Monthly Archives: July 2019

భువి నుంచి దివికి పాకిన ‘’జూకామల్లి

భువి నుంచి దివికి పాకిన ‘’జూకామల్లి  ఎత్తైన విగ్రహం  ,అంతే ఎత్తైన సాహితీ మూర్తిమత్వం ,నల్లని పలుచని శరీరం ,చిన్న కళ్ళు అయినా కాటుక రేఖలతో పొందిన  కాంతిమత్వం ,చేతులకు గాజులు ,తలలో పూలు ,నుదుట బొట్టు ,ముదురు రంగు పట్టు చీర ,దానికి తగిన జాకెట్టు ,కోలముఖం ,నవ్వు తూ ఉండే పలువరస ,సాంప్రదాయ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -5(చివరి భాగం )

ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -5(చివరి భాగం ) ఉగ్రవాదం భయోత్పాతం ‘’టెర్రరిజం టెర్రరైజ్ ‘’చేస్తుంది .అంటే భయోత్పాతాన్ని కలిగిస్తుంది .ధనిక ,పేద దేశాలలో కూడా అది ఒక వృత్తిగా మారింది .నిరుద్యోగులకు ,అసంతృప్త ధనిక ,బీద వ్యక్తులకు ,గుంపులకు ,దేశాలకు కూడా అకస్మాత్తుగా అధికారం పొందాలనే ఆరాటమే దీనికి ముఖ్య కారణం .అది తక్షణమే … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -3

ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -3             గాంధి వ్యూహం ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటానికి గాంధీజీ వ్యూహం లో ఉన్న అంశాలు .ముందుగా హింసా కార్యాన్ని ఆదిలోనే తు౦చేయాలి .దీనికి చేసే ప్రయత్నం శక్తివంతంగా పూర్తిగా అహింసా పద్ధతిలోనే ఉండాలి .హింసను ఆపటానికి భౌతిక నియంత్రణ  బలమైన శక్తి తో చేయాలి .రెండవది భయ పెట్టట౦ ,వినాశనం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -3

 ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -3 ఘర్షణ పై గాంధీ అభిప్రాయం ఘర్శణపై గాంధీ జీ అభిప్రాయం’’Emphathy ‘’దృష్టి గా ఉంటుంది .ఇరుపక్షాలవారు కనీసం కొంతైనా ఒప్పుకోవాలి అప్పుడే పరిష్కారం సాధ్యం .ఎదిరిపక్షం దాన్ని’’ కేరే ఝాట్’’ కింద భావిస్తుందని ఆయన గుర్తించాడు .క్విట్ ఇండియా ఉద్యమం లో ‘’బ్రిటిషర్ లకు నిజంగా ఉండాల్సిన స్థానం బ్రిటన్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సాహితీవేత్త ,స్నేహశీలి ,భేషజం లేని వ్యక్తి ,వ్యక్తిత్వమే ఆభరణంగా ఉన్న శ్రీమతి కె బి లక్ష్మి (70)హఠాన్మరణం

నాకు అత్యంత సాహితీ ఆప్తురాలు ,ఒకరకంగా నా ఫాన్ ,నేనూ ఆమె మాట రచనలకు ఫిదా అయ్యే అభిమానిని ..మే 6 గుడివాడలో ”దుర్గాప్రసాద్ గారు ఉయ్యూరులో నాకు సరసభారతి సన్మానం చేయలేదు ”అని అలకగా బుల్లి మూతి పెట్టి , జులై 14 హైదరాబాద్ త్యాగరాజ గాన సభలో నా కు కళా సుబ్బారావు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -2

ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -2            హింద్ స్వరాజ్   కొన్ని వారాల తర్వాత గాంధీ ,మళ్ళీ దక్షిణాఫ్రికా వెళ్ళటానికి స్టీం షిప్ ఎక్కినప్పుడు  మరలా ఈ విషయాలపై ఆలోచనలో పడ్డాడు .వాటిని రాసి  బుక్ లెట్ గా లండన్ లోని జాతీయ వాదులకు పంపాడు .ప్రాధమికంగా ఈ వ్యాసాన్ని గాంధీ మొదటి సారిగా  ఒకే … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఉగ్రవాదం పై గాంధీ ధోరణి

ఉగ్రవాదం పై గాంధీ ధోరణి   మహాత్మాగాంధీ ఉగ్రవాదాన్ని  ఈషణ్మాత్రం కూడా సహించలేదు .హింస పై ఏనాడూ రాజీ పడలేదు .ఉగ్రవాదులు గా చిత్రి౦పబడిన సర్దార్ భగత్ సింగ్ వంటి వారిని కాపాడటానికి విశ్వప్రయత్నమే చేశాడు .అలా  ఎందుకు చేశాడు ?అనేది పెద్ద ప్రశ్న .తాను  చెప్పేదానికీ, అనుసరించేదానికి తేడా ఉందా ?ఆయన వివాదాల ,వైరుధ్యాల … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

వివిధ రంగాలలో ప్రసిద్ధులైన పదిమంది ప్రముఖుల మరణానికి సరసభారతి శ్రద్ధాంజలి

వివిధ రంగాలలో ప్రసిద్ధులైన పదిమంది ప్రముఖుల మరణానికి సరసభారతి శ్రద్ధాంజలి సుమారు  నెలన్నర  కాలం లో మరణించిన 10మంది ప్రముఖులకు  శ్రద్ధాంజలి గా  సరసభారతి 143 వ కార్యక్రమ౦ స్థానిక శాఖా గ్రంధాలయం లో 27-7-19 శనివారం సాయంత్రం 5-30 గంటలకు  నా అధ్యక్షతన జరిగింది .డా దీవి చిన్మయ ,అమరవాణి హైస్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ పివి నాగరాజు … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

అష్టావధాని ,ప్రజ్ఞానిధి కవి బ్రహ్మ శ్రీ పూసపాటి నాగేశ్వరావు

అష్టావధాని  ,ప్రజ్ఞానిధి కవి బ్రహ్మ శ్రీ పూసపాటి నాగేశ్వరావు గుంటూరు జిల్లా రావెల గ్రామం లో 27-6-1920న జన్మించిన శ్రీ పూసపాటి నాగేశ్వర రావు తలిదండ్రులు శ్రీమతి వెంకట నరసమ్మ ,,శ్రీ బ్రహ్మయ్య .రావెల గ్రామం కవి బ్రహ్మ తిక్కన సోమయాజి మనుమరాలు  చిట్టా౦బిక మెట్టినిల్లు ,భర్త అల్లాడ మంత్రి .అల్లాడమంత్రిని గురించి ఆయనమనుమడు మడికి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తమిళనాడు తొలి సూపర్ స్టార్- త్యాగరాజ భాగవతార్

తమిళనాడు తొలి సూపర్ స్టార్- త్యాగరాజ  భాగవతార్ మాయవరం కృష్ణస్వామి త్యాగ రాజ భాగవతార్ అంటే తమిళనాడు తొలితరం వెండి తెర వేలుపు .అందరూ గౌరవంగా ,  ఆప్యాయంగా M.K.T.అని పిలిచేవారు .నటుడు నిర్మాత ,కర్నాటక సంగీత గాయకుడు గా  మహా వితరణ శీలిగా ,అనన్యమైన కీర్తి సాధించి ఘనతకెక్కాడు త్యాగరాజ భాగవతార్ .   … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

పరమాచార్యులు పరమాత్ములే

పరమాచార్యులు  పరమాత్ములే శ్రీ పళ్ళెం పాటి వెంకటేశ్వర్లుగారు హైదరాబాద్ లో రెండు దేవాలయాలు నిర్మించి అనేక పుణ్యకార్యాలు చేసి ,18పురాణాలకు తెలుగు అనువాదం చేసిన వారు .1962లోపరమచార్యులవారిని మొదటి సారి దర్శించారు ..’’భవిష్యత్తులో ఉన్నత స్థితి కి రాగలవు ‘’అని ఆశీర్వదించారు స్వామి . 1968లో స్వామి హైదరాబాద్ లో ఉన్నప్పుడు స్కంధగిరి పద్మారావు నగర్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దశావతారాలు అనిపించే 10 మంది రచయితలు , కళాకారులు ,,ప్రజాసేవ లో ధన్యులైన ప్రముఖులకు శ్రద్ధాంజలి

దశావతారాలు  అనిపించే 10 మంది రచయితలు , కళాకారులు ,,ప్రజాసేవ లో ధన్యులైన  ప్రముఖులకు  శ్రద్ధాంజలి సుమారు  నెలరోజుల కాలం లో మరణించిన 10మంది ప్రముఖులకు  శ్రద్ధాంజలి గా  సరసభారతి 143 వ కార్యక్రమ౦ స్థానిక శాఖా గ్రంధాలయం లో 27-7-19 శనివారం సాయంత్రం 5-30 గంటలకు నిర్వహిస్తోంది .అందరూ పాల్గొని అక్షర  నివాళి  అర్పించవలసినది గా ప్రార్ధన … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆల్ ఇండియా రెడీయో లో ”ఆలోచనాలోచనం ”

ఆల్ ఇండియా రెడీయో లో ”ఆలోచనాలోచనం ” విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుంచి వారం క్రితం ”ఆలోచనాలోచనం ”కు నాలుగు ఎపిసోడ్ లు రాసి ,వచ్చి రికార్డ్ చేయవలసిందిగా ఫోన్ రాగా ,1-అజ్ఞానం నశిస్తే అంతా  అమృతమయమే 2-ఉదార గుణమే ఉన్నతాశయం 3-గురువు గరిష్ఠత 4-త్రికాలజ్ఞానం సుఖం  కలిగిస్తుందా ? అనే నాలుగు ఎపిసోడ్ లు రాసి … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

ఉయ్యూరు శాఖా గ్రంథాలయం లో అయ్యంకి వారి 129 వ జయంతి

ఉయ్యూరు శాఖా గ్రంథాలయం లో అయ్యంకి వారి 129 వ జయంతి గ్రంథాలయ పితామహ ,సరస్వతీ రమా రమణ ,గ్రంథాలయ విశారద శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారి 129 వ జయంతి 24-7-19 బుధవారం సాయంత్రం 5 గంటలకు స్థానిక శాఖా గ్రంధాలయం లో జరిగింది . అయ్యంకి వారి స్మారక నగదు పురస్కారంగా 100 … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

’ప్రతిష్ట ఎప్పుడు “’?అని ప్రశ్నించిన పరమాచార్యులు

‘’ప్రతిష్ట ఎప్పుడు “’?అని ప్రశ్నించిన పరమాచార్యులు కృష్ణా జిల్లా నాగాయ లంక లాంచీల రేవు ఒడ్డున  సంత రోజున  చేపలు  అమ్ముకొనేవారు కొనేవారు కనీసం వెయ్యి  మంది వస్తారు .అక్కడనుంచి లాంచీలమీద పెనుమూడి రేవు ద్వారా గుంటూరు వెడతారు .ఇలాంటి చోట భగవంతుని జ్ఞాపకం చేసే ఆలయం కట్టాలని శ్రీ రాం చరణ్ కుందుర్తి వెంకట … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరసభారతి 143 వ కార్యక్రమ౦ రచయితలు , కళాకారులు ,,ప్రజాసేవ లో ధన్యులైన  ప్రముఖులకు నివాళిస్థానిక శాఖా గ్రంధాలయం లో 27-7-19 శనివారం సాయంత్రం 5-30 గంటలకు

రచయితలు , కళాకారులు ,,ప్రజాసేవ లో ధన్యులైన  ప్రముఖులకు నివాళి సుమారు  నెలరోజుల కాలం లో మరణించిన 9 మంది ప్రముఖులకు నివాళిగా సరసభారతి 143 వ కార్యక్రమ౦ స్థానిక శాఖా గ్రంధాలయం లో 27-7-19 శనివారం సాయంత్రం 5-30 గంటలకు నిర్వహిస్తోంది .అందరూ పాల్గొని నివాళి  అర్పించవలసినది గా ప్రార్ధన . 1-ప్రముఖ నవలా … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

కంచి పరమాచార్యులవారిని స్మరించి ఆపరేషన్ చేస్తానని చెప్పిన డా పిన్నమనేని వెంకటేశ్వరావు

విజయవాడ లబ్బీ పేట లో పిన్నమనేని పోలీ క్లినిక్ విశేషమైన ఖ్యాతి  నార్జించింది  .రోగులపాలిటి స్వర్గ ధామం  అనిపించి ఎన్నో ఏళ్ళు నడిచింది .అందులో పని చేయటానికి ఎక్కడెక్కడి నుంచో డాక్టర్లు వచ్చి చేరి తమబాధ్యత సక్రమంగా నిర్వహించి వైద్యాలయం కీర్తిని ఇనుమడింప జేశారు దీని స్థాపకులు డా .పిన్నమనేని వెంకటేశ్వరరావు .వారికుమార్తెలు కూడా డాక్టర్లు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కంచి పరమాచార్యుల ఔదార్యాన్ని పొందిన ప్రముఖులు-శ్రీ మాగంటి సూర్యనారాయణ పంతులుగారుx

కంచి పరమాచార్యుల ఔదార్యాన్ని పొందిన ప్రముఖులు-శ్రీ మాగంటి సూర్యనారాయణ పంతులుగారు   కంచి కామకోటి పీఠాధిపతులు ‘’మానుష రూపేణ చర ద్డైవం .శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్రులు సాక్షాత్తు మరొక ఆది శంకరులే .వారి తపస్సు దీక్ష సంకల్పం ,అమోఘం .దర్శనం తోనే అనుగ్రహ వర్షం కురిసే కాలమేఘం .మనసులోని కోరిక ముందే గ్రహించి … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

కంచి పరమాచార్యుల 70వ జయంతి సందర్భంగా  బ్రహ్మశ్రీ మండలీక వేంకట శాస్త్రి గారు ‘’ఆంద్ర ప్రభ ‘’లో రాసిన వ్యాసం

కంచి పరమాచార్యుల 70వ జయంతి సందర్భంగా  బ్రహ్మశ్రీ మండలీక వేంకట శాస్త్రి గారు ‘’ఆంద్ర ప్రభ ‘’లో రాసిన వ్యాసం 1937 ప్రారంభం లో కంచి పరమాచార్యులు శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్రులు కాశీ యాత్ర పూర్తి చేసి ,ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చి ,గోదావరి జిల్లాలో సంచారం ప్రారంభించారు .గ్రామాలలో తమ దివ్య … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ ఆర్ ఎస్. కె . గారు 23ఏళ్ళ క్రిందట నాకు రాసిన కార్డు

శ్రీ ఆర్ ఎస్. కె . గారు 23ఏళ్ళ క్రిందట నాకు రాసిన కార్డు   శ్రీ ఆర్  ఎస్.  కె . గారు  23ఏళ్ళ క్రిందట నాకు రాసిన కార్డు ఆంద్ర ప్రదేశ్  భారతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు ,బందరు  హిందూ హైస్కూల్ లెక్కలమేస్టారు ,ఆర్ఎస్ ఎస్ ,,ఆనాటి జనసంఘ్ ఇప్పటి బిజెపి లో కీలక … Continue reading

Posted in సమీక్ష | Tagged | Leave a comment

4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో, కృష్ణాజిల్లా రచయిప్రచురణార్థంతల సంఘం సహకారంతో, 2019 డిసెంబర్ 27, 28, 29 తేదీలలో విజయవాడ పిబి సిద్ధార్థ కళాశాలలో 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరగబోతున్నాయి. కృష్ణాజిల్లా రచయితల సంఘం ఆధ్వర్యాన 2007లో ప్రపంచ తెలుగు రచయితల తొలి మహాసభలు … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

డిగ్నిటి ఆఫ్ లేబర్ అనే జాబ్ రష్ 

డిగ్నిటి ఆఫ్ లేబర్ అనే జాబ్ రష్ మా బామర్ది బ్రహ్మం పరుగెత్తుకొచ్చాడు వగర్చు కొంటూ ” ఏంట్రా విశేషాలు ?”అడిగా . ”బావా ! ఒకప్పుడు కాలిఫోర్నియా లో గోల్డ్ రష్ జరిగిందని లక్షలాది జనం బంగారం కోసం ఇల్లూ  వాకిలీ వదిలి అక్కడికి వెళ్లి బంగారం కోసం ప్రతి అంగుళం త్రవ్వారని విన్నావా … Continue reading

Posted in రచనలు, రాజకీయం | Tagged | Leave a comment

కొత్త కొలువుకూటం 

కొత్త కొలువుకూటం  ఈ మధ్యదాకా ”గౌరవ సభ ” నలభై రోజుల్నించి ”కౌరవ సభ ” ఇప్పటిదాకా ”పూతు ”సభ  ఇప్పుడేమో ”బూతు సభ ” మొన్నటిదాకా ”అమ్మ ”కు వందనం  నేడేమో ” నీయమ్మా నీ యాలి ”లకు అందలం   ఇంతవరకు ప్రజా పాలనే ధ్యేయం  ఇప్పుడు ”విధ్వంసం కూల్చివేతలే ”ఆదర్శం   మాటకు  చేత … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

ప్రముఖులకు సరసభారతి నివాళి 

ప్రముఖులకు సరసభారతి నివాళి  ఇటీవల నెల రోజులలో మరణించిన ప్రముఖ రచయితలు1- శ్రీ రామతీర్థ , 2-మహాస్వప్న ,3-శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి ,4-దర్శకులు శ్రీ గిరీష్ కర్నాడ్ 5-,శ్రీమతి విజయనిర్మల ,6-నటుడు శ్రీ రాళ్ళపల్లి ,7-సాంఘిక విద్యా సేవకురాలు శ్రీమతి వి కోటేశ్వరమ్మ గార్లకు నివాళి కార్యక్రమాన్ని సరసభారతి 27-7-19 శనివారం సాయంత్రం 5-30 గం … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

జులై రమ్యభారతి మాసపత్రికలో శ్రీ రామతీర్థ శ్రీ మహాస్వప్న ,శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గార్లపై నా వ్యాసం

జులై రమ్యభారతి మాసపత్రికలో శ్రీ రామతీర్థ శ్రీ మహాస్వప్న ,శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గార్లపై నా వ్యాసం

Posted in రచనలు | Tagged | Leave a comment

గురు పౌర్ణమి సందర్భంగా నోరి వారి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేసిన కళా సుబ్బారావు పురస్కారం

గురు పౌర్ణమి సందర్భంగా నోరి వారి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేసిన కళా సుబ్బారావు పురస్కారం                         నేపధ్యం   సరసభారతి శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలకు మా తలిదండ్రులు కీ శే.గబ్బిట మృత్యుంజయ శాస్త్రి  శ్రీమతి భవానమ్మ  గారల స్మారక ఉగాది పురస్కారం అందజేయటానికి హైదరాబాద్ లో ఉన్న నోరి నరసింహ … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

నోరి చారిటబుల్ ట్రస్ట్ వారి ద్వారా శ్రీ కళా సుబ్బారావు గారి గురు పురస్కారం

నోరి చారిటబుల్ ట్రస్ట్ వారి ద్వారా శ్రీ కళా సుబ్బారావు గారి గురు పురస్కారం

Posted in సభలు సమావేశాలు | Leave a comment

తొలి లేక శయన ఏకాదశి

ఒకప్పుడు భగవాన్ శ్రీ కృష్ణుడు ,యుదిస్టిరుడైన ధర్మరాజుకు ప్రధమ లేక తొలి లేక శయన ఏకాదశి విశేషాలను తెలియ జేశాడు .దీన్ని బ్రహ్మదేవుడు తన పుత్రుడు నారదమహర్షికి తెలిపాడు అని భవిష్యోత్తర పురాణం పేర్కొన్నది .ఈ సందర్భం గా మాంధాత మహారాజు వృత్తాంతం తెలియ జేయబడింది .మాంధాత పాలనలో ఒకసారి తీవ్ర అనావృస్టి ఏర్పడి భయంకర … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అపర పతంజలి యోగి -మాస్టర్ సి.వి.వి

అపర  పతంజలి  యోగి -మాస్టర్ సి.వి.వి నేను రాసిన ”సిద్ధయోగిపుంగవులు ”పుస్తకం లోని” అపర  పతంజలి  యోగి -మాస్టర్ సి.వి.వి ”వ్యాసం జులై గురు సాయిస్థాన్  లో ప్రచురితమైంది -దుర్గాప్రసాద్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ఆంద్ర శాస్త్ర వేత్తలు 49 –‘’ఇ మెయిల్ ఇన్ఫార్మర్’’ సృష్టికర్త –టి.సోనీ రాయ్(చివరిభాగం )

ఇ మెయిల్స్ చెక్ చెక్ చేసుకోవటానికి డెస్క్ టాప్ మీద  ఆధారపడి వచ్చేది .ఈ ఇబ్బందిని అధిగమించటానికి హైదరాబాద్ కు చెందిన పారిశ్రామికవేత్త సోనీ రాయ్ పరి శోధకుడిగా మారి తానె ఒక యంత్రాన్ని సృష్టించాడు .2001లో రూపొందించిన ఈ గాడ్జెట్ అంటే’’ ఇ మెయిల్ ఇన్ఫార్మర్ ‘’ ఎప్పుడు ఇ మెయిల్ వచ్చినా అందించి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంద్ర శాస్త్రవేత్తలు 47-ప్రామాణిక సామాజిక శాస్త్రవేత్త –శ్రీ కాట్రగడ్డ బాలకృష్ణ

ఆధునిక ఆంద్ర శాస్త్రవేత్తలు 47-ప్రామాణిక సామాజిక శాస్త్రవేత్త –శ్రీ కాట్రగడ్డ బాలకృష్ణ గుంటూరు జిల్లా ఇంటూరులో శ్రీ కాట్రగడ్డ బాలకృష్ణ 26-9-1906 న జన్మించారు .మద్రాస్ వేస్లికాలేజిలో ఎం.ఏ.చదివి ,1921లో బ్రిటన్ వెళ్లి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చేరి ఏకాగ్రత కుదరక అమెరికా వెళ్లి  హార్వర్డ్ యూని వర్సిటిలో పొలిటికల్ సైన్స్ అధ్యయనం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 46-వాతావరణ శాస్త్ర నావకు చుక్కాని తూర్పు కోస్తా లో తుఫాన్ హెచ్చరిక రాడార్ కేంద్ర నిర్మాత ,పద్మభూషణ్ –శ్రీ పంచేటి కోటేశ్వరం

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 46-వాతావరణ శాస్త్ర నావకు చుక్కాని తూర్పు కోస్తా లో తుఫాన్ హెచ్చరిక రాడార్ కేంద్ర నిర్మాత ,పద్మభూషణ్  –శ్రీ పంచేటి కోటేశ్వరం 25-3-1915 న నెల్లూరు జిల్లాలో జన్మించిన శ్రీ పంచేటి కోటేశ్వరం శ్రీ సుబ్బారాయుడు ,శ్రీమతి వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు . మద్రాస్ ప్రెసిడేన్సికాలేజిలో 1939లో బి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 45-ప్రముఖ పారాసైకాలజి శాస్త్రవేత్త ,తత్వ వేత్త పద్మశ్రీ ప్రొఫెసర్ కోనేరు రామకృష్ణారావు

ఆధునిక ఆంధ్ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 45- 45-ప్రముఖ పారాసైకాలజి శాస్త్రవేత్త ,తత్వ వేత్త పద్మశ్రీ ప్రొఫెసర్ కోనేరు రామకృష్ణారావు శ్రీ కోనేరు రామకృ శాస్త్ర రత్నాలుష్ణారావు గారు కోస్తాతీరం లో 4-10-1932న జన్మించి ,ఆంధ్ర విశ్వ విద్యాలయం లో ఫిలాసఫీలో బి .ఏ ఆనర్స్1953లో  చేసి సైకాలజీ లో ,ఎం.ఏ. ఆనర్స్1955లో   పాసై ,1962 … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 44—మెదడు పై విశేష పరిశోధన చేసిన మానసిక శాస్త్రవేత్త –డా .తురగ దేశి రాజు

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 44—మెదడు పై విశేష పరిశోధన చేసిన మానసిక శాస్త్రవేత్త –డా .తురగ దేశి రాజు 26-5-1935న పశ్చిమ గోదావరిజిల్లా పెరవలి మండలంలో లోని పిట్టలవేమవరం గ్రామం లో  తురగ దేశి రాజు జన్మించారు .1954లో ఆంధ్రా యూని వర్సిటిలో బిఎస్ సి పాసై  బెనారస్ హిందూ యూని వర్సిటి లో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 43-పురాతత్వ పరిశోధక పితామహ –శ్రీ వేలూరి వెంకట కృష్ణ శాస్త్రి

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 43-పురాతత్వ పరిశోధక పితామహ –శ్రీ వేలూరి వెంకట కృష్ణ శాస్త్రి వేలూరి వెంకట కృష్ణ శాస్త్రిగారు కృష్ణాజిల్లా చిరివాడ అగ్రహారం లో 23-10-1934 న శ్రీ వేలూరి పార్ధసారధి శ్రీమతి అనసూయ దంపతులకు జన్మించారు .గుడివాడ కాలేజి లో డిగ్రీ పూర్తీ చేసి ,హైదరాబాద్ ఉస్మానియా యూని వర్సిటి నుడి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | 1 Comment

ఆధునిక ఆంద్ర శాస్త్ర రత్నాలు 42- కృష్ణా గోదావరి బేసిన్ లో చమురు ,సహజవాయు నిక్షేపాల ఉనికి తెలిపిన అనుపమ భూగర్భ శాస్త్ర వేత్త –శ్రీ వావిలాల వాసు దేవ శాస్త్రి

ఆధునిక ఆంద్ర శాస్త్ర రత్నాలు 42-  కృష్ణా గోదావరి బేసిన్ లో చమురు ,సహజవాయు నిక్షేపాల ఉనికి  తెలిపిన అనుపమ భూగర్భ శాస్త్ర వేత్త    –శ్రీ వావిలాల వాసు దేవ శాస్త్రి  భూగర్భ శాస్త్ర లోతులు తరచిన శాస్త్రవేత్త శ్రీ వావిలాల వాసుదేవ శాస్త్రి గారు 24-8-1926న కృష్ణాజిల్లా మచిలీపట్నం లో శ్రీ వావిలాల సీతారామ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక శాస్త్ర రత్నాలు – 41-ఆంద్ర చరిత్ర చతురానన –శ్రీ చిలుకూరి వీరభద్రరావు

ఆధునిక శాస్త్ర రత్నాలు – 41-ఆంద్ర చరిత్ర చతురానన –శ్రీ చిలుకూరి వీరభద్రరావు 17-10-1872న పశ్చిమ గోదావరిజిల్లా రేలంగిలో ఒక పేద  బ్రాహ్మణ కుటుంబం లో చిలుకూరి వీరరాజు దంపతులకు  శ్రీ చిలుకూరి వీరభద్రరావు జన్మించారు .సంస్కృత ఆంధ్రాలలో సాధికారత సాధించారు .దేశోపకారి ,విబుధ రంజని ,సత్యవాదిని ,ఆంద్ర కేసరి మొదలైన పత్రికలకు సారధ్యం వహించారు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 40-భారతీయ ,ఆంద్ర సంస్కృతుల చరిత్ర నిష్ణాతులు మేధావి , బహుముఖీన ప్రజ్ఞాశాలి ,ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు న్యాయవాది –శ్రీ దిగవల్లి వెంకట శివరావు

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 40-భారతీయ ,ఆంద్ర సంస్కృతుల చరిత్ర నిష్ణాతులు మేధావి , బహుముఖీన ప్రజ్ఞాశాలి ,ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు  న్యాయవాది –శ్రీ దిగవల్లి వెంకట శివరావు దిగవల్లి వేంకటశివరావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఫిబ్రవరి 14 1898 న నియోగి బ్రాహ్మణులైన వెంకటరత్నం, సూర్యమాణిక్యాంబ దంపతులకు జన్మించారు. శివరావుగారు కాలికట్లో ఫస్టు ఫారం చదువుతూవుండగా వారి బావగారికి బదలీ కావడంవల్ల ఫస్టు ఫారం బెంగళూరులో తిరిగి చదవటం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అపవిత్రఃః పవిత్రోవా” 

అపవిత్రఃః పవిత్రోవా” ఇవాళ నాదెండ్ల  ఆ మొన్న రమేష్ వెంకటేష్ అండ్ కో బిజెపి తీర్ధం పుచ్చుకొన్నారు  రేపు ఇంకెందరో? అందరికీ అమిత్ షా ”అపవిత్రఃః పవిత్రోవా”మంత్రం చెప్పి ప్రక్షాళన చేసి కమలం రంగు అంటించి ,తిరు క్షవరమూ చేయించి ఊర్ధ్వ పుండ్రాలు పెట్టి  కాషాయం కప్పికలుపుకొంటాడు పాపం బాబు ఇలా ఫాన్ గాలి వాళ్ళను … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 39-పురాలిపి శాస్త్రవేత్త ,పరిశోధక శిఖామణి –శ్రీ మల్ల౦పల్లి సోమశేఖర శర్మ(శాసనాల శర్మ )

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 39-పురాలిపి శాస్త్రవేత్త ,పరిశోధక శిఖామణి –శ్రీ మల్ల౦పల్లి సోమశేఖర శర్మ(శాసనాల శర్మ ) ‘’డిగ్రీలు లేని పాడుకాలాన ‘’పుట్టావు అని విశ్వనాథ వారి సానుభూతి పొంది ఆయన కృతిని అంకితం పుచ్చుకొన్న శాసన పరిశోధకులు పురాలిపి శాస్త్రవేత్త విజ్ఞాన సర్వస్వం ద్వారా వెలుగులోకి వచ్చిన శ్రీ మల్లం పల్లి సోమశేఖర … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 38-ప్రామాణిక చరిత్ర పరిశోధకులు –భారత చరిత్ర భాస్కర శ్రీ కోట వెంకటా చలం

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 38-ప్రామాణిక చరిత్ర పరిశోధకులు –భారత చరిత్ర భాస్కర శ్రీ కోట వెంకటా చలం   చరిత్ర అంటే బ్రిటిష్ వారు చెప్పింది, రాసిందే చరిత్ర అని చాలా కాలం మనం నమ్మాం.చదివాం గుడ్డిగా .కాని అసలైన చరిత్ర అదికాదు అనిఖండి౦చి  ,సహేతుకంగా రుజూవు  చేసి ,పాశ్చాత్య చరిత్ర పరిశోధకులనూ మెప్పించి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 37- శాసన లిపి పరిశోధన పరబ్రహ్మ –డా.పుచ్చా వాసు దేవ పరబ్రహ్మ శాస్త్రి

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 37- శాసన లిపి పరిశోధన పరబ్రహ్మ –డా.పుచ్చా వాసు దేవ పరబ్రహ్మ శాస్త్రి   ఆధునిక 37- శాసన లిపి పరిశోధన పరబ్రహ్మ  –డా.పుచ్చా వాసు దేవ పరబ్రహ్మ శాస్త్రి పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి’ తెలుగువారు గర్వించదగిన ప్రఖ్యాత చారిత్రక, పురావస్తు పరిశోధకుడు. కాకతీయుల చరిత్రపై అనేక అధ్యయనాలు చేసి పలు గ్రంథాలను … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 35-తెలుగు –ఇంగ్లీష్ ,ఇంగ్లిష్- తెలుగు నిఘంటు నిర్మాత –పావులూరి శంకరనారాయణ

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 35-తెలుగు –ఇంగ్లీష్ ,ఇంగ్లిష్- తెలుగు నిఘంటు నిర్మాత –పావులూరి శంకరనారాయణ  నలభై ఏభై ఏళ్ళక్రితం శంకరనారాయణ డిక్షనరీ లేని ఇల్లు ఆంద్ర దేశం లో  ఉండేదికాదు .విద్యార్ధులకు కల్పవృక్షంగా ఉండేది .దీని నిర్మాత శంకరనారాయణ అని అందరికీ తెలుసుకాని ,ఆయన ప్రముఖ గణిత శాస్త్రవేత్త ,తొలి తెలుగు గణితశాస్త్ర గ్రంధ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 33-అరటి మట్టలనుంచి పొటాషియం పెర్మా౦గ నేట్ తయారు చేయించిన ఆర్ధికవేత్త –కాళీ పట్నపు కొండయ్య

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 33-అరటి మట్టలనుంచి పొటాషియం పెర్మా౦గ నేట్ తయారు చేయించిన ఆర్ధికవేత్త –కాళీ పట్నపు కొండయ్య ప్రముఖ ఆర్ధిక వేత్త ,మేధావి శ్రీ కాళీపట్నం కొండయ్య 1900లో గోదావరి జిల్లాలో జన్మించారు .విజ్ఞాన ఆర్ధిక చరిత్ర శాస్తాలలో సాటిలేని వాడు అనిపి౦చు కొన్నారు  స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొనటం వలన  వీటికి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 31-క్వాసే క్రిస్టలైన్ మిశ్ర ధాతు రూపకర్త –డా.పచ్చా రామ చంద్రరావు Inbox x

కృష్ణాజిల్లా కౌఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 31-క్వాసే క్రిస్టలైన్ మిశ్ర ధాతు రూపకర్త –డా.పచ్చా రామ చంద్రరావు కృష్ణాజిల్లా కౌతవరం లో 1942మార్చి 21న నారాయణ స్వామి దంపతులకు జన్మించిన డా.పచ్చా రామ చంద్రరావు ఉస్మానియా యూనివర్సిటి నుంచి  1959లో బిఎస్ సి ,1961లో ఏం ఎస్ సి డిగ్రీలు పొందారు .బెంగుళూర్ లో ఇండియన్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment