19-పాల్కురికి సోమనాథుని ‘’మల్లికార్జున పండితారాద్యోదాహరణకావ్యం ‘’
పాల్కురికి సోమనాధుడు ‘’ఉదాహరణ యుగ్మం ‘’రచించాడని పిడుపర్తి సోమనాథుడు చెప్పాడు .సోమన ఉదాహరణ కావ్యం అంటే ‘’బసవ ఉదాహరణ కావ్యమే’’ అని అందరికి తెలుసు .కానీ బిరుదురాజు వారికి కరీం నగర మండలం లో ఒక తాళపత్ర గ్రంథం లభించిందని ,దానిలో సోమనాథ భాష్యం తోపాటు చాలా లఘు కృతులున్నాయని అందులో పండితా రాధ్య ఉదాహరణం ఒకటని రాజు గారు చెప్పారు .రాజుగారు చెప్పేదాకా అలంటి ఉదాహరణ కావ్యం ఉందని ఎవరూ చెప్పలేదట .వ్రాయసకాడు రాసిన తేది 3-5-532అని తేల్చారు .
శ్లోకం –అద్వైతోద్ధత కుంభి కుంభ దళనోద్యద్రౌద్ర పంచాననో –గర్వోదంచిత పాంచరాత్ర నిబిడ ప్రాలేయ చండ ద్యుతిః
పాషండాబ్జ మహాగజో విజయతే బౌద్ధాద్రి ఘొరాశనిః-శ్రీమత్పండిత మల్లికార్జున గురుర్వి ద్వాత్సదాపూజితః’’
‘’పండితారాధ్య నామేతి పంచాక్షర సముద్భవం –సకృత్ స్మర౦తి ఏ భక్తా స్తేజనాః పుణ్య కారిణాః’’
మాలిని –‘’శివకర శివ సౌఖ్యా శిష్ట భక్త్యైక ముఖ్యాః-వివిధ పరమ శీలా ,వేద శాస్త్రానుపాలాః
ప్రవిమల పరభావా ,పండితారాధ్య దేవా –తవిలి మిము భజింతున్ దద్దయు౦ బ్రస్తుతింతు ‘’
ప్రధమా విభక్తి పద్యం –శా –శ్రీమత్పండిత మల్లికార్జునుడు వైశిస్ట్యోల్ల సచ్చర్యుడు –డుద్దామ ప్రోద్ధత వీరభక్తి నిధి ,నిత్యశ్లోకు డుద్యన్ముని
స్తోమ స్తోత్రుడ గణ్యపుణ్యుడతి తేజో రాశి ,సంయగ్దయా –దాముం డీవుతమాకు భక్తియు ,ప్రసాదార్ధక్రియా సక్తియున్ .
కళిక – ‘’మరి శుద్ధమార్గమందు ,శైవమార్గ మండనుండు –తురువణి౦చు భవ దుర్గ ఖండనుండు
చిరతర ప్రణవసిద్ధమా౦త్రికుండు –పరమభక్తివిని బద్ధ తా౦త్రి కుండు-మునిగణప్రచయ ముఖ్య వందితుడు
జనిత చిన్మయ సుసౌఖ్య వందితుడు –అలఘు సంచిత శివైక్య భావనుండు –ఎలమి సర్వ జగదేకపావనుడు .’’
ఉత్కళిక –‘’తనవిభుత్వమును –ఘనమహత్వమును –ధరణి ని౦పుమని –హరుడు పంప బని
వడసి చెన్నమఠ-నొడలు గొన్న పర –మము దయా తనుడు –దమిత యాతనుడు
ఇలాగేసప్తమీ విభక్తిదాకా పద్యాలు చెప్పి సంబోధన ప్రధామావిభక్తిలోనూ చెప్పాడు చివరగా రాసిన ,సార్వవిభక్తికం లోని రెండు శార్దూల పద్యాలు-
, —
ఆధారం -.–ఆచార్య బిరుదరాజు రామరాజుగారి ‘’చరిత్ర కెక్కని చరితార్ధులు ‘’-(విస్మృత కవులు –కృతులు )
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-5-19-ఉయ్యూరు

