డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-5
5-వ్రత ఖండం
ఆశ్రమంలో ఒంటరిగా ఉన్న విశాల భర్త వెళ్లి చాలాకాలమైంది ,కవశ మని యజ్ఞం లో ఆయన కనిపించలేదని చాలామంది చెప్పారు .ఇల్లు వదిలి ఇన్నిరోజులు ఎప్పుడూ ఉండలేదు. దారిలో ఏదైనా ఆపత్తు జరిగిందేమో అని విచారించింది .భర్త్రు చింతనతో చిక్కి శల్యమై కస్వ మహర్షిని దర్శించి తన భర్త కోసం గాలించమని వేడింది .రెండు రొజులు ఓపిక పట్టమని ,తర్వాత వెతికిస్తానని అభయమిచ్చాడు ,రెండవ రోజు రాత్రి ధర్మమేథి అలసి సొలసి ఆశ్రమ చేరాడు .భర్తకు సపర్యలు చేసి ,కసవముని యజ్న విశేషాలడిగింది .అతడు కామాతురుడై ఆమె ప్రశ్నలకు జవాబులీయకుండా ఆమెను కౌగిలించుకొనే ప్రయత్నం చేశాడు .బిత్తర పోయిన విశాల సంధ్యాదులు, శిష్యులకు వేదాధ్యయనం వదిలేసి వ్యామోహమేమిటి అని ప్రశ్నించింది .తనకు వినే ఓర్పులేదని , తన కోరిక తీర్చాల్సిందే .ఇంఐ బలవంత పెట్టాడు .ఇంతకూ పూర్వం ఎప్పుడూ ఆయన ఇలా ప్రవర్తించలేదని అనుమానం వచ్చి ,చుట్టుప్రక్కల మునీశ్వరులను సహాయం కోసం బిగ్గరగా అరుస్తూ పిలిచింది .వాళ్ళు వచ్చి ప్రశ్నిస్తే భార్యాభర్తలమధ్య మీరెందుకు అని కసిరాడు .దీనంగా విశాల ఈ ఆపత్సమయం లో తనను ఒంటరి దాన్ని చేసి వెళ్ళవద్దని ,తనభర్త ప్రవర్తన చాలా వింతగా ఉందని ,అతడు మాయావి అయి ఉండవచ్చునని ప్రాధేయ పడింది .ఈ గలాభా అంతా విన్న కసవ ముని అక్కడకు వచ్చి భార్యాభర్తలమధ్య అన్యోన్యత ఉండాలికాని ఈ గొడవేమిటి అని విసుక్కుని ‘’అమ్మా నా ఆశ్రమానికి వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకో ‘’ ‘’అని హితవు చెప్పాడు .ఈ మాటలకు మాయా ధర్మమేథి ‘’నా భార్యను లాక్కెళ్ళిఅనుభవించాలని చూస్తున్నావా దొంగ మునీ ‘’అంటూ ఆయన్ను తోసేస్తే ,ఆయన నేలపై పడ్డాడు .ఇంతలో పూర్వం విశాలను కాపాడిన వానరం ,భల్లూకంతో అకస్మాత్తుగా వచ్చివాడి రొమ్ము మీద గుద్దింది .అ దెబ్బకు మాయావి రక్తం కక్కుకోగా వాడి కాళ్ళు పట్టుకొని దూరంగా విసిరేయగా వాడు చచ్చాడు .
ఇప్పుడు అందరికీ ఒకటే ప్రశ్న .అసలు ధర్మమేథి ఎమైనాడు ? ఎక్కడున్నాడు ?మాయా రాక్షసులు తమను ఇప్పటికే చాలావిధాలుగా భాధించారు .ఇక ఉపేక్ష పనికి రాదు కనుక కస్వ ముని ని’’హనుమద్ర్వత౦ వెంటనే చేయమని ప్రార్ధించారు .అప్పుడాయన లేడికిలేచిందే పయనం అన్నట్లు కార్యక్రమాలు చేయరాదు .ముందూ వెనుకలు ఆలోచించాలి .దుస్ట శక్తులు విఘ్నం చేసే ప్రయత్నాలు చేస్తాయి .వాటిని తట్టుకుంటూ నిర్విఘ్నంగా ,శాస్త్రీయంగా చేద్దాం అన్నాడు. అందరూ సంతోషంతో అంగీకరించారు .
విశాలమైన పందిళ్ళు , అవసరమైన హోమ గుండాలు ,కావాల్సిన సామగ్రి సిద్ధం చేశారు . బ్రహ్మ స్థానం లో కస్వ ముని కూర్చుని , విష్వక్సేనాది పూజలు చేసి ,ఆంజనేయ మంత్రాలతో ఆహుతులనువ్రేల్చుతూ ఏడు అహోరాత్రాలు ఆంజనేయ యజ్ఞం చేశారు .ప్రీతి చెందిన స్వామి ప్రశా౦తవదనంతో ప్రత్యక్షమవగా మహర్షులు దివ్య స్తోత్రాలతో ఆయనను ప్రసన్నంచేసుకొన్నారు .వారికి విఘ్నాలు కలిగించే పోకిరి మూకలను ఇక ఉపేక్షించనని అభయమిచ్చాడు .విశాల వచ్చి స్వామి పాదాలపై వ్రాలి భర్త విషయం రోదిస్తూ,భర్త లేకుండా తాను జీవించటం దుర్లభమని చెప్పింది .ఉన్నట్టుండి మారుతి అదృశ్యమయాడు .ఆశ్రమం లోపలి నుంచి ధర్మమేథి అకస్మాత్తుగా బయటకు వచ్చి కస్వముని పాదాలకు నమస్కరించి భార్యను సమాదరించి శిష్యులను వాత్సల్యంగా పలకరించాడు .తాను కిరాతుల చెరసాలలో ఉండగా ఆ రోజు ఉదయం ఒక వానరవీరుడు వచ్చి చెరసాలను నుగ్గు నుగ్గు చేసి ,తనను విసరి వేయగా తాను ఆశ్రమ లో వచ్చి పడ్డాను అని వివరించి చెప్పాడు .కస్వర్షి ఇక్కడ జరిగిన హనుమద్వ్రత విశేషాలు వివరించాడు తనకు. ఇక్కడ హనుమ దర్శనం కానందుకు బాధపడి స్వామిని తనకు వెంటనే ప్రత్యక్షమై తనస్తోత్రాలను స్వీకరించమని వేడుకొని ఒక్కసారిగా అక్కడి అగ్ని గుండం లో దూకేప్రయత్నం చేయగా అందరూ కంగారు పడుతుండగా హనుమ ప్రత్యక్షమై ఆపి, ఆ రాక్షసుని వృత్తాంతం చెప్పటం మొదలుపెట్టాడు .
సశేషం
దక్షిణాయన శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-7-18 –ఉయ్యూరు
—

