికి పంపితే తమవీ , తమ తండ్రి సామవేదం జానకి రామ శర్మగారి రామాయణ కావ్యాలు , అమూల్య గ్రంధాలు నాకు పంపేవారు .అదీ మా సాహితీ బంధుత్వం .కాకినాడ వెడితే నేనూ మా శ్రీమతీ మా అమ్మాయి తప్పకుండా ఆదంపతులను చూసి వచ్చేవాళ్ళం .ఇవన్నీ కుమారి గారింట్లో జ్ఞాపకం చేసుకున్నాను .రమణగారు మా మేనల్లుళ్ళతో మాట్లాడాలని ఉంది అంటే ఫోన్ లో మాట్లాడించాను . సంబరపడ్డారు ఆయన వాళ్ళూ కూడా. నేను తెచ్చిన ”షార్కెట్ మైత్రీ బంధం ”రమణ దంపతులకు అందజేశాను ఆమె తమ అమూల్య గ్రంధాలను నాకు ఇచ్చారు . మా కోడలు ఆమె పరిచయం పెంచుకొని , తన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు ఆమెను ఆహ్వానించి సత్కరించే ఆలోచన చేసింది . ఆ దంపతులు మాకు కాఫీ ఇచ్చి నాకు శాలువాకప్పి సత్కరించారు .
వీళ్ల పై అంతస్తులో మా అబ్బాయి స్నేహితుడూ క్లాస్ మేట్ పసుమర్తి శ్రీనివాస్ కిందకు వచ్చి పలకరించి వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్ళాడు .దంపతులు ఆధరంగా ఆహ్వానించి కాఫీ ఇచ్చారు వాళ్ళనాన్నగారితో మాట్లాడించాడు శ్రీనివాస్ .దంపతులు నాకు నూతనవస్త్రాలు ఇచ్చి సత్కరించారు.
అక్కడినించి శ్రీనివాస్ మా ముగ్గుర్ని నల్లకుంట లో ఉంటున్న మా అన్నయ్యగారి మనవుడు,కిందటివారం లో యాక్సిడెంట్ అయి కాలికి సర్జరీ జరిగిన రవి గాయత్రి దంపతుల ఇంటికి కారులో తీసుకు వెళ్లి దింపాడు . అక్కడ కోలుకుంటున్న రవిని పలకరించాం .పిల్లాడు చి రేయాంశ్ చలాకీగా మా అందరనీ పలకరించాడు .మా అన్నయ్యగారి అమ్మాయి వేదవల్లి జూన్ 26 న అమెరికా నుంచి వచ్చి 27 జరిగిన రవి పుట్టిన రోజు పండుగ జరిపింది తర్వాత వాడికి ఆఫీస్ నుంచి వస్తుంటే యాక్సిడెంట్ అయింది .సర్జరీ జరిగి ఇంటికి వచ్చి కోలుకుంటున్నాడు అందుకని చూడాటానికి వచ్చాము .రవి ఇంట్లోనే భోజనం చేసి మల్లాపూర్ శాస్త్రి వాళ్ళ ఇంటికి చేరాం .మొత్తం మీద ఈ ఆదివారం సద్వినియోగమైంది-
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -8-7-18 కాంప్-మల్లాపూర్ -హైదరాబాద్

