12-సర్వజ్ఞ పద్మనాయక భూపాలుడు
అత్తాను రామానుజా చార్యుని ;;శ్రీ రుక్మిణి కురవంజి ‘’తాళపత్ర గ్రంధం లోనే సర్వజ్ఞ పద్మనాయక భూపాలుని ‘’సారంగధర చరిత్ర –యక్షగానం ‘’కూడా ఉందట .కులం ,పదవులు , బిరుదాలు మాత్రమె కావ్యం లో ఉన్నాయి.సర్వజ్న బిరుదు ఇద్దరు ముగ్గురులకు ఉంది .చాలాశిధిలంగా ఉన్న గ్రంధం చదవటానికి ఇబ్బంది గా ఉందని బిరుదరాజు గారువాచ .కంట్లో వత్తులు వేసుకొని ప్రతి అక్షరాన్నీ కొన్ని వారాలు చదివారట రాజుగారు .ఇక్కడ మనకు వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాధసూరి పడిన కస్టాలు గుర్తుకొస్తాయి .ఆయన కంటి రెప్పలకు దారాలు వాటికి చివర రాళ్ళు కట్టుకొని సంస్కృతకావ్య వ్యాఖ్యానం రాశాడు చివరి రోజుల్లో.
ఆటతాలం లో –శ్రీ విభుని బూజించి వాక్పతి ——యెపుడు-నవని పార్వతీశ్వరు ప్రస్తుతి౦తున్
విఘ్న రాజుకు మొక్కి —-వాగ్వితతి నిర్విఘ్నముగ శ్రీ యక్ష —వేడుకొందున్’’
వ్యాసభట్టార్యు వాల్మీకి మదిని గొలిచి –ఆశుగ బ్రహ్మాది మునులకు నా౦జనేయు
పూని దత్తిలచరన కోహల క్రుంగవాజి ల –గాన శాస్త్ర ప్రబంధ కర్తల కరుణ వడసి
తివిరి బాణమయూరుల చిత్తమున నిలిపి తక్కిన కవి వరేణ్యుల కెల్ల’’
తర్వాత ద్విపదల పేరిటఉన్న పంక్తులున్నాయి .తర్వాత వచనం ఉన్నది –ధనకనక వస్తు వాహన సమృద్ధి వడసి —నిత్యమై విజయలక్ష్మి గలిగి —-లక్ష్మి పరిపూర్ణమై ‘’
కవి తాను ‘’కాచమ దేవి గారాల సుతుడను ‘’అని చెప్పుకొన్నాడు .గురువుఆచార్య మణి భట్టరు ,కోరుకొండకు చెందిన పరాశరభాట్టరే మణిభట్టరు అంటారు రాజుగారు .శ్రీశైలానికి ఉత్తరానున్న ఉమామహేశ్వరమే కవి చెప్పిన ఉమాచలం అన్నారు .
తలవరులమాటలను ఉత్కళికలో రాశాడు –‘’ఉభయకుల పావనుడగా ఉద్భవించి –పరగిన శుభ గుణోజ్వల సజ్జనుడ రాసుతుడ—అయ్య ఇదిగోరాజు మనసు లరసి చూసి –పోయిరి చయ్యనను పయనంబుగావలె సజ్జనుడా ‘’
ఇది యక్షగానం అవునోకాదో, కవి సర్వజ్ఞుడు రేచర్ల వంశంవాడో కాదో ఇంకా తేలాల్సిన విషయం అన్నారు బిరుదరాజు వారు .ఇంత శ్రమపడి ఈ కృతి విషయాన్ని లోకానికి అందించిన ఆచార్య బిరుదరాజువారికి తెలుగుజాతి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలదు ?
ఆధారం – ఆధారం -.–ఆచార్య బిరుదరాజు రామరాజుగారి ‘’చరిత్ర కెక్కని చరితార్ధులు ‘’-(విస్మృత కవులు –కృతులు )
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-5-19-ఉయ్యూరు
—
| I’m protected online with Avast Free Antivirus. Get it here — it’s free forever. |

