ఆంధ్రా లో త్వరలో బిజెపి ప్రభుత్వం వస్తుందా ?
అవును వస్తుందనే అనిపిస్తోంది .కర్ణాటకలో బిజెపి చేయని మాయప్రయత్నాలు లేవు అప్పుడు .అప్పుడే నేను చెప్పాను చంద్రబాబుపై పడతారని అస్థిరతకల్గించి పరాజయానికి పావులు కలుపుతారని .కాషాయం’’ కషాయం’’ ఆంధ్రాలో పని చేయదని పూర్తిగా అర్ధమైన షా మోడీలు జగన్ ను దువ్వి ,పవన్ ను ప్రేరేపించి బాబుపై దాడి చేయించారు .వేలాది కోట్లరూపాయలు మంచినీళ్ళుగా ప్రవహించాయని చేతులు మారాయని మీడియా కొడైకూసింది . ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది .జగన్ పై ఉన్న కేసులు బాగా కలిసివచ్చాయి ద్వయానికి .కాళ్ళమీద పడేట్లు చేసుకొన్నారు .అభయ హస్తమిచ్చారు . ప్రత్యేకహోదాఇస్తామని శపథం చేసి ఎన్నో సార్లు దేవుడిగుడి వద్ద చెప్పి చివరికి పాకేజీ ఇస్తాం తీసుకో లేకపోతె మానుకో మని భీష్మించి దొంగ దెబ్బతీశారు .బాబు ఒప్పుకోక ఎదురుతిరిగితే ‘’యు టర్న్ ‘’అని పేరుపెట్టి గేలి చేశారు .వీధిపోరాటం శరణ్యమైంది బాబుకు .దీనితో సంస్థాగత వ్యవహారాలపై శ్రద్ధపెట్ట నీకుండా చేయగలిగారు .జగన్ తో లోక సభ సభ్యులతో రాజీనామా చేయించి సానుభూతి పొందేట్లు చేశారు . బాబు పోలవరం నిర్మించటం కంటగింపుగా మారింది గుజరాత్ లో సాధ్యంకానిది ఆంధ్రాలో బాబు ఎలా చేశాడా అని అసూయపడ్డారు .అన్నిరకాల ఆర్దిక సాయాన్ని బంద్చేశారు లేకపొతే ఏదో విదిల్చినట్లు రాల్చారు .ఇదికాక ‘’సన్ స్ట్రోక్ ‘’అని కొడుకు గురించి ఎద్దీవా ఒకటి .ఇన్ని తట్టుకొని తన 25 ఏళ్ళ విజన్ సార్ధకం చేయటానికి అవిశ్రాంత కృషి చేశాడు .కానీ కాలమూ కలిసిరాలేదు .
బాబు మంచోడే మంత్రులుఅవినీతిపరులు ,బడుద్ధాయిలు అనే అభియోగామూ పెరిగింది .పార్లమెంట్ లలో అరచినా గొంతు చి౦చుకొన్నా ,కనికారమే లేకపోయింది ఆంధ్రాపై .ఒంటరిపోరాటమే అయింది .ప్రతిపక్షాలు ఏదో మద్దతు ఇచ్చినా ,ఎప్పుడు ఎవరు ఎవరికి జైకోడతారో తెలీని వింతస్థితి. పాపం రాహుల్ సోనియా పాతవైరాలకు స్వస్తి చెప్పి బాసటగా నిలిచారు .ఇదికొంత ఊరట .కానీ ఎన్నికలలో కాంగ్రెస్ తో పొత్తుఅసలుకే మోసం అని తెలిసి ,పవన్ ని కోరినా చెయ్యిచ్చాడు .కమ్మీలు ఆత్మార్పణ లో పడి బెంగాల్ను కమలానికి ధారాదత్తం చేశారు .దాక్షిణాన తమిళనాడులో స్టాలిన్ ముందు పప్పులుడకలేదు .కేరళలో పినరాయ్ ముందూ అదే పరిస్థితి .ఆంధ్రాలో కన్నా అండ్ పార్టీలు స్వాహా స్వాములేకానీ వోట్ కాచర్స్ కాదు అని తెలిసినా వాళ్ళనే నమ్మాల్సి వచ్చింది కమల దళం .
ఆంధ్రాలో బాబు ఉండగా ఏమీ చేయలేము కనుక జగన్ ను కేసుల విషయం లో బెరిరించి అదలించి అంటకాగేట్లు చేసుకొన్నారు .బలహీనమైన కాండి డేట్లను పెట్టి జగన్ కు సాయపడ్డారు .జగన్ తప్ప ఆంధ్రాలో వేరెవరికీ అవకాశం లేదని తేల్చుకొన్నారు .కనుక పదేళ్ళ జగన్ కోరిక తీర్చటానికి తెరవెనుక చెయ్యాల్సింది అంతా పకడ్బందీ గా చేశారు .తెలుగు దేశం నాయకులపై ఐటి ,ఇడిదాడులు చేయించి డబ్బు ఆడని పరి స్థితి కల్పించి గిలగిలా గిజగిజా కొట్టుకోనేట్లుచేశారు .ఆంద్ర దేశ చరిత్రలో జగన్ కు చారిత్రాత్మక విజయం చేకూర్చిపెట్టారు .ఇందులో తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు పవన్ ఉడతసాయం చేశాడు .ఓట్లు చీల్చి జగన్ గెలుపుకు కారణమయ్యాడు .జగన్ పార్టీ కొచ్చిన మెజారిటి కంటే పవన్ కొచ్చిన వోట్లు ఎక్కువని ఇవాళ పేపర్లు రాశాయి .ఇలా కసితీర్చుకొన్నాడు గడ్డమాయన బాబుపై .
నాలుగు రోజుల్లో జగన్ ప్రభుత్వం ఏర్పడుతుంది .హామీ ఇచ్చిన నవ రత్నాలకు నిధులు కేంద్రం ఇస్తుందా ?కేసులున్న జగన్ ధైర్యంగా అడిగి సాధించగాలడా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న .బాబును అప్పుడు ఊరిన్చినట్లే ఇప్పుడు జగన్ నుకూడా ఊపుతారు .బాబు మొండివాడుకనుక లొంగలేదు .ఇక్కడ అన్నీ లొసుగులే .అడగలేడు అడక్కుండా ఉండనూ లేడు.ఎన్నికలము౦దు లాగా లొంగి ఉండాల్సిందే .తప్పదు .లేదంటే ‘’కేసులబూచి ‘’చూపి అడక్కుండా చేస్తారు ద్వయం .చివరికి శాసన సభ్యులను ప్రలోభాలతో ,ప్రమోదాలతో భారీసంఖ్యలో చీల్చి ,ఆంధ్రాలో బిజెపి ప్రభుత్వం ఏర్పరచి పంతం నేరవేర్చుకొంటారు .ఆంధ్రా వశమైతే హార్ట్ ఆఫ్ దిలాండ్ చేతికిచిక్కినట్లే .ఇప్పటికే భారత దేశం లో కేరళ ఆంధ్రా తమిళనాడులో తప్ప అన్ని చోట్లా కాషాయం రెపరెపలాడుతోంది .ఆంధ్రాలో నూ ఎగరేస్తే ఇక ఎదురుండదు . ఆ మజాయే వేరు .దీనికి జగన్ సాయమూ చేయచ్చు లేకపోతె సామ దాన భేద దండోపాయాలు ఉండనే ఉన్నాయికదా మారాజా . షా తలచుకొంటే అపర చణక్యుడౌతాడు .ఎదిరించినవాడిని మట్టి కరిపిస్తాడు .అప్పుడు జగన్ కు అండగా ఉన్న’’ పీకే ‘’కూడా ఏమీ పీకలేడు .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-5-19-ఉయ్యూరు
—

