29-5-19బుధవారం శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా శుభాకాంక్షలు
సీ-‘’ఏ మహాసత్వుండు రామకార్యంబున గిరులెల్ల నచ్చన గిల్ల లాడె-ఏ బలప్రఖ్యాతు డేడు వారాసులు కాల్వల రీతి లంఘనము జేసె
ఏ సింహ విక్రము౦ డెలమి రక్షః కు౦జరాలి నీగల రీతి నణచి పుచ్చె-
ఏమహా సమకాయు డింద్రారి ఖండించు వేళతారలు కటి వ్రేల బెరగె
దారగిరి చాలన క్రియా దక్ష శక్తి –పాత సౌమిత్రి జీవమే ప్రభుడొసంగె
నట్టి గుణవంతు ధీమంతు ,నదిక శాంతు –ప్రకట జయవంతు హనుమంతు బ్రస్తుతింతు’’
ఈ పద్యాన్నిపింగళి సూరన తరువాతికాలంవాడైన ” ఏదుట్ల శేషాచాలుడు” అనేకవి ”జగన్నాటకం ”అనే కావ్యం లో రాశాడు –
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -26-5-19-ఉయ్యూరు
—
