సాహితీ బంధువులకు శుభవార్త
నిన్నసాయంత్రం ఉయ్యూరు సిటీ కేబుల్ అనబడే ”మన ఛానల్ ”కు చెందిన జర్నలిస్ట్ శ్రీ ప్రకాష్ నన్నుకలిసి ”మాస్టారూ !సరసభారతి ప్రచురణలన్నీ ”మనఛానల్ ”ద్వారా ప్రసారం చేద్దాము మీకు ఎప్పుడు వీలు ఉంటుందో చెబితే కెమెరామన్ ను మీ ఇంటికి పంపిస్తాను ”అన్నారు .సంతోషం అని థాన్క్స్ చెప్పాను .ఇవాళఉదయం కెమెరామన్ శ్రీకాంత్ ఫోన్ చేసి ఎప్పుడు రమ్మంటారు అని అడిగితె ”నీకు వీలున్నప్పుడు రా ”అన్నాను ”ఐతే సాయంత్రం 4గంటలకు వస్తాను ”అన్నాడు ఒకే అన్నాను
అన్నట్లుగానే వచ్చాడు మొదటగా ”అణుశాస్త్ర వేత్త డా ఆకునూరి వెంకటరామయ్య ”పుస్తకాన్ని పరిచయం చేశాను .సుమారు 15 నిమిషాలలో .ఇది ఈరోజు రాత్రికి ప్రసారం అవుతుందని చెప్పాడు .సరే అన్నా .రేపు”ప్రయోగాత్మక కాంతి శాస్త్ర పిత డా పుచ్చా వెంకటేశ్శ్వర్లు ”గారి పుస్తకం పరిచయ చేస్తాను .తర్వాత ”కెమోటాలజి పీత కోలాచల సీతారామయ్య ”గారి పుస్తకాన్ని ఆతర్వాత వరుసగా మరికొన్నిటిని పరిచయం చేస్తాను .దీనికి ప్రకాష్ గారి ఉత్సాహానికి ,సరసభారతి పై ఆయనకు మా ఛానల్ కూ ఉన్న ఆదరాభిమానాలకు, వీడియో తీసిన శ్రీకాంత్ కు ధన్యవాదాలు -దుర్గాప్రసాద్

