గీర్వాణకవుల కవితా గీర్వాణం-4
471-పేర్లు మాత్రమే తెలిసిన 6గురు సంస్కృత కవయిత్రులు (1004కు పూర్వం )
1004-1016కాలం లో పాలించిన రాజేంద్ర చోలుడికి సమకాలికుడైన రాజశేఖరుని ‘’రాజశేఖర చరిత్ర ‘’లో చోటు చేసుకొన్న 6గురు సంస్కృత కవయిత్రులపేర్లు మాత్రమే తెలిశాయికాని వారి గురించి వివరాలు రచనలు లభించలేదు .వీరంతా 1004 కు పూర్వం వారై ఉండాలి .వారే -1-కామలీల 2కనకవల్లి 3-లలితాంగి 4-మధురాంగి 5-సునంద 6-విమలాంగి .వీరిలో లలితాంగి విమలాంగి ,మధురా౦గి లు మాత్రం మాళవ దేశానికి చెందినవారని తెలుస్తోంది .
472-ప్రభు దేవిలాటి(880కుపూర్వం )
క్రీశ 880-920కాలం వాడైన రాజ శేఖరుడు ‘’ప్రభు దేవిలాటి ‘’గురించి పేర్కొన్నాడు .ఈమె లాట దేశానికి చెందినది. ఆమెకున్న బహుముఖ ప్రజ్ఞను ఆకాలం లో అందరూ మెచ్చుకొన్నారు .తన రసరమ్యకవిత్వంద్వారా ప్రజల గుండెల్లో చిరంజీవిగా నిలిచింది .ప్రేమకవిత్వంలోనేకాక న్ని రకాల కళలలోనిష్ణాతురాలు .
‘’సూక్తీనాం స్మరకేలీనాం కలానాంచవిలాసభు –ప్రభుదేవీ కవి ర్లాటీ గతాపి హృది తిస్టతి’’
473-వైజయంతి (17వ శతాబ్దం )
జయ౦తిగా కూడా పిలువబడిన వైజయంతి 17వ శతాబ్దం లో ఫరీద్ పూర్ నివాసిని .మూరభట్ట కూతురు .సంస్కృత విద్వా౦సురాలేకాక మీమా౦సశాస్త్రం లో అద్వితీయురాలు .సంస్కృత మహా విద్వాంసుడైన కృష్ణనాధుని భార్య .ఈమె రాసినట్లుగా చెప్పబడే శ్లోకాలు చాలా ఉన్నాయి .భర్తతో కలిసి ‘’ఆనంద లతిక చంపు ‘’రాసింది .కాని అలభ్యం .
1-‘’ఆహిరయం కల ధౌత గిరభ్రమాత్ –స్తనమగాత్ కిలనాభి హృదోత్సితః
ఇతి నివేదయితుం నయనేహి యత్ –శ్రవరా శ్రీమణీ కిం సముపస్తితే ‘’
2-‘’వహ్ని కోరాగతేభానుః శీతాత్ సాక్కచితం దినం –వైశ్వానరో నరక్రోడే రాజాన్ శీతస్య కా కధా
3-‘’ఆనంద లతికా చంపూర్యేనాకారి స్త్రియా సహ-
474-విజయా౦క (10వ శతాబ్ది పూర్వం )
కర్నాటకకు చెందిన’’ విజయాంక’’10వ శతాబ్దికి పూర్వం ఉండేది ఈమె శ్లోకాలు రాజశేఖర చరిత్రలో ఉన్నాయి .ఈమెను సరస్వతీదేవి అపర అవతారమని భావించేవారు .వైదర్భి శైలిలో ఆమెకవిత్వం కాళిదాసునుమరపిస్తుంది
‘’సరస్వతీ కర్నాటీ విజయాఖ్యా జయత్యసౌ –యా వైదర్భః గిరాం వాసుః కాళిలిదాసానంతరం ‘’
-ఆధునిక సంస్కృత కవయిత్రులు
475-అనసూయా కమలాబాయి బాపట్ (
మరాఠాకు చెందిన అనసూయా కమలాబాయి బాపట్ ‘’శ్రీ దత్త పంచామృతం ‘’అనే దత్తాత్రేయ నిత్య పూజా విధానాన్ని రాసింది .మొదటి రెండు అధ్యాయాలు ఆమె స్వయంగా సృజించి రాసినవే .మిగిలినవి వివిధగ్రంథాలనుంది సేకరించినవి
476-బాలాంబిక
సిస్టర్ బి.బాలంబాళ్ మద్రాస్ ప్రెసిడెన్సిలో డా.వైద్యనాధ శాస్త్రి కుమార్తె .తల్లి సంస్కృత విద్వాంసురాలు .తల్లివద్ద సంస్కృతం నేర్చింది .సంస్కృతం లో 1-‘’సుబోధ రామ చరిత ‘’,2-ఆర్యరామాయణ3-గానకదంబ4-దేవీ త్రయత్రి౦శ న్మాల రాసింది .ఆమె కవిత్వం సరళసుందరం .
సుబోధ రామ చరిత లో కవిత్వం
‘’కున్జరవదన కువలయనయన –కురు పరసుఖమనిశం మే –
చంచల శ్రవో౦జిల ప౦చికరంజిత ,పున్జితకరుణా-భంజిత ప్రత్యహ-అంచిత గతి యుత -వంచిత దురిత – రంజిత శ్రితజన –భంజితవరగా
477-వెన్నెలకంటి హనుమా౦బ
నెల్లూరుకు చెందిన వెన్నెలకంటి హనుమాంబ శ్రీ బ్రహ్మానంద సరస్వతి స్వామిశిష్యురాలు .భక్తితో ‘’బ్రహ్మానంద సరస్వతి స్వామి పాదుకా పూజన ‘’రాసింది .శ్లోకాలు వచనం ప్రయోగం పధ్ధతి కలిసిఉంటాయి .ఇదేకాక ‘’శంకర భగవత్ పాద పూజ’కూడా రాసింది .ఇందులో ఆదిశంకరాచార్యుల వివిధ గుణ, సాధన, విశేషాలను సహస్రనామావళి గా కూర్చింది .మరొకటి ‘’దత్తపూజాకదంబం ‘’దత్తాత్రేయస్వామిపై రచించిన కీర్తనలకదంబ మాలిక ఇది.
ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-6-19-ఉయ్యూరు

