విజయావారి సాంఘిక మాయాబజార్ -గుండమ్మకథ
నమస్తేసత్య ప్రకాష్ గారు -నిన్న రాత్రి ఎందుకో పై శీర్షిక మనసులో మెదిలింది .దాన్ని పూర్తి వ్యాసంగా మలచే సాహసం చేయలేను .ఉప్పు అందిస్తాను దాన్ని చక్కని చిక్కని వ్యాసాన్ని ఆలోచనాత్మకంగా విమర్శనాత్మకం గా తులనాత్మకంగా పరిశీలించి మీరే రాయ గల సమర్ధులని మీకు పంపుతున్నాను వీలు వెంట దీని పని పట్టండి .
1-రెండూ విజయావారి చిత్రాలే -రెండిటి సంగీత దర్శకుడు ఘ0టసాలగారే .దాదాపు అన్నిపాటలూ పాడిందీ ఆయనే .
2- మాయాబజార్ కి కెవి రెడ్డి ,గుండమ్మకు కమలాకర దర్శకులు . ఇద్దరి దృక్పధమూ ఒకే మాదిరే .ఇద్దరిదీ కళా దృష్టే . సరస హాస్యం మేళవింపే అనుపానమే .
3- నటీ నటులూ రెండితోనూ దాదాపు సమానమే . కెమెరా రెండిటికీ మార్కస్ బార్ట్లీ అనే అనుకొంటాను .
4- బజార్ లో శకుని పాత్ర సీఎస్ ఆర్ .అయితే ఇందులో రమణారెడ్డి పాత్ర అలాంటి దే .
5-సూర్యకాంతం అందులో కొడుకును తీర్చి దిద్దే పాత్ర .ఇందులో కూతురు కూచి కి వత్తాసు
6-దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మాయాబజార్ కష్ణ పాత్ర .ఇందులో గయ్యాళి మనసు మార్చి నాన్న స్నేహితుడి కుటుంబాన్ని ఆదు కోవటం రామారావు నాగేశ్వరరావు ల పాత్రలు
7-ఘంటయ్యకు చెక్ పెడుతూ కద గుండమ్మలో సాగితే ”దుశత చతుషటయ”దుర్మార్గాలకు చెక్ పెట్టటం ,కద రసకందాయం లో నడిపించటం రమణారెడ్డే అండ్ కో పని .
8- రెండిటిలో అడుగడుక్కూ కమ్మని వీనుల విందైన పాటలూ నేపధ్యస్సంగీతమూనూ
9- రెండిటి కవీ మహాకవి పింగళి . రసగుళికలాంటి మాటలు పాటలతో ఆద్యంతం రసన్మా ధుర్యంగా ఉన్నాయి
10-ఛాయాదేవి అందులో శశిరేఖ తల్లి అయినా కల్లా కపటం లేనట్లే చాలా భాగం కనిపిస్తుంది .భర్త బలరాముని కి ఎదురు చెప్పలేని స్థితి .కాదని ముందుకు అడుగు వేయలేని ది .ఆమె నడకా,నడ తా హాస్ప స్ఫోరకమే .గుండమ్మలో గుండమ్మ కు దీటైన గయ్యాళి, ఇంటిదొంగ కూడా
11-బజారు లో పంచపాండవుల ఇతివృత్తమే అయినా సీన్ లోకి రారు . గుండమ్మలో అన్న దమ్ములిద్దరే కద నడిపించి తండ్రి పెద్దరికం నిలబెట్టి ఇచ్చినమాట నిలబెట్టుకున్న కొడుకులయ్యారు
ఇవి సార్ నాకు వచ్చిన భావాలు .వీటిని బేస్ చేసుకొని కానీ, మీ స్వతంత్రంగా కానీ నా శీర్షికతో మీరు ఆర్టికల్ రాయమని మనవి – ఈయనేమిటి నామీద రుద్ద ట మేమిటి అని అనిపిస్తే దీనికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెడదాం -దుర్గాప్రసాద్ -18-1-19-ఉయ్యూరు
మళ్ళీ ఈ రోజు 20-5-19ఉయ్యూరు
—

